ఫిబ్రవరి 2017 ద్వైపాక్షిక సంబంధాలు
Sakshi Education
భారత్, రువాండాల మధ్య 3 ఒప్పందాలు
భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ రువాండా పర్యటన సందర్భంగా రెండు దేశాలు ఫిబ్రవరి 20న మూడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇందులో ఇరు దేశాల మధ్య నేరుగా విమానాలు నడిపేందుకు ఉద్దేశించిన వాయు సేవల ఒప్పందం, రువాండాలో ఎంటర్‌ప్రెన్యూరియల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు, దౌత్యవేత్తలు, అధికారిక పాస్‌పోర్ట్ కలిగిన వారికి వీసా మినహాయింపు ఒప్పందాలు ఉన్నాయి.
ఇండోర్‌లో దక్షిణాసియా సభాపతుల శిఖరాగ్ర సదస్సు
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై దక్షిణాసియా సభాపతుల శిఖరాగ్ర సదస్సు ఇండోర్‌లో ఫిబ్రవరి 18 నుంచి రెండు రోజుల పాటు జరిగింది. ఈ సదస్సులో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రారంభోపన్యాసం చేశారు. అమె మాట్లాడుతూ మానవీయ కోణం లేని ఏ అభివృద్ధీ సుస్థిరం కాబోదని పేర్కొన్నారు. పార్లమెంట్, ఇంటర్ పార్లమెంటరీ యూత్ (ఐపీయూ)ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంకల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.
మాల్యాను అప్పగించాలని బ్రిటన్‌ను కోరిన భారత్
రుణాల ఎగవేత కేసులు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాను అప్పగించాలంటూ బ్రిటన్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. ఈ మేరకు సీబీఐ పంపిన అభ్యర్ధన లేఖను బ్రిటన్ హై కమిషన్‌కు అందజేసినట్లు ఫిబ్రవరి 9న కేంద్రం ప్రకటించింది.
మాల్యాకి చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వివిధ బ్యాంకులకు రూ. 9,000 కోట్ల పైచిలుకు రుణాలు బకాయి పడింది. ఈ రుణాల ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన దేశం విడిచి బ్రిటన్ వెళ్లిపోయాడు.
2017-18లో భారత వృద్ధి రేటు 7.2 శాతం : ఐఎంఎఫ్
2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ-IMF అంచనా వేసింది. ఈ మేరకు భారత ఆర్థిక వ్యవస్థపై వార్షిక నివేదికను ఫిబ్రవరి 22న విడుదల చేసింది. పెద్ద నోట్ల రద్దు కారణంగా 2016-17లో వృద్ధి రేటు 6.6 శాతానికి క్షీణిస్తుందని అయితే దీని ప్రభావం తాత్కాలికంగానే ఉంటుందని ఐఎంఎఫ్ పేర్కొంది. వస్తు సేవల పన్ను-GST అమల్లోకి వచ్చిన తర్వాత రానున్న రోజుల్లో భారత్ 8 శాతానికి పైనే వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది.
మైక్రోసాఫ్ట్‌తో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం
దేశీ ఈ-కామర్స్ రంగ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, ప్రపంచ ఐటీ అగ్రగామి మైక్రోసాఫ్ట్ మధ్య ఫిబ్రవరి 20న అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం పేమెంట్, లాజిస్టిక్స్ కోసం ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఇకపై మైక్రోసాఫ్ట్ రూపొందించిన అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించనుంది.

Published date : 10 Apr 2017 02:23PM