ఐరాస భద్రతా మండలిలో సభ్య దేశాల సంఖ్య?
Sakshi Education
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్ తన రెండేళ్ల పదవీ కాలాన్ని (2021-22) 2021, జనవరి 1 నుంచి ప్రారంభించింది.
ప్రపంచ శాంతి, భద్రతలను పర్యవేక్షించే ఈ అత్యున్నత విధాన నిర్ణయ మండలిలో భారత్‌కు చోటు దక్కడం ఇది ఎనిమిదోసారి. ఇటీవల ఐదు తాత్కాలిక సభ్యదేశాల కోసం జరిగిన ఎన్నికల్లో భారత్ 184 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2021 ఆగస్టు నెలలో, 2022లో మరో నెల పాటు భద్రతా మండలి అధ్యక్ష పదవిలో భారత్ కొనసాగనుంది.
15 సభ్య దేశాలు...
- 15 దేశాలు సభ్యులుగా గల ఐరాస భద్రతా మండలిలో అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి.
- తాత్కాలిక సభ్యదేశాలుగా ఎస్తోనియా, నైజర్, సెయింట్ విన్సెంట్ గ్రెనెడైన్స్, ట్యునీషియా, వియత్నాం కొనసాగుతున్నాయి.
- 2021, జనవరి 1 నుంచి భారత్, మెక్సికో, ఐర్లాండ్, నార్వే, కెన్యా కొత్తగా చేరాయి.
Published date : 02 Jan 2021 05:44PM