Skip to main content

ఐరాస 2020 ఆర్థిక నివేదిక విడుదల

ఐక్యరాజ్యసమితి ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు 2020’ పేరుతో రూపొందించిన నివేదిక జనవరి 17న విడుదలైంది.
Current Affairsభారత్ భారీ ఆర్థిక వృద్ధి సాధనకు వ్యవస్థాగత సంస్కరణల కొనసాగింపు అవసరమని ఈ నివేదిక పేర్కొంది. ఒకవైపు సంస్థాగత, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లకు సంబంధించి వ్యవస్థాగత సంస్కరణలు మరోవైపు ప్రభుత్వ వ్యయాల ద్వారా మందగమనంలో ఉన్న ఆర్థిక వృద్ధిని మెరుగుపరచవచ్చని సూచించింది.

ఐరాస 2020 ఆర్థిక నివేదిక - ముఖ్యాంశాలు
  • 2018లో భారత్ వృద్ధి 6.8 శాతం. 2019లో ఇది 5.7 శాతానికి తగ్గింది. 2020లో వృద్ధి 6.6 శాతానికి రికవరీ కావచ్చు. అయితే భారీ వృద్ధికి మాత్రం రెగ్యులేటరీ, సంస్థాగత సంస్కరణలు కీలకం.
  • చైనా వృద్ధి 2019లో 6.1 శాతం, 2020లో 6 శాతంగా ఉండొచ్చు.
  • భారత్‌లో 2019-20 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 5 శాతం, 2020-21 ఆర్థిక సంవత్సరం లో 5.8-5.9 శాతం శ్రేణిలో నమోదయ్యే అవకాశం ఉంది.
  • ప్రతి ఐదు దేశాల్లో ఒకదేశం తలసరి ఆదాయం 2020 ఏడాది స్థిరంగా ఉండడమో లేక తగ్గుతుండడమో జరిగే అవకాశం ఉంది. అయితే తలసరి ఆదాయం 4 శాతం పైగా పెరిగే అవకాశం ఉన్న దేశాల్లో భారత్ ఒకటి.
  • ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక బలహీనత సుస్థిరాభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగించే అవకాశం ఉంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు 2020 నివేదిక విడుదల
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : ఐక్యరాజ్యసమితి

మాదిరి ప్రశ్నలు
Published date : 18 Jan 2020 05:44PM

Photo Stories