Telangana Police: క్రైమ్, క్రిమినల్ ట్రాకింగ్‌లో తెలంగాణ పోలీసు శాఖకు అవార్డు
Sakshi Education
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏటా ప్రకటించే అవార్డుల్లో మరో సారి తెలంగాణ పోలీస్ ప్రతిభ కనబరిచింది.
క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్‌లో ఇంట్రాపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనుసంధానించడంలో తెలంగాణ పోలీస్ శాఖ 3వ స్థానంలో నిలవడంతో ఎన్‌సీఆర్‌బీ డిసెంబర్ 16వ తేదీన ఈ అవార్డు ప్రకటించింది. ఐపీజేఎస్‌ను అత్యంత వేగవంతంగా అమలుపరచడంలో కీలక పాత్ర పోషించిన డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు పోలీస్ కంప్యూటర్, టెక్నాలజీ సరీ్వసెస్ అదనపు డీజీపీ రవిగుప్తాను ఎన్‌సీఆర్‌బీ అభినందించింది. మొదటి స్థానంలో మధ్యప్రదేశ్, 2వ స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో తెలంగాణతో పాటు జార్ఖండ్ ఉందని ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది.
Published date : 17 Dec 2021 05:40PM