Skip to main content

ఐరాస ప్రధాన కార్యదర్శిగా మరోసారి ఎన్నికైన వ్యక్తి?

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి(సెక్రటరీ జనరల్‌)గా ఆంటోనియో గుటెరస్‌(72) మరోసారి ఎన్నికయ్యారు.
Current Affairs
ఐరాస సాధారణ సభ జూన్‌ 18న ఆయనను ఎన్నుకుంది. రెండోసారి ఈ పదవిలో గుటెరస్‌ నియామకం 2022 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. 2026 డిసెంబర్‌ 31వ తేదీదాకా.. అంటే ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. జనరల్‌ సెక్రటరీగా గుటెరస్‌ రెండోసారి ఎన్నికకు భారత్‌ ఇంతకుముందే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గుటెరస్‌ 2017 జనవరి 1న ఐరాస 9వ సెక్రెటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు. 2021, డిసెంబర్‌ 31న పదవీ కాలం ముగియనుంది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఐరాస ప్రధాన కార్యదర్శిగా మరోసారి ఎన్నికైన వ్యక్తి?
ఎప్పుడు : జూన్‌ 18
ఎవరు : ఆంటోనియో గుటెరస్‌
Published date : 19 Jun 2021 06:45PM

Photo Stories