Skip to main content

ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ ప్రారంభం

ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా ఫిబ్రవరి 21న ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్-2020 ప్రారంభమైంది.
Current Affairsమార్చి 8వ తేదీ వరకు జరగనున్న ఈ టోర్నీలో పాల్గొంటున్న జట్ల సంఖ్య 10 కాగా... మొత్తం మ్యాచ్‌ల సంఖ్య 23. లీగ్ దశలో ప్రతీ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు ఆయా గ్రూప్‌ల నుంచి సెమీఫైనల్‌కు చేరుతాయి. ఫైనల్ మ్యాచ్‌ను మెల్‌బోర్న్ ఎంసీజీ మైదానంలో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 21న జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు చేసింది. తర్వాత ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 115 పరు గుల వద్ద ఆలౌటైంది.

గ్రూప్‌ల వివరాలు
గ్రూప్ ‘ఎ’:
భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్.
గ్రూప్ ‘బి’: ఇంగ్లండ్, వెస్టిండీస్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, థాయ్‌లాండ్.

ఎవరికెంత ప్రైజ్‌మనీ...
విజేత:
10 లక్షల డాలర్లు (రూ. 7 కోట్ల 18 లక్షలు)
రన్నరప్: 5 లక్షల డాలర్లు (రూ. 3 కోట్ల 59 లక్షలు)
సెమీఫైనల్స్‌లో ఓడిన రెండు జట్లకు: 2 లక్షల 10 వేల డాలర్ల చొప్పున (రూ. కోటీ 50 లక్షలు)
గ్రూప్ మ్యాచ్‌లో ఒక్కో విజయానికి: 15 వేల డాలర్ల చొప్పున (రూ. 10 లక్షల 77 వేలు)
గ్రూప్ దశలోనే నిష్క్రమించిన ఆరు జట్లకు: 30 వేల డాలర్ల చొప్పున (రూ. 21 లక్షల 54 వేలు)

భారత జట్టు వివరాలు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, రిచా ఘోష్, తానియా, పూనమ్ యాదవ్, రాధ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, పూజ, అరుంధతి రెడ్డి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎక్కడ : సిడ్నీ, ఆస్ట్రేలియా
Published date : 22 Feb 2020 05:45PM

Photo Stories