ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌ను కొనుగొలు చేసిన స్టార్టప్?
Sakshi Education
టెస్ట్ ప్రిపరేషన్ సేవల దిగ్గజం ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్(ఏఈఎస్‌ఎల్ )ను... ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ సంస్థ బైజూస్ కొనుగోలు చేసింది.
తద్వారా ఆఫ్‌లైన్ విద్యా విభాగంలోనూ బైజూస్ తన కార్యకలాపాలు విస్తరించనుంది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ దాదాపు 1 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 7,300 కోట్లు) ఉంటుంది. బైజూస్ ఇప్పటిదాకా కుదుర్చుకున్న డీల్స్‌లో ఇదే అతి పెద్దది కాగా ఎడ్–టెక్ రంగానికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత భారీ ఒప్పందాల్లో ఇది కూడా ఒకటి. కొంత నగదు, కొంత ఈక్విటీ రూపంలో ఈ డీల్ ఉంటుందని ఏప్రిల్ 5న ఆకాష్ తెలిపింది.
33 ఏళ్ల ఆకాష్ ప్రస్థానం ..
ఏఈఎస్‌ఎల్ దాదాపు 33 ఏళ్లుగా మెడికల్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మొదలైన వాటికి సంబంధించి విద్యార్థులకు శిక్షణనిస్తోంది. దేశవ్యాప్తంగా 215 సెంటర్లు (ఫ్రాంచైజీలు సహా), 2.5 లక్షల పైచిలుకు విద్యార్థులు ఉన్నారు. 2019లో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్ ఇందులో 37.5 శాతం వాటాను కొనుగోలు చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌ను కొనుగొలు చేసిన స్టార్టప్?
ఎప్పుడు : ఏప్రిల్5
ఎవరు : ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ సంస్థ బైజూస్
ఎందుకు : ఆఫ్‌లైన్ విద్యా విభాగంలోనూ బైజూస్ తన కార్యకలాపాలను విస్తరించేందుకు

Published date : 06 Apr 2021 06:21PM