2021 వాతావరణ సదస్సులో పాల్గొనాలని మోదీకి ఆహ్వానం
Sakshi Education
అమెరికా ఆధ్వర్యంలో ఏప్రిల్ 22వ తేదీన ఎర్త్ డే సందర్భంగా జరగనున్న వాతావరణ సదస్సు–2021 జరగనుంది.
వర్చువల్ విధానంలో జరిగే సదస్సుకు హాజరుకావాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానించారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో దాదాపు 40 మంది దేశాధినేతలు పాల్గొననున్నారు. పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న ప్రపంచ దేశాలను ఒకే తాటిపైకి తీసుకువచ్చి కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలు ప్రారంభించడం ఈ సదస్సు కీలక ఉద్దేశం. 2021, నవంబర్‌లో గ్లాస్గోలో జరగనున్న యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ ఛేంజ్ కాన్ఫరెన్స్(సీవోపీ26)కు ఈ సదస్సు కీలకంగా మారనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
ఎందుకు : ఏప్రిల్ 22వ తేదీన ఎర్త్ డే సందర్భంగా జరగనున్న వాతావరణ సదస్సు–2021లో పాల్గొనాలని
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
ఎందుకు : ఏప్రిల్ 22వ తేదీన ఎర్త్ డే సందర్భంగా జరగనున్న వాతావరణ సదస్సు–2021లో పాల్గొనాలని
Published date : 30 Mar 2021 02:59PM