ఐసీసీ దశాబ్దపు అవార్డుల రేసులో నిలిచిన భారత ఆటగాళ్లు?
‘ప్లేయర్ ఆఫ్ ద డికేడ్’తో పాటు టెస్టు, వన్డే, టి20ల్లో వేర్వేరుగా అవార్డులు ప్రకటిస్తారు. ఇందు కోసం ఐసీసీ పలువురు స్టార్ ఆటగాళ్ల పేర్లను ప్రతిపాదించింది. దశాబ్దపు మేటి ఆటగాడి అవార్డు కోసం భారత్ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లి, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బరిలో నిలిచారు. వీరితో పాటు స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్, డివిలియర్స్, సంగక్కర ఈ జాబితాలో ఉన్నారు.
విడివిడిగా కూడా...
టెస్టులు, వన్డేలు, టి20ల్లో విడివిడిగా కూడా కోహ్లి పేరు నామినేట్ అయింది. వన్డే అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్‌తో పాటు ఎమ్మెస్ ధోని, రోహిత్ శర్మ, మలింగ, స్టార్క్, డివిలియర్స్, సంగక్కర పోటీ పడుతున్నారు. అంతర్జాతీయ టి20ల్లో రషీద్ ఖాన్, ఇమ్రాన్ తాహిర్, ఆరోన్ ఫించ్, మలింగ, గేల్‌లనుంచి కోహ్లికి పోటీ ఎదురవుతోంది. ఓటింగ్ ద్వారా ఐసీసీ ఈ అవార్డుల తుది విజేతను నిర్ణరుుస్తుంది.
70 సెంచరీలు...
గత పదేళ్లలో మూడు ఫార్మాట్‌లలో కలిపి విరాట్ కోహ్లి సుమారు 20 వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇందులో 70 సెంచరీలు ఉండగా, అన్నింటిలోనూ అతని సగటు 50కి పైగా ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద డికేడ్ అవార్డు రేసులో నిలిచిన భారత ఆటగాళ్లు
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్