ఐఎస్‌ఎస్‌లో సూక్ష్మజీవుల గుర్తింపు
Sakshi Education
అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్‌ఎస్)లో బ్యాక్టీరియా, శిలీంధ్రం వంటి సూక్ష్మజీవులు ఉన్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన శాస్త్రవేత్తల బృందం గుర్తించింది.
దీంతో అక్కడి వ్యోమగాముల ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐఎస్‌ఎస్‌లో భూమిపై ఉండే జిమ్, ఆస్పత్రుల్లో ఉండే అన్ని సూక్ష్మజీవులు ఉన్నట్లు కనుగొన్నారు. అక్కడ కనుగొన్న బ్యాక్టీరియాలో 26 శాతం స్టెఫైలోకోకస్, 23 శాతం పాంటియా, 11 శాతం బాసిల్లస్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అలాగే మానవుడి జీర్ణవ్యవస్థలో ఉండే ఎంటిరోబ్యాక్టర్, స్టెఫైలోకోకస్ ఆరియస్ (10 శాతం)ను గుర్తించినట్లు చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్‌ఎస్)లో సూక్ష్మజీవుల గుర్తింపు
ఎప్పుడు : ఏప్రిల్ 8
ఎవరు : అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్‌ఎస్)లో సూక్ష్మజీవుల గుర్తింపు
ఎప్పుడు : ఏప్రిల్ 8
ఎవరు : అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా
Published date : 09 Apr 2019 05:18PM