29 వేల చైనా యాప్‌ల తొలగింపు
ఇందులో 26 వేలకు పైగా గేమ్ యాప్‌లే కావడం గమనార్హం. లైసెన్స్ గేమ్ యాప్‌లపై చైనా అధికారులు చర్యలు తీసుకుంటున్నందునే యాపిల్ ఇలా చేసినట్లు క్విమై అనే పరిశోధన సంస్థ తెలిపింది. చైనా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్స్ ప్రభుత్వ నిబంధనలకు లోబడే చాలాకాలంలో పనిచేస్తున్నాయి.
టిక్‌టాక్‌ను నిషేధిస్తాం: ట్రంప్
చైనాతో విభేదాలు ముదురుతున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన కంపెనీలపై అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కొరడా ఝళిపించారు. చైనాకే చెందిన వీడియో యాప్ టిక్‌టాక్‌పై అమెరికాలో నిషేధం విధించనున్నట్లు ట్రంప్ జూలై 31న ప్రకటించారు. అమెరికన్ల వ్యక్తిగత గోప్యత, భద్రతకు ప్రమాదకరంగా మారిందంటూ టిక్‌టాక్‌పై విదేశాంగ మంత్రి మైక్ పాంపియో విమర్శలు చేస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 29 వేల చైనా యాప్‌ల తొలగింపు
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజ సంస్థ యాపిల్
ఎక్కడ :చైనీస్ యాప్ స్టోర్
ఎందుకు :లైసెన్స్ గేమ్ యాప్‌లపై చైనా అధికారులు చర్యలు తీసుకుంటున్నందున