10 వేల మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు నెలకొల్పిన అథ్లెట్?
Sakshi Education
నెదర్లాండ్స్ మహిళా అథ్లెట్ సిఫాన్ హసన్... 10 వేల మీటర్ల విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.
నెదర్లాండ్స్‌లో జూన్ 6న జరిగిన కాంటినెంటల్ టూర్ గోల్డ్ మీట్‌లో ఆమె 10 వేల మీటర్ల లక్ష్యాన్ని 29 నిమిషాల 6.82 సెకన్లలో పూర్తి చేసింది. 29ని:17.45 సెకన్లతో 2016 రియోఒలింపిక్స్‌లోఅల్మాజ్ అయానా (ఇథియోపియా) నెలకొల్పిన ప్రపంచ రికార్డును సిఫాన్ బద్దలు కొట్టింది.
దివ్యాంగ మహిళ రికార్డు...
లెబనాన్‌కు చెందిన డారిన్ బార్బర్ అనే మహిళ తన కృత్రిమ కాలుతో గోడకుర్చీ వేసి గిన్నిస్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. యూఏఈలోని దుబాయ్‌లో జూన్ 4వ తేదీన గిన్నిస్ ప్రతినిధుల సమక్షంలో ఈమె 2 నిమిషాల 8.24 సెకన్లపాటు గోడ కుర్చీ వేసిన దివ్యాంగ మహిళగా రికార్డు సృష్టించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 10 వేల మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు నెలకొల్పిన అథ్లెట్?
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : నెదర్లాండ్స్ మహిళా అథ్లెట్ సిఫాన్ హసన్
ఎక్కడ : కాంటినెంటల్ టూర్ గోల్డ్ మీట్, నెదర్లాండ్స్

Published date : 07 Jun 2021 07:31PM