Skip to main content

ఐఓఏకు జరిమానా చెల్లించం : గోవా

భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తమపై విధించిన రూ. 6 కోట్ల జరిమానా చెల్లించబోమని గోవా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
36వ జాతీయ క్రీడల నిర్వహణను తరచూ వాయిదా వేస్తూ ఆలస్యం చేయడంతో గోవా ప్రభుత్వంపై రూ. 10 కోట్లు జరిమానాను ఐఓఏ విధించింది. అనంతరం ఆ మొత్తాన్ని రూ. 6 కోట్లకు తగ్గించింది. అయితే ఇప్పటికే తమ సర్కారు స్టేడియాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం రూ. 390.47 కోట్లు వెచ్చించిందని.. ఇంకా జరిమానా కూడా చెల్లించాలంటే కుదరదని రాష్ట్ర క్రీడల మంత్రి మనోహర్ అజ్‌గాంకర్ స్పష్టం చేశారు.

చివరిసారిగా 2011లో 35వ జాతీయ క్రీడలు జార్ఖండ్‌లో జరిగాయి. అదే ఏడాది తదుపరి క్రీడల నిర్వహణ హక్కుల్ని గోవా పొందింది. కానీ 8 ఏళ్లయినా ఇంకా నిర్వహించలేకపోయింది.
Published date : 08 Aug 2019 06:00PM

Photo Stories