ఐరాసలో ఇరాన్‌పై వీగిన తీర్మానం
Sakshi Education
ఇరాన్ పై ఐక్యరాజ్య సమితి విధించిన ఆయుధ ఆంక్షలను నిరవధికంగా కొనసాగించాలని కోరుతూ అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో వీగిపోయింది.
తీర్మానాన్ని ఆమోదించడానికి భద్రతా మండలిలోని 15 సభ్య దేశాల్లో కనీసం 9 దేశాలు మద్దతు పలకాల్సి ఉంటుంది. అమెరికా తీర్మానానికి అనుకూలంగా రెండు ఓట్లు, వ్యతిరేకంగా రెండు ఓట్లు రాగా, 11 మంది సభ్యులు ఓటింగ్‌కి దూరంగా ఉన్నారు. అమెరికా తీర్మానానికి అనుకూలంగా కేవలం డొమినికన్ రిపబ్లిక్ నుంచి మాత్రమే మద్దతు లభించింది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తీర్మానం ఓడిపోయినట్లు ప్రకటించారు. ఈ తీర్మానాన్ని రష్యా, చైనా తీవ్రంగా వ్యతిరేకించాయి.
2015లో...
2015లో ఇరాన్ కీ, ఆరు పెద్ద దేశాలైన రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీల మధ్య, అణ్వాయుధ నిరాయుధీకరణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ అణ్వాయుధాలను నిర్వీర్యం చేస్తూ, నిరాయుదీకరణకు కృషిచేయాలి. ఈ ఒప్పందం నుంచి 2018లో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వైదొలిగింది.
చదవండి: ఆరు అగ్ర దేశాలతో ఇరాన్ అణు ఒప్పందం
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐరాసలో ఇరాన్‌పై వీగిన తీర్మానం
ఎప్పుడు : ఆగస్టు 15
ఎవరు : అమెరికా
ఎందుకు :ఇరాన్ పై ఐక్యరాజ్య సమితి విధించిన ఆయుధ ఆంక్షలను నిరవధికంగా కొనసాగించాలని

Published date : 17 Aug 2020 05:26PM