Skip to main content

69వ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానర్స్‌ కాన్ఫరెన్స్‌ ఎక్కడ ప్రారంభమైంది?

69వ జాతీయ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానర్స్‌ కాన్ఫరెన్స్‌ ఫిబ్రవరి 26న ప్రారంభమైంది.
Current Affairs
మూడు రోజుల పాటు జరిగే ఈ కాన్ఫరెన్స్‌ను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టౌన్‌ ప్లానర్స్‌ ఇండియా (ఐటీపీఐ) ఆధ్వర్యంలో విశాఖపట్నం నగరంలో నిర్వహిస్తున్నారు. కాన్ఫరెన్స్‌ను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణ, పట్టణ పేదలకు మౌలిక సదుపాయాలు, నీటి నిర్వహణ వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నారు.

వలంటీర్ల సేవకు పురస్కారాలు...
పక్షపాతం, అవినీతికి దూరంగా సేవా దృక్పథాన్ని పెంపొందించే ఉద్దేశంతో... గ్రామ, వార్డు వలంటీర్లకు మూడు కేటగిరీల్లో అవార్డులు, నగదు పురస్కారాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. వారు అందించే సేవలను బట్టి మూడు కేటగిరీలుగా ఎంపిక చేసి, 2021, ఉగాది నుంచి వలంటీర్ల పురస్కారాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపింది.

క్విక్‌ రివ్యూ
:
ఏమిటి : 69వ జాతీయ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానర్స్‌ కాన్ఫరెన్స్‌ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎక్కడ : ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టౌన్‌ ప్లానర్స్‌ ఇండియా (ఐటీపీఐ)
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : పర్యావరణ పరిరక్షణ, పట్టణ పేదలకు మౌలిక సదుపాయాలు, నీటి నిర్వహణ వంటి అంశాలపై చర్చించేందుకు
Published date : 27 Feb 2021 05:48PM

Photo Stories