ఆకాశ్-ఎన్‌జీ క్షిపణి పరీక్షను ఎక్కడ నిర్వహించారు?
Sakshi Education
భూతలం నుంచి గాల్లోని ప్రయోగించగల ఆకాశ్-ఎన్‌జీ (న్యూ జనరేషన్) క్షిపణి పరీక్షను భారత్ విజయవంతంగా నిర్వహించింది.
ఈ క్షిపణిని జనవరి 25న ఒడిశాలోని బాలాసోర్ జిల్లా చాందిపూర్ ఐటీఆర్ నుంచి ప్రయోగించారు. ఈ ప్రయోగాన్ని భారత వాయుసేన అధికారుల నేతృత్వంలో డీఆర్‌డీఓ, బీడీఎల్, బీఈఎల్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. ఆకాశ్-ఎన్‌జీ క్షిపణి గాలిలో నుంచి జరిగే రాడార్ క్రాస్ సెక్షన్ దాడుల నుంచి భూతలాలను రక్షిస్తుంది. అత్యంత కచ్చితత్వంతో ఇది లక్ష్యాలను అడ్డుకోగలదు. ఇతర వ్యవస్థలతో పోలిస్తే ఈ న్యూజనరేషన్ క్షిపణిలో పనితీరు ఉత్తమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆకాశ్-ఎన్‌జీ (న్యూ జనరేషన్) క్షిపణి పరీక్ష విజయవంతం
ఎప్పుడు : జనవరి
ఎవరు : భారత వాయుసేన, డీఆర్‌డీఓ, బీడీఎల్, బీఈఎల్
ఎక్కడ : చాందిపూర్ ఐటీఆర్, బాలాసోర్ జిల్లా, ఒడిశా
ఎందుకు : భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు

Published date : 26 Jan 2021 07:57PM