2020-21 కేంద్ర బడ్జెట్‌లో రంగాలవారీగా కేటాయింపులివే..
Sakshi Education
ఆన్‌లైన్‌లో డిగ్రీ కోర్సులు
- విద్యారంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి
- విద్య, స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి
- 2026నాటికి 150 వర్సిటీల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం కొత్త కోర్సులు
- ప్రధాన యూనివర్సిటీల్లో ఆన్‌లైన్‌లో డిగ్రీ కోర్సులు
- నేషనల్ పోలీస్, ఫోరెన్సిక్ యూనివర్సిటీ ప్రారంభిస్తాం
- భారత్‌లో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థుల కోసం ఇన్సాట్ పరీక్షలు
- ప్రస్తుతం ఉన్న ప్రతి జిల్లా ఆస్పత్రికి మెడికల్ కాలేజీ
- యువ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి ప్రత్యేక పథకం
- గ్లోబలైజేషన్‌కు అనుగుణంగా పరిశ్రమల అభివృద్ధి
- ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్ సెల్ ఏర్పాటు
- ల్యాండ్ బ్యాంక్, ఇతర ప్రభుత్వ అనుమతుల కోసం ప్రత్యేక సెల్
- మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి పీపీపీ విధానం
- ఎలక్ట్రానిక్, మాన్యుఫాక్చరింగ్‌పై ప్రత్యేక దృష్టి
- మొబైల్ తయారీ పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం
రంగాలవారీగా కేటాయింపులివే..
- జల్‌జీవన్ మిషన్‌కు రూ 11,500 కోట్లు
- విద్యారంగానికి రూ 99.300 కోట్లు
- నైపుణ్యాభివృద్ధికి రూ 3,000 కోట్లు
- కొత్తగా ఐదు స్మార్ట్ సిటీల అభివృద్ధి
- నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్ మిషన్ ఏర్పాటుకు రూ1480 కోట్లు
- పరిశ్రమలు, వాణిజ్య రంగానికి రూ 27,300 కోట్లు
- చిన్న ఎగుమతిదారుల కోసం నిర్విక్ పథకం
- త్వరలో జాతీయ లాజిస్టిక్స్ పాలసీ
- రవాణా మౌలిక సదుపాయాలకు రూ 1.7 లక్షల కోట్లు
- చిన్న ఎగుమతిదారుల కోసం నిర్విక్ పథకం
- త్వరలో జాతీయ లాజిస్టిక్స్ పాలసీ
- 2023 నాటికి ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వే పూర్తి
- పెద్దసంఖ్యలో తేజాస్ తరహా రైళ్లు, సెమీ హైస్పీడ్ రైళ్లు
- రూ 15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు
- వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి రూ 2.83 లక్షల కోట్లు
- పంచాయితీరాజ్‌కు రూ 1.23 లక్షల కోట్లు
- ఆరోగ్య రంగానికి రూ 69,000 కోట్లు
- స్వచ్ఛభారత్ మిషన్‌కు రూ 12,300 కోట్లు
- పైప్‌డ్ వాటర్ ప్రాజెక్టుకు రూ 3.6 లక్షల కోట్లు
Published date : 01 Feb 2020 12:35PM