106వ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించిన మోదీ
Sakshi Education
పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ)లో ‘106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 3న ప్రారంభించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. దేశంలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని పిలుపినిచ్చారు. దివంగత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ‘జై జవాన్ జై కిసాన్’ అని నినాదం ఇచ్చారనీ, దానికి మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేయి జై విజ్ఞాన్‌ను జోడించారనీ.. తాజాగా తాను దీనికి జై అనుసంధాన్ అనే పదాన్ని జోడిస్తున్నట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొన్న డీఆర్‌డీవో చైర్మన్ డా.జి.సతీశ్ రెడ్డి మాట్లాడుతూ.. భారత రక్షణ రంగానికి సంబంధించి భవిష్యత్ అవసరాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, జలంధర్, పంజాబ్

Published date : 04 Jan 2019 05:49PM