ఫిబ్రవరి 2017 అవార్డ్స్
Sakshi Education
2016 సంవత్సరానికి ఆస్కార్ అవార్డులను Academy of Motion Picture Arts and Sciences ఫిబ్రవరి 26న ప్రకటించింది. అమెరికాలో లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 89వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో విజేతలు బహుమతులు అందుకున్నారు. ఉత్తమ చిత్రంగా బేరీ జెన్కిన్స్ దర్శకత్వం వహించిన "మూన్‌లైట్" ఎంపికైంది. "మాంచెస్టర్ బై ద సీ"చిత్రంలో నటనకు గాను కేసీ అప్లెక్‌ను ఉత్తమ నటుడు పురస్కారం వరించింది. లా లా ల్యాండ్ చిత్రంలో నటనకు ఎమ్మా స్టోన్ ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకుంది.
అత్యధికంగా 14 నామినేషన్లు పంపిన లా లా ల్యాండ్ చిత్రానికి 6 అవార్డులు దక్కగా మూన్‌లైట్ చిత్రానికి 3, మాంచెస్టర్ బై ద సీ చిత్రాలకు రెండేసి అవార్డులు వచ్చాయి.
అవార్డుల జాబితా
ఉత్తమ చిత్రం:మూన్‌లైట్
ఉత్తమ నటుడు: కేసీ అఫ్లెక్ (మాంచెస్టర్ బై ద సీ)
ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ (లా లా ల్యాండ్)
ఉత్తమ దర్శకుడు: డామీన్ చాజెల్లె (లా లా ల్యాండ్)
ఉత్తమ సహాయ నటుడు: మహేర్షాల అలీ (మూన్‌లైట్)
ఉత్తమ సహాయ నటి: వయోలా డేవిస్ (ఫెన్సెస్)
యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: జూటోపియా
యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్: పైపర్
సినిమాటోగ్రఫి: లినస్ సాండ్‌గ్రెన్ (లా లా ల్యాండ్)
కాస్ట్యూమ్ డిజైన్: కొలీన్ ఎట్‌వుడ్ (ఫెంటాస్టిక్ బీస్ట్స్)
ఉత్తమ డాక్యుమెంటరీ: ఓ.జే-మేడ్ ఇన్ అమెరికా
ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్‌ఫిల్మ్): ద వైట్ హెల్మెట్స్
ఉత్తమ ఎడిటింగ్: హాక్సారిడ్‌జ (జాన్ గిల్బర్ట్)
ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ద సేల్స్‌మ్యాన్ (ఇరాన్-అస్గర్ ఫర్హాదీ)
మేకప్ అండ్ హెయిర్ స్టైల్: అలెస్సాండ్రో బర్టోలాజీ, జార్జియో గ్రిగోరినీ, క్రిస్టోఫర్ నిల్సన్ (సూసైడ్ స్క్వాడ్)
ఉత్తమ సంగీతం (ఒరిజినల్ స్కోర్) : లా లా ల్యాండ్ (జస్టిన్ హర్‌విట్జ్)
ఉత్తమ గేయం (ఒరిజినల్ సాంగ్): సిటీ ఆఫ్ స్టార్స్ ( లా లా ల్యాండ్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: లా లా ల్యాండ్
సౌండ్ ఎడిటింగ్: సిల్వియిన్ బెల్లేమేర్ (అరైవల్)
సౌండ్ మిక్సింగ్: హాక్సారిడ్‌జ
విజువల్ ఎఫెక్ట్స్ : ద జంగల్ బుక్
లైవ్ యాక్షన్ షార్ట్‌ఫిల్మ్: సింగ్
ఒరిజినల్ స్కీన్‌ప్ల్రే: మాంచెస్టర్ బై ద సీ
అడాప్టెడ్ స్కీన్‌ప్ల్రే: మూన్‌లైట్
ఉత్తమ రచయిత (అడాప్టెడ్): మూన్‌లైట్
ఉత్తమ రచయిత (ఒరిజినల్): మాంచెస్టర్ బై ద సీ
టంకశాల అశోక్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
ప్రముఖ పాత్రికేయుడు టంకశాల అశోక్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. ఆంగ్లంలో రాజ్‌మోహన్‌గాంధీ రచించిన పటేల్: ఏ లైఫ్ (బయోగ్రఫీ) పుస్తకాన్ని టంకశాల అశోక్.. వల్లభాయ్‌పటేల్ పేరుతో తెలుగులోకి అనువదించారు. దీన్ని 2016లో తెలుగులో ఉత్తమ అనువాద పుస్తకంగా అకాడమీ ప్రకటించింది.
సంస్కృత అనువాదంలో రాణి సదాశివమూర్తికి పురస్కారం
రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్ ప్రొఫెసర్ రాణి సదాశివమూర్తికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తెలుగులో రాళ్లబండి కవితాప్రసాద్ రచించిన ‘ఒంటరి పూలబుట్ట (కవితలు)’ ను సదాశివమూర్తి ‘వివక్త పుష్పకరంద’ పేరుతో సంస్కృతంలోకి అనువదించారు. దీన్ని 2016లో సంస్కృతంలో ఉత్తమ అనువాద పుస్తకంగా అకాడమీ ప్రకటించింది.
ఎస్‌ఆర్‌ఎం విద్యార్థులకు IESA హాక్‌థాన్ అవార్డు
ఫిబ్రవరి 21, 22న బెంగళూరులో జరిగిన ఐఈఎస్‌ఏ విజన్ సమ్మిట్- 2017లో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ విద్యార్థులు ప్రతిష్టాత్మక ఐవోటీ-ఏర్/ వీఆర్ మేక్- ఏ- థాన్ అవార్డు గెలుపొందారు. విశ్వవిద్యాలయంలోని నెక్ట్స్ టెక్ ల్యాబ్‌కు చెందిన విద్యార్థులకు రూపొందించిన స్మార్ట్ ఇండస్ట్రీయల్ డిటెక్షన్ సిస్టమ్‌కు ఈ అవార్డు దక్కింది. పరిశ్రమలలోని యంత్రాల్లో తలెత్తే లోపాలను ఈ సిస్టమ్ ముందుగా గుర్తించి అప్రమత్తం చేస్తుంది.
వెంకటనారాయణకు ఎన్‌ఆర్ చందూర్ పురస్కారం
ప్రతిష్టాత్మక ఎన్‌ఆర్ చందూర్-జగతి పురస్కారం-2017కు ప్రముఖ పాత్రికేయుడు ఎస్. వెంకటనారాయణ ఎంపికయ్యారు. పాత్రికేయంలో విశిష్ట సేవలందిస్తున్న తెలుగు వారికి చందూర్ కుటుంబ సభ్యులు, శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ సంయుక్తంగా ఏటా ఈ అవార్డు అందజేస్తున్నారు. వెంకటనారాయణ ప్రస్తుతం న్యూఢిల్లీ నుంచి శ్రీలంక, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల్లోని వివిధ టీవీ, రేడియోలకు సౌత్ ఏసియా బ్యూరో చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు.
జయప్రకాశ్‌రెడ్డికి రేలంగి పురస్కారం
రేలంగి వెంకటరామయ్య పురస్కారం-2017కు సినీ నటుడు జయప్రకాశ్‌రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ భాషా సంస్కృతిక శాఖ, చలనచిత్ర, టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26న విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డు అందుకున్నారు.
రాజిందర్, పద్మాకర్‌లకు సీకే నాయుడు పురస్కారం
భారత దేశవాళీ క్రికెట్‌లో దిగ్గజాలుగా పేరు తెచ్చుకున్న మాజీ స్పిన్నర్లు రాజిందర్ గోయల్, పద్మాకర్ శివాల్కర్‌లు సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం-2017కు ఎంపికయ్యారు. వీరితో పాటు అవార్డుకు ఎంపికైన మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి సీకే నాయుడు అవార్డు అందుకున్న తొలి మహిళా క్రికెట్‌గా గుర్తింపు పొందనున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 27న బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. మార్చి 8న బెంగళూరులో జరగనున్న బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమంలో వీరికి పురస్కారాలు అందజేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు సీఎన్‌బీసీ స్టేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్
CNBC TV 18 సంస్థ ఇండియా బిజినెస్ లీడర్ అవార్డుల్లో భాగంగా ఇచ్చే స్టేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు(2016-17) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది. బ్యాంకింగ్, పారిశ్రామిక రంగాలకు చెందిన జాతీయస్థాయి ప్రముఖులతో కూడిన జ్యూరీ ఏపీని ఈ అవార్డుకు ఎంపిక చేసిందని ఫిబ్రవరి 28న ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు దేశంలోని వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో ఏపీకి మొదటి స్థానం ఇచ్చిందని పేర్కొంది.
వివిధ రంగాల్లో ప్రభుత్వాలు, వ్యక్తులు, సంస్థలు సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకొని సీఎన్‌బీసీ టీవీ 18 సంస్థ ఏటా ఈ పురస్కారాలను అందిస్తోంది.
ఏపీ నంది నాటక పురస్కారాలు-2016
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది నాటక పురస్కారం-2016 విజేతల వివరాలను ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఫిబ్రవరి 21న ప్రకటించింది. ఈ మేరకు జనవరి 13 నుంచి 15 వరకు గుంటూరు, కర్నూలు. విజయనగరంలో నిర్వహించిన 20వ నంది నాటకోత్సవాల్లో విజేతలను ఎంపిక చేశారు. విజేతలకు రూ.1.50 లక్షల నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందించనున్నారు.
విభాగాలవారీగా విజేతల వివరాలు
పద్యనాటక విభాగం
ప్రథమ బహుమతి- సతీసావిత్రి- లలితకళా పరిషత్ (అనంతపురం)
ద్వితీయ బహుమతి-ప్రమీలార్జున పరిణయం-లలిత కళాసమితి (కర్నూలు)
తృతీయ బహుమతి- చాణక్య-చంద్రగుప్త- ఖమ్మం కల్చరల్ అసోసియేషన్
సాంఘిక నాటక విభాగం
ప్రథమ బహుమతి-అక్షర కిరీటం-గంగోత్రి కళాకారులు (పెదకాకాని)
ద్వితీయ బహుమతి- జారుడు మెట్టులు- కళాంజలి (హైదరాబాద్)
తృతీయ బహుమతి-ఇంటింటి కథలు- విద్యాదిత్య ఆర్‌ట్స (రాజమండ్రి)
సాంఘిక నాటిక విభాగం
ప్రథమ బహుమతి- చాలు-ఇక చాలు- శ్రీసాయి ఆర్‌ట్స (కొలకలూరు)
ద్వితీయ బహుమతి-రెండు నిశ్శబ్దాల మధ్య- అభినయ ఆర్‌ట్స (గుంటూరు)
తృతీయ బహుమతి- తేనెటీగలు పగబట్టాయి-శర్వాణి గిరిజన సేవా సంఘం (బోరివంక)
బాలల నాటిక విభాగం
ప్రథమ బహుమతి-ఎక్కడివాళ్లు అక్కడే- శ్రీప్రకాష్ విద్యానికేతన్ (విశాఖ)
ద్వితీయ బహుమతి-అపురూపం-కళారాఘవ, శ్రీగురురాజ కాన్సెప్ట్ స్కూలు (నంద్యాల)
తృతీయ బహుమతి-భరోసా- కళాప్రియ లిటిల్ ఛాంప్స్ (ఒంగోలు)
కళాశాల, విశ్వవిద్యాలయ నాటికల విభాగం
ప్రథమ బహుమతి-సంభవామి-సెయింట్ థెరిస్సా డిగ్రీ కాలేజి ఫర్ ఉమన్ (ఏలూరు)
ద్వితీయ బహుమతి- కాంట్రవర్సీ- పీబీ సిద్ధార్థ ఆర్‌ట్స అండ్ సైన్‌స (విజయవాడ)
తృతీయ బహుమతి-వృక్షో రక్షతి రక్షితః- ఎస్‌ఎస్‌డీఎస్ డిగ్రీ కాలేజి (అనంతపురం)
ఎన్జీరంగా వర్సిటీ రిజిస్ట్రార్‌కు జాతీయ అవార్డు
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ టీవీ సత్యనారాయణకు నేషనల్ ఫెలోషిప్ అవార్డు దక్కింది. హరియాణాలో జరుగుతున్న భారత వ్యవసాయ ఇంజినీర్ల సదస్సులో ఫిబ్రవరి 16న ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. గత 20 ఏళ్లలో తెలుగు రాష్ట్రాల శాస్త్రవేత్తలు ఈ పురస్కారాన్ని అందుకోవడం ఇదే తొలిసారి.
కరణ్ థాపర్‌కు జీకే రెడ్డి పురస్కారం
ప్రముఖ పాత్రికేయుడు కరణ్ థాపర్ జీకే రెడ్డి జాతీయ స్మారక పురస్కారం-2016కు ఎంపికయ్యారు. టి. సుబ్బిరామిరెడ్డి ఫౌండేషన్ పురస్కారాల కమిటీ పాత్రికేయ రంగానికి సంబంధించి ఆయనకు ఈ అవార్డు ప్రకటించింది. పురస్కారం కింద రూ. 5 లక్షల బహుమతి, బంగారు పతకం అందిస్తారు. ప్రస్తుతం ఆయన ఇండియా టుడేలో పనిచేస్తున్నారు.
ఇస్కాన్‌కు ఐఎంసీ పురస్కారం
ఐఎంసీ రామకృష్ణ బజాజ్ నేషనల్ క్వాలిటీ అవార్డు-2016కు ఇస్కాన్ సంస్థ ఎంపికైంది. ఈ మేరకు ఫిబ్రవరి 11న జరిగిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు అవార్డు అందుకున్నారు. అన్నమిత్ర కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అన్ని పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందిస్తున్నందుగాను సంస్థకు ఈ పురస్కారం దక్కింది. ఐఎస్‌ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఏడు రాష్ట్రాల్లో 29 సెంట్రలైజ్డ్ కిచెన్‌లను ఏర్పాటు చేసిన ఇస్కాన్ సంస్థ వీటి ద్వారా 6,500 పాఠశాలల్లో 12 లక్షల మంది పేద, అనాథ పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడుతోంది.
వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ -2017 పురస్కారం
అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) ఫోటో గ్రాఫర్ బుర్హాన్ తీసిన చిత్రానికి ప్రతిష్టాత్మక వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్-2017 పురస్కారం దక్కింది. ఈ మేరకు ఫిబ్రవరి 13న వివిధ విభాగాల్లో అవార్డుల పొందిన వారి జాబితాను జూరీ సభ్యులు వెల్లడించారు. 2016 డిసెంబర్ 19న టర్కీ రాజధాని అంకారాలో జరిగిన కార్యక్రమంలో ఓ పోలీసు అధికారి రష్యా రాయబారి ఆండ్రీ కర్లోవ్‌ను తుపాకితో కాల్చి చంపాడు. అక్కడే ఉన్న బుర్హాన్ ఈ చిత్రాలు తీశాడు. అవార్డు కోసం 125 దేశాల నుంచి 80 వేలకు పైగా ఎంట్రీలు రాగా బుర్హాన్ తీసిన ఈ ఫోటో మొదటి బహుమతి గెలుచుకుంది. దీంతోపాటు స్పాట్ న్యూస్, స్టోరీస్ విభాగంలోనూ విజేతగా నిలిచింది.
గ్రామీ పురస్కారాలు-2017
59వ గ్రామీ పురస్కారాల ప్రదానోత్సవం ఫిబ్రవరి 13న అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగింది. 2017 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి అవార్డులు అందించారు. బ్రిటన్‌కు చెందిన పాప్ సింగర్ అడెలె.. హల్లో, 25 వంటి అల్బమ్‌లకు ఏకంగా ఐదు అవార్డులు సొంతం చేసుకుంది. భారత్‌కు చెందిన తబలా ప్లేయర్ సందీప్ దాస్ ‘యో యో మా’ బృందంతో కలసి రూపొందించిన ‘సింగ్ మి హోమ్’ ఆల్బమ్‌కు ప్రపంచ మ్యూజిక్ విభాగంలో అవార్డు దక్కింది. ఈ బృందానికి గ్రామీ అవార్డు రావడం ఇది మూడోసారి.
ముఖ్యమైన అవార్డులు-గ్రహీతలు
ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ - "25", అడెల్
రికార్డ్ ఆఫ్ ది ఇయర్ - హల్లో, అడెల్
సాంగ్ ఆఫ్ ది ఇయర్ - హల్లో, అడెల్
పాప్ సోలో పర్‌ఫార్మెన్స్ - హల్లో, అడెల్
బెస్ట్ రాప్ ఆల్బమ్ - కలరింగ్ బుక్, చాన్స్ ద రేపర్
బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ - చాన్స్ ద రేపర్
రాక్ పర్‌ఫార్మెన్స్ - బ్లాక్‌స్టార్, డేవిడ్ బోవి
రాక్ ఆల్బమ్ - టెల్ మీ ఐ ఆమ్ ప్రెట్టీ, కేజ్ ద ఎలిఫెంట్
బెస్ట్ మ్యూజిక్ వీడియో - బియాన్స్, ఫార్మేషన్
బెస్ట్ మ్యూజిక్ ఫిల్మ్ - ది బీటెల్స్, ఎయిట్ డేస్ ఎ వీక్ ద టూరింగ్ ఇయర్స్
ఐడీబీఐ బ్యాంక్‌కు MSME ఎక్సలెన్‌స అవార్డు
ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్‌ను ‘ఎంఎస్‌ఎంఈ ఎక్సలెన్‌స అవార్డు 2017’ వరించింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థల- లకు అధిక నిధులు కేటాయించినందుకు ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీ ట్రేడ్ అండ్ సర్వీసెస్ ఐడీబీఐకి ఈ అవార్డు అందించింది.
బీవీఆర్ మోహన్ రెడ్డికి జీవితకాల సాఫల్య పురస్కారం
సైయంట్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు-2017కు ఎంపికయ్యారు. ఈ మేరకు బెంగళూరులో ఫిబ్రవరి 13న జరిగిన కార్యక్రమంలో రీసెర్చ్ సెంటర్ ఇమారత్ డెరెక్టర్, రక్షణ మంత్రికి సైంటిఫిక్ అడ్వైజర్ సతీశ్ రెడ్డి మోహన్ రెడ్డికి అవార్డు ప్రదానం చేశారు.
పద్మశ్రీని తిరస్కరించిన ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్
ప్రముఖ సితార్, సుర్‌బహార్ విద్వాంసుడు ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ (82) ఇటీవల తనకు కేటాయించిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించారు. కేంద్ర ప్రభుత్వం తన ప్రతిభను చాలా ఆలస్యంగా గుర్తించిందని.. అవార్డును తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. 2017 సంవత్సరానికి గాను ఇటీవల 89 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం ఇమత్ ్రఖాన్‌ను ఎన్‌ఆర్ ఐ విభాగంలో పద్మశ్రీకి ఎంపిక చేసింది.
అనిష్ కపూర్‌కు ఇజ్రాయెల్ జెనెసిస్ అవార్డు
భారత సంతతికి చెందిన ప్రఖ్యాత బ్రిటిష్ శిల్పి, సిరియన్ శరణార్థుల హక్కుల కోసం పోరాడిన అనిష్ కపూర్‌కు ప్రతిష్టాత్మక జెనెసిస్ అవార్డు లభించింది. శరణార్థుల పట్ల ప్రభుత్వాల దుర్మార్గపు విధానాలపై పోరాడినందుకు గాను ఇజ్రాయెల్‌కు చెందిన జెనెసిస్ ప్రైజ్ ఫౌండేషన్ ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది. అవార్డు కింద ఒక మిలియన్ డాలర్లు (రూ. 6.71 కోట్లు) నగదు బహుకరిస్తారు.

Published date : 11 Feb 2017 10:36AM