Skip to main content

5వ ఏపీ సైన్స్ కాంగ్రెస్ -2019 ప్రారంభం

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో 5వ ఏపీ సైన్స్ కాంగ్రెస్-2019 ప్రారంభమైంది.
Current Affairsమూడు రోజులపాటు జరగనున్న ఈ కాంగ్రెస్‌ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నవంబర్ 28న న ప్రారంభించారు. ‘అభివృద్ధిలో శాస్త్ర విజ్ఞానం’ అంశంగా జరుగుతున్న ఈ కాంగ్రెస్‌లో గవర్నర్ మాట్లాడుతూ... సైన్స్ తోనే సమాజంలోని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. పర్యావరణ అసమానతలు భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారుతున్నాయని, ఢిల్లీ వంటి నగరాల్లో కాలుష్య తీవ్రతే ఇందుకు నిదర్శనమన్నారు. మొక్కలు విస్తారంగా నాటుతూ అడవుల భూభాగం 33 శాతం కంటే పెరగడం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వివరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
5వ ఏపీ సైన్స్ కాంగ్రెస్ -2019 ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
ఎక్కడ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
Published date : 29 Nov 2019 05:30PM

Photo Stories