‘ఐఎండీబీ’ ర్యాంకింగ్స్ లో ప్రియాంక కు తొలిస్థానం
Sakshi Education
ఐఎండీబీ ‘టాప్ 10 స్టార్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అండ్ టెలివిజన్’ జాబితాలో ప్రియాంక చోప్రా తొలిస్థానంలో నిలిచారు.
ఐఎండీబీ ప్రో స్టార్ మీటర్ ర్యాంకింగ్స్ నుంచి వచ్చిన డేటా ఆధారంగా ఈ జాబితా రూపొందిస్తారు. నెలకు 200 మిలియన్లకు పైగా వీక్షణల డేటాను విశ్లేషించి, ఆయా నటులకు సంబంధించి సంవత్సరం పొడవుగా సాధించిన ‘వీక్షణల’ద్వారా ర్యాంకులు ప్రకటిస్తారు. సల్మాన్ హీరోగా నటించిన ‘భారత్’ సినిమాలో నటించిన నటి దిశా పటాని జాబితాలో రెండవ స్థానంలో ఉండగా, ‘వార్’నటుడు హృతిక్ రోషన్ మూడవ స్థానంలో ఉన్నారు. కియారా అద్వానీ నాల్గవ స్థానం సాధించగా, సూపర్ స్టార్స్ అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ వరుసగా ఐదు, ఆరవ స్థానాల్లో ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ‘ఐఎండీబీ’ ర్యాంకింగ్స్ లో ప్రియాంక కు తొలిస్థానం
ఎవరు: ప్రియాంక చోప్రా
ఎక్కడ: ముంబై
ఎందుకు: నెలకు 200 మిలియన్లకు పైగా వీక్షణల డేటాను విశ్లేషించి, ఆయా నటులకు సంబంధించి సంవత్సరం పొడవుగా సాధించిన ‘వీక్షణల’ద్వారా ర్యాంకులు ప్రకటన.

Published date : 06 Dec 2019 06:13PM