ఐఏఎఫ్ కోసం ఎన్ని ‘తేజస్’ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలిపింది?
Sakshi Education
భారత వైమానిక దళం(ఐఏఎఫ్) కోసం రూ. 48 వేల కోట్లతో 83 ‘తేజస్’ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ప్రధాని అధ్యక్షతన జరిగిన సీసీఎస్(కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ) భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తేలిక పాటి యుద్ధ విమానమైన తేజస్‌ను స్వదేశీ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ రూపొందిస్తోంది. తేజస్ చేరికతో భారత వైమానిక దళం మరింత బలోపేతమవుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఐఏఎఫ్‌లో 40 తేజస్ యుద్ధ విమానాలున్నాయి. ఈ తాజా డీల్‌కు సంబంధించి వైమానిక దళం, హెచ్‌ఏఎల్ మధ్య ఈ మార్చ్‌లో సంతకాలు జరుగుతాయని, 2024లో హెచ్‌ఏఎల్ నుంచి యుద్ధ విమానాల సరఫరా ప్రారంభమవుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తేజస్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : కేంద్రం
ఎవరి కోసం : ఐఏఎఫ్
Published date : 15 Jan 2021 04:01PM