Skip to main content

2025 నాటికి 90 కోట్ల ఇంటర్నెట్‌ యూజర్లు: కాంటార్‌

దేశంలో యాక్టివ్‌ ఇంటర్నెట్‌ వినియోగదార్లు2025 నాటికి 90 కోట్లకు చేరుకోనున్నారు.
Current Affairs
ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, కాంటార్‌ క్యూబ్‌ సంయుక్తంగా రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. నివేదిక ప్రకారం... 2020లో దేశంలో ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్య 62.2కోట్లుంది. అయిదేళ్లలో ఇంటర్నెట్‌ వాడుతున్న మొత్తం కస్టమర్లలో అత్యధికులు గ్రామీణ భారత్‌ నుంచి ఉంటారు. దేశంలో డిజిటల్‌ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోంది.

నివేదికలోని ముఖ్యాంశాలు...
- దేశంలో యాక్టివ్‌ యూజర్‌ సగటున రోజూ 107 నిముషాలు నెట్‌ వాడుతున్నారు.
- గ్రామీణ యూజర్లతో పోలిస్తే అర్బన్‌ కస్టమర్లు 17 శాతం అధికంగా నెట్‌ వాడకంలో సమయం వెచ్చిస్తున్నారు.
- ఇంటర్నెట్‌ వాడకం విషయంలో మొబైల్‌ తొలి ఎంపిక అయింది.
- 143.3 కోట్ల జనాభాలో 43 శాతం మంది (62.2 కోట్లు) యాక్టివ్‌ ఇంటర్నెట్‌ కస్టమర్లు ఉన్నారు.
Published date : 05 Jun 2021 12:48PM

Photo Stories