ఐపీఎల్ నుంచి తప్పుకున్న వివో
Sakshi Education
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2020కి ప్రముఖ మొబైల్ సంస్థ ‘వివో’ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించడం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆగస్టు 6న అధికారికంగా ప్రకటించింది.
‘2020 ఐపీఎల్‌కు సంబంధించి బీసీసీఐ, వివో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తమ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నాయి’ అంటూ వెల్లడించింది. ఏడాదికి రూ. 440 కోట్లు చెల్లించే విధంగా ‘వివో’ ఐపీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఐపీఎల్ నుంచి వివో తప్పుకోవడంలో భారతీయుల మనోభావాలతో పాటు ఆర్థిక పరమైన అంశాలు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా పరిస్థితుల్లో తాము ఈ సారి రూ. 440 కోట్లు చెల్లించలేమని, కనీసం 50 శాతం మొత్తాన్ని తగ్గించాలంటూ వివో కొన్నాళ్ల క్రితం బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. దీనికి బోర్డు ఒప్పుకోలేదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐపీఎల్–2020కి ప్రముఖ మొబైల్ సంస్థ ‘వివో’ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించడం లేదు
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)
Published date : 09 Aug 2020 12:28PM