Skip to main content

ఆహార ధాన్యాల ఉత్పత్తి ల‌క్ష్యం 29 కోట్ల టన్నులు

2020-21 పంట ఏడాదిలో (జులై-జూన్‌) ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని 29.83 కోట్ల టన్నులుగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్దేశించుకుంది.
Current Affairs

జూన్‌-సెప్టెంబరు మధ్య సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) అంచనా వేసిన నేప‌థ్యంలో కేంద్రం ఈ మేర‌కు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2020-21 పంట ఏడాది ఖరీఫ్‌లో 14.99 కోట్ల టన్నులు, రబీలో 14.84 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని సాధించాలని లక్ష్యం విధించుకున్నట్లు వ్యవసాయ కమిషనర్‌ ఎస్‌కే మల్హోత్రా వెల్లడించారు.


మోదీ ప్రసంగానికి వీక్షకులు 20
కోట్లు
లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని దేశవ్యాప్తంగా టీవీల్లో 20.3 కోట్ల మంది వీక్షించారని బార్క్‌(బ్రాడ్‌కాస్ట్‌ ఆడియెన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌) వెల్లడించింది. మొదటి లాక్‌డౌన్‌ ప్రకటన సమయంలో దేశవ్యాప్తంగా 19.3 కోట్ల మంది టీవీల్లో ప్రధాని ప్రకటనను వీక్షించినట్లు బార్క్‌ తెలిపింది. దీంతో తన రికార్డును తానే అధిగమించారని పేర్కొంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : 2020-21 పంట ఏడాదిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ల‌క్ష్యం 29 కోట్ల టన్నులు
ఎప్పుడు : ఏప్రిల్ 16
ఎవరు : కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ
Published date : 17 Apr 2020 06:53PM

Photo Stories