ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు తొలుత ఎక్కడ ప్రారంభమయ్యాయి?
Sakshi Education
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా... ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా ఉన్న 75 ప్రాంతాల్లో 75 వారాలపాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలను మార్చి 12న తొలుత గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 2022 ఆగస్టు 15 వరకూ వేడుకలు కొనసాగుతాయని మోదీ పేర్కొన్నారు.
పాదయాత్ర ప్రారంభం...
భారత జాతిపిత మహాత్మాగాంధీ చేపట్టిన చరిత్రాత్మక దండియాత్రను స్మరించుకుంటూ సబర్మతీ ఆశ్రమం నుంచి పాదయాత్రకు ప్రధాని మోదీ పచ్చజెండా ఊపారు. ఈ యాత్రలో 81 మంది పాల్గొంటున్నారు. వీరంతా 386 కిలోమీటర్లు నడిచి ఏప్రిల్ 5వ తేదీ నాటికి నవసరీ జిల్లాలోని దండికి చేరుకుంటారు. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా మహాత్మాగాంధీ 78 మంది అనుచరులతో కలిసి 1930 మార్చి 12న దండియాత్రలో మొదటి అడుగు వేసిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ప్రారంభం
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : సబర్మతీ ఆశ్రమం, అహ్మదాబాద్, గుజరాత్ రాష్ట్రం
ఎందుకు : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా...

Published date : 15 Mar 2021 06:07PM