Skip to main content

ఐడియాస్ ఫర్ ఇండియా కాంక్లేవ్ ప్రారంభం

ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం భారతదేశం వైపు చూస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.
Current Affairsహైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో ‘ఐడియాస్ ఫర్ ఇండియా-2020’పాలసీ కాంక్లేవ్ కార్యక్రమాన్ని ఆయన మార్చి 1న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకుపోతోందన్నారు.

శ్రీసిటీ సీఎఫ్‌ఓ నాగరాజన్‌కు అవార్డు
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగిన వార్షిక సీఎఫ్‌ఓ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో శ్రీసిటీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) ఆర్.నాగరాజన్ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు. ‘టాప్ 100 సీనియర్ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ ఇన్ ఇండియా’ అవార్డును రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారు అరవింద్ మాయారామ్ చేతుల మీదుగా ఆయన స్వీకరించారు. దేశంలో అత్యంత ప్రభావశీల కంపెనీలలో సీనియర్ ఫైనాన్స్ లీడర్లను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం సీఎఫ్‌ఓ ఇండియా కాంక్లేవ్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఇది 10వ కాంక్లేవ్.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఐడియాస్ ఫర్ ఇండియా-2020 పాలసీ కాంక్లేవ్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి
ఎక్కడ : ఐఎస్‌బీ, హైదరాబాద్
Published date : 02 Mar 2020 05:44PM

Photo Stories