Skip to main content

అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా యార్లగడ్డ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను రెండేళ్ల కాలానికి నియమిస్తూ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్ ఆగస్టు 13న ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో అధికార కార్యకలాపాల నిమిత్తం, అధికార భాష తెలుగును పరిపాలనలో విస్తృతంగా ఉపయోగించడానికి చర్యలు చేపట్టేందుకు సంఘం అధ్యక్షుడికి అధికారం ఉంటుంది. అలాగే పరిపాలనలో తెలుగు వాడుక ప్రగతి సమీక్షించి ప్రభుత్వానికి సూచనలు, సిఫారసులు చేసే అధికారం కూడా ఉంటుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
Published date : 14 Aug 2019 06:57PM

Photo Stories