Skip to main content

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లికి అగ్రస్థానం

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆగస్టు 26న ప్రకటించిన ‘ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌’ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
Edu newsకోహ్లి 871 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, రోహిత్ 855 పాయింట్లతో రెండో ర్యాంకులో నిలిచాడు. వీరి తర్వాత బాబర్ ఆజమ్ (పాకిస్తాన్), రాస్ టేలర్ (న్యూజిలాండ్), డుప్లెసిస్ (దక్షిణాఫ్రికా) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాలను దక్కించుకున్నారు.

టెస్టు ర్యాంకుల్లో...
ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకుల్లో స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) 911 పాయింట్లతో తొలి స్థానాన్ని కై వసం చేసుకోగా... విరాట్ కోహ్లి (886 పారుుంట్లు), మార్నస్ లబ్‌షేన్ (827 పాయింట్లు) తర్వాతి రెండు స్థానాలను సాధించారు.

టి20 కేటగిరీలో...

టి20 కేటగిరీలో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ టాప్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. భారత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ రెండో ర్యాంకును, ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో టెస్టుల్లో ప్యాట్ కమిన్స్‌ (ఆస్ట్రేలియా, 904 పాయింట్లు), వన్డేల్లో ట్రెంట్ బౌల్ట్‌ (న్యూజిలాండ్, 722 పాయింట్లు), టి20ల్లో రషీద్ ఖాన్ (736 పాయింట్లు) మొదటి స్థానంలో ఉన్నారు. 719 పాయింట్లతో భారత బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వన్డేల్లో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.

క్విక్ రివ్యూ :
ఏమిటి
: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కైవసం
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి
Published date : 29 Aug 2020 11:49AM

Photo Stories