Skip to main content

ఆధార్ చట్ట బద్ధతపై సుప్రీంకోర్టు విచారణ

ఆధార్ సవరణ చట్టం రాజ్యాంగ చెల్లుబాటుపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.
Current Affairsబ్యాంకు ఖాతాలు తెరవడానికి, మొబైల్ కనెక్షన్లు పొందడానికి వినియోగదారులు స్వచ్ఛందంగా తమ గుర్తింపు పత్రం కింద ఆధార్ నంబర్‌ను ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం ఎంతవరకు సరైందన్న అంశాలనూ సుప్రీం విచారించనుంది. ఈ మేరకు ఆధార్ సవరణ చట్టం పౌరుల వ్యక్తిగత భద్రత, గోప్యతకు భంగం వాటిల్లేలా ఉందని, ఇది ప్రాథమిక హక్కుల్ని కాలరాయడమేనని దాఖలైన ప్రజా ప్రయోజనా వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు నవంబర్ 22న విచారణకు స్వీకరించింది. దీనిపై సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన సుప్రీం బెంచ్ కేంద్రానికి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)లకు నోటీసులు జారీ చేసింది.

జూలైలో ఆధార్ సవరణ చట్టం
కొన్ని మినహాయింపులతో ఆధార్ చట్టం రాజ్యాంగబద్ధమేనని 2018, సెప్టెంబర్‌లో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో కేంద్రప్రభుత్వం ఆధార్, ఇతర చట్టాలకు సవరణలు తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన బిల్లును జూలై 8న పార్లమెంటు ఆమోదించింది. తాజాగా ఆర్మీ మాజీ అధికారి ఎస్‌జీ వోంబట్కెరె, సామాజిక కార్యకర్త విల్సన్ ఈ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ పిల్ దాఖలు వేశారు. దీనిపై కేంద్రానికి, యూఐడీఐఏకు సుప్రీం నోటీసులు పంపింది.

(చదవండి : ఆధార్‌పై సుప్రీం తీర్పు, ఆధార్ కేసు కొనసాగిన క్రమము)

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆధార్ సవరణ చట్టం రాజ్యాంగ చెల్లుబాటుపై విచారణ
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : ఆధార్ సవరణ చట్టంపై పిల్ దాఖలు కావడంతో
Published date : 23 Nov 2019 05:57PM

Photo Stories