Skip to main content

2018-19లో క్యాడ్ 2.1 శాతం

2018-19 ఆర్థిక సంవత్సరంలో కరెంట్ అకౌంట్ లోటు 2.1 శాతంగా (స్థూల దేశీయోత్పత్తి విలువతో పోల్చి) నమోదైనట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 28న తెలిపింది.
విలువ రూపంలో ఈ పరిమాణం 57.2 బిలియన్ డాలర్లు. 2017-18లో క్యాడ్ జీడీపీ విలువలో 1.8 శాతంగా (48.7 బిలియన్ డాలర్లు) నమోదైంది. ఎఫ్‌డీఐ, ఎఫ్‌ఐఐ, ఈసీబీలు మినహా ఒక నిర్దిష్ట కాలంలో దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసాన్ని క్యాడ్ అంటారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2018-19లో క్యాడ్ 2.1 శాతం
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
Published date : 29 Jun 2019 06:06PM

Photo Stories