Skip to main content

2050 నాటికి కర్బన ఉద్గారాల రహితంగా జపాన్

కాలుష్య భూతాన్ని తరిమికొట్టేందుకు జపాన్ భారీ ప్రణాళికలు రచించింది. దేశాన్ని 2050 నాటికి కర్బన ఉద్గారాల రహితంగా మార్చడమే లక్ష్యంగా... వచ్చే 15 ఏళ్లలోపు చమురు ఆధారిత వాహనాలను తొలగించాలని నిర్ణయించినట్లు డిసెంబర్ 25న తెలిపింది.
Current Affairs

2020, అక్టోబర్‌లో పర్యావరణ కాలుష్యంపై జపాన్ ప్రధాని యోషిహిడే సుగా మాట్లాడుతూ... వచ్చే 30 ఏళ్లలో కర్బన ఉద్గారాలను సున్నాకు తీసుకొస్తామని ప్రతిజ్ఞ చేశారు.

కాలుష్యాన్ని తగ్గించేందుకు జపాన్ రచించిన ప్రణాళికలు...

  • ‘గ్రీన్ గ్రోత్ స్ట్రాటజీ’లో భాగంగా పునరుత్పాదక, హైడ్రోజన్ ఇంధన వాడకాన్ని పెంచాలి.
  • 2030 నాటికి ఆటో పరిశ్రమ కర్బన రహితంగా మారాలి.
  • పర్యావరణహిత వాణిజ్యం, పెట్టుబడుల్లో 2 ట్రిలియన్ డాలర్ల వృద్ధి సాధించాలి.
  • 2040 నాటికి 45 గిగావాట్ల తీరప్రాంత పవన విద్యుత్తు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
  • పర్యావరణహిత వ్యూహంలో భాగంగా 14 కీలక పరిశ్రమలను ప్రభుత్వం గుర్తించింది.

జపాన్ రాజధాని: టోక్యో; కరెన్సీ: జపనీస్ యెన్
జపాన్ ప్రస్తుత ఎంపరర్: నరుహితో
జపాన్ ప్రస్తుత ప్రధాని: యోషిహిడే సుగా

క్విక్ రివ్యూ :

ఏమిటి : పర్యావరణహిత వ్యూహం రూపకల్పన
ఎప్పుడు : డిసెంబర్ 25
ఎవరు : జపాన్
ఎందుకు : 2050 నాటికి కర్బన ఉద్గారాల రహిత దేశంగా అవతరించేందుకు
Published date : 26 Dec 2020 05:55PM

Photo Stories