Skip to main content

న‌వంబ‌ర్ 2020 అవార్డ్స్

తెలంగాణ హెచ్చార్సీ చైర్మన్‌కు నెల్సన్ మండేలా అవార్డు
Current Affairs
తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ) తొలి చైర్మన్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ గుండా చంద్రయ్యకు ప్రతిష్టాత్మక ‘నెల్సన్ మండేలా అవార్డు-2020’ లభించింది. జాతీయ సహకార వారోత్సవాల ముగింపు సందర్భంగా... ఢిల్లీ నేషనల్ కో-ఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆడిటోరియంలో నవంబర్ 19న జరిగిన కార్యక్రమంలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ఈ అవార్డును జస్టిస్ చంద్రయ్యకు ప్రదానం చేశారు. పేదలు, మహిళలు, దివ్యాంగులు, చిన్న పిల్లల హక్కుల పరిరక్షణకు చేస్తున్న కృషికిగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.
నేషనల్ కో.ఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా- న్యూఢిల్లీ, ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మల్టీస్టేట్ కో -ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంయుక్తంగా ‘నెల్సన్ మండేలా’ అవార్డును ఇస్తున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నెల్సన్ మండేలా అవార్డు-2020 విజేత
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : హెచ్చార్సీ తొలి చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ గుండా చంద్రయ్య
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : పేదలు, మహిళలు, దివ్యాంగులు, చిన్న పిల్లల హక్కుల పరిరక్షణకు చేస్తున్న కృషికిగాను

బుకర్‌ప్రైజ్-2020ను గెలుచుకున్ను స్కాటిష్ రచయత?
స్కాటిష్-అమెరికన్ రచయత డగ్లస్ స్టువార్ట్ 2020 సంవత్సర బుకర్‌ప్రైజ్‌ను గెలుచుకున్నారు. డగ్లస్ రచించిన తన ఆత్మకథ ‘‘షుగ్గీబెయిన్’’కు ఈ అవార్డు దక్కింది. 1980 ప్రాంతంలో గ్లాస్గో నగరంలో జరిగిన ఘటనల సమాహారంగా షుగ్గీబెయిన్ నవలను మలచారు. స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గో నగరంలో 1971, మే 31 జన్మించిన డగ్లస్ లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. అనంతరం అమెరికాలోని న్యూయార్క్‌కు వచ్చారు. షుగ్గీ బెయిన్ పబ్లిష్ కావడానికి ముందు 30 మంది ఎడిటర్లు ఆ రచనను తిరస్కరించారు.
బుకర్‌ప్రైజ్ పోటీలో ఐదుగురు రచయితలను తోసిరాజని డగ్లస్ ఈ బహుమతి పొందారు. పోటీలో పాల్గొని ఓటమి పొందిన వారిలో భారతీయ మూలాలున్న రచయిత అవని దోషి (రచన: బర్న్ట్ షుగర్)కూడా ఉన్నారు. బుకర్ ప్రైజ్ విజేతకు 50వేల పౌండ్ల(దాదాపు రూ. 49 లక్షలకుపైగా) నగదును అందిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బుకర్‌ప్రైజ్-2020 విజేత
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : స్కాటిష్-అమెరికన్ రచయత డగ్లస్ స్టువార్ట్
ఎందుకు : షుగ్గీబెయిన్ నవలను రచించినందుకుగాను

టీఎస్‌ఎఫ్‌సీవోఎఫ్‌కు కేంద్ర ప్రభుత్వ అవార్డు
మత్స్యరంగంలో ఉత్తమ పనితీరు కనబర్చిన తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య (టీఎస్‌ఎఫ్‌సీవోఎఫ్)కు కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించింది. ఇన్‌ల్యాండ్ (సముద్రేతర ప్రాంతాల్లో మత్స్య రంగ అభివృద్ధి) కేటగిరీ కింద రాష్ట్ర మత్స్యశాఖకు ఈ అవార్డు దక్కింది. నవంబర్ 21న ఢిల్లీలో జరిగిన ప్రపంచ మత్స్య దినోత్సవ కార్యక్రమంలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కేంద్ర పశుసంవర్థక, పాడి పరిశ్రమ, మత్స్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి చేతుల మీదుగా తెలంగాణ పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ కార్యదర్శి, మత్స్యశాఖ ఇన్‌చార్జి కమిషనర్ అనితా రాజేంద్ర ఈ అవార్డు అందుకున్నారు. అవార్డుతో పాటు రూ. 5 లక్షల నగదు బహుమతిని స్వీకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్‌ల్యాండ్ కేటగిరిలో జాతీయ అవార్డు విజేత
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య (టీఎస్‌ఎఫ్‌సీవోఎఫ్)
ఎందుకు : మత్స్యరంగంలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు

మొట్టమొదటి టీఎక్స్2 అవార్డును గెలుచుకున్న దేశం?
తక్కువ సమయంలోనే పులుల సంఖ్యను రెండింతలు చేసినందుకుగానూ... ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్(పీటీఆర్)కు ‘టీఎక్స్2 అవార్డు’ లభించింది. దీంతో ఈ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి దేశంగా భారత్ రికార్డు నెలకొల్పింది. పులులను జాగ్రత్తగా పర్యవేక్షించడం, దాడులను తగ్గించడం ద్వారా పులుల సంఖ్యను పెంచినట్లు పీటీఆర్ అధికారులు తెలిపారు.
టీఎక్స్2 అవార్డు- విశేషాలు...
  • 2010లో పులులను రక్షించేందుకు, వాటి సంఖ్యను పెంచేందుకు రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ వేదికగా టీఎక్స్2 గ్లోబల్ అవార్డును ఏర్పాటు చేశారు. ఇందులో టైగర్ రిజర్వ్‌లు ఉన్న 13 దేశాలు పోటీ పడ్డాయి.
  • 2010లో ఉన్న పులుల సంఖ్యను 2022 నాటికి రెండింతలు చేయాలన్నది ఈ అవార్డు అసలు లక్ష్యం.
  • యూపీలోని పీటీఆర్ 2018 నాటికే ఈ ఘనతను సాధించింది.
  • 2014 లెక్కల ప్రకారం పిలిభిత్‌లో 25 పులులున్నాయి. అవి 2018 నాటికి 65కు చేరుకున్నాయి.

క్విక్ రివ్యూ:
ఏమిటి : మొట్టమొదటి టీఎక్స్2 అవార్డును గెలుచుకున్న దేశం
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : భారత్
ఎక్కడ : ప్రపంచంలో
ఎందుకు : ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్(పీటీఆర్)లో పులుల సంఖ్యను రెట్టింపు చేసినందుకు

ఉమాంగ్ ప్లాటినం పార్టనర్ అవార్డును గెలుచుకున్న సంస్థ?
ఉమాంగ్ యాప్‌పై 25 లక్షల లావాదేవీలు రిజిస్టర్ చేసినందుకుగాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ఈపీఎఫ్‌ఓకు ప్లాటినం పార్టనర్ అవార్డు లభించింది. ఉమాంగ్ యాప్‌ను ఆవిష్కరించి 3 సంవత్సరాలైన సందర్భంగా కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ నవంబర్ 25న ఉమాంగ్ పార్టనర్ అవార్డులను ప్రకటించారు. అన్ని సేవల్లో గత ఆరు నెలల్లో జరిగిన లావాదేవీల సరాసరి ఆధారంగా ఈ అవార్డులు ప్రకటించారు. ఇందులో 25 లక్షల లావాదేవీలు జరిపినందుకుగాను ఈపీఎఫ్‌ఓ ప్లాటినం అవార్డును గెలుచుకుంది.
ఉమాంగ్ గురించి...
ప్రజలకు సులువుగా, త్వరగా ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకుని రావాలన్న లక్ష్యంతో... ఉమాంగ్ (UMANG-The Unified Mobile Application for New-age Governance) యాప్‌ను రూపొందించారు. ఎలక్టాన్రిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్(ఎన్‌ఈజీపీ) ఉమాంగ్ యాప్‌ను అభివృద్ధి చేసింది. 2017, నవంబర్ 23న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 163 సేవలతో ఈ యాప్‌ను జాతికి అంకితం చేశారు. 13 భారతీయ భాషలలో అందుబాటులో ఉన్న ఈ యాప్ ప్రస్తుతం 2039 సేవలను అందిస్తోంది.
విదేశాలలోనూ...
భారత విదేశీ మంత్రిత్వ శాఖ సహకారంతో అమెరికా, కెనడా,యూకే , ఆస్ట్రేలియా, యూఏఈ , నెథర్లాండ్స్ , సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలలో ఉమాంగ్ యాప్‌ను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సేవలను విదేశాలలో చదువుతున్న విద్యార్థులు, ప్రవాస భారతీయులు, విదేశీ పర్యాటకులు పొందగలుగుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉమాంగ్ ప్లాటినం పార్టనర్ అవార్డును గెలుచుకున్న సంస్థ
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ఈపీఎఫ్‌ఓ
ఎందుకు : ఉమాంగ్ యాప్‌పై 25 లక్షల లావాదేవీలు రిజిస్టర్ చేసినందుకుగాను

కలామ్ జాతీయ అవార్డుకు ఎంపికైన ప్రకృతి వైద్యుడు?
Current Affairs
తెలంగాణలోని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రముఖ ప్రకృతి వైద్యుడు కె.వై.రామచందర్‌రావు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలోని క్యాపిటల్ ఫౌండేషన్, జస్టిస్ కృష్ణయ్య ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. 2020, నవంబర్ 15వ తేదీన ఢిల్లీలో కేరళ గవర్నర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు. డాక్టర్ రామచందర్‌రావు సేవలకు గుర్తింపుగా ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఆయనకు అవార్డుతోపాటు ఎ లివింగ్ చరక మహర్షి’ అనే బిరుదు కూడా ఇవ్వనున్నారు.
నేలకొండపల్లిలో 22 ఏళ్ల క్రితం సిద్ధార్థ యోగా విద్యాలయం ఏర్పాటు చేసిన డాక్టర్ రామచందర్‌రావు, ఆయన భార్య డాక్టర్ ఎన్.జి.పద్మ.. ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రకృతి వైద్యులుగా పేరొందడంతో తెలుగు రాష్ట్రాలే కాకుండా ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి ప్రజలు వైద్య సేవల కోసం ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తుంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ జాతీయ అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : నవంబర్ 12
ఎవరు : ప్రకృతి వైద్యుడు కె.వై.రామచందర్‌రావు
ఎందుకు : వైద్య రంగంలో చేసిన విశేష కృషికి గాను

భారత ఆర్మీ చీఫ్‌కు నేపాల్ సైనిక గౌరవ జనరల్‌గా గౌరవ పురస్కారం
Current Affairs
భారత్, నేపాల్ సైన్యాల గత ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని అనుసరిస్తూ భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణేకు నేపాల్ ప్రభుత్వం గౌరవ జనరల్ హోదా ఇచ్చింది. నేపాల్ రాజధాని ఖాట్మండూలో అధ్యక్ష భవనం శీతల్ నివాస్లో నవంబర్ 6న జరిగిన కార్యక్రమంలో జనరల్ నరవాణేకు నేపాల్ అధ్యక్షురాలు విద్యా దేవి భండారి ఖడ్గాన్ని బహుకరించి నేపాల్ సైనిక గౌరవ జనరల్‌గా గౌరవ పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, భారత రాయబారి వినయ్ ఎం. క్వాత్రా పాల్గొన్నారు. 1950లో మొదటిసారి భారత సైన్యం ’కమాండర్ ఇన్ చీఫ్’ జనరల్ కేఎం కరియప్పకు తొలిసారి నేపాల్ గౌరవ జనరల్ హోదా ఇవ్వగా.. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణేకు నేపాల్ సైనిక గౌరవ జనరల్‌గా గౌరవ పురస్కారం ప్రదానం
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : నేపాల్ అధ్యక్షురాలు విద్యా దేవి భండారి
ఎక్కడ : శీతల్ నివాస్, ఖాట్మాండు, నేపాల్

ఐక్యరాజ్యసమితి ఉత్తమ మహిళా పోలీస్ అవార్డు గ్రహీత?
జాంబియా దేశానికి చెందిన డోరిన్ మెలాంబో యునెటైడ్ నేషన్స్(యూఎన్) ఉత్తమ మహిళా పోలీస్ అవార్డు-2020(యుఎన్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ ది ఇయర్)కు ఎంపికయ్యారు. నవంబర్ 3న జరిగిన వర్చువల్ కార్యక్రమంలో ఆమె ఈ అవార్డును స్వీకరించారు. ప్రస్తుతం దక్షిణ సూడాన్ లోని యుఎన్ మిషన్ (యుఎన్మిస్) లో మెలాంబో పనిచేస్తుంది. మహిళల సాధికారతను ప్రోత్సహించడానికి 2011 లో యుఎన్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును స్థాపించారు.
సవాంగ్ స్ఫూర్తితోనే అవార్డు: మెలాంబో
ఐరాస అవార్డు లభించిన మెలాంబో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘‘ ‘నేను యూఎన్ బెస్ట్ పోలీస్ అధికారిగా ఎన్నిక కావటానికి స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయుడు భారత్‌కు చెందిన ఐపీఎస్ అధికారి డీజీపీ గౌతమ్ సవాంగ్. 2008లో యూఎన్ పోలీస్ విభాగంలో ప్రయాణాన్ని ప్రారంభించా. అప్పటి నుంచి సవాంగ్ నాకు దిశానిర్దేశం చేసి సమర్థవంతమైన అధికారిణిగా నిలిచేలా దోహదం చేశారు’ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డీజీపీ గౌతమ్ సవాంగ్ 2008లో యూఎన్ మిషన్ ఇన్ లైబీరియాకు పోలీస్ కమిషనర్‌గా వ్యవహరించారు. 40 దేశాలకు చెందిన పోలీస్ అధికారులకు సారథ్యం వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యుఎన్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ ది ఇయర్-2020 అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : జాంబియా దేశానికి చెందిన డోరిన్ మెలాంబో

జాతీయ జల అవార్డులు-2019
కేంద్ర జల్ శక్తి శాఖ 2019 సంవత్సరానికి గాను 2వ జాతీయ జల అవార్డులను (ఎన్‌డబ్ల్యుఏ) ప్రకటించింది. 2020, నవంబర్ 11, 12వ తేదీలలో ఆన్‌లైన్ వేదికగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. 2020 ఏడాది అవార్డులకుగాను మొత్తం 1,112 దరఖాస్తుల్లో మొత్తం 98 మంది విజేతలను 16 కేటగిరీల్లో ఎంపిక చేశారు. జల సంరక్షణ-నిర్వహణ రంగంలో ప్రశంసనీయంగా పనిచేస్తున్న వ్యక్తులను, సంస్థలను గుర్తించి అవార్డులు ప్రదానం చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం. నీటి ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించినందుకు, ఉత్తమమైన నీటి వినియోగ పద్ధతులను అనుసరించేలా ప్రేరేపించినందుకు ఈ అవార్డులు అందిస్తున్నారు.
ఉత్తమ రాష్ట్రాల కేటగిరీలో...

  • 2019 ఏడాది ఉత్తమ రాష్ట్రాల కేటగిరీలో తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.
  • ఉత్తమ జిల్లాల కేటగిరీలో ‘నదుల పునరుజ్జీవనం-జల సంరక్షణ’లో అత్యుత్తమ పనితీరు కనబరచి సౌత్ జోన్ (దక్షిణాది రాష్ట్రాల) నుంచి వైఎస్సార్ కడప జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.
  • ఆకాంక్ష జిల్లాల కేటగిరీలో విజయనగరం జిల్లా రెండో స్థానంలో నిలిచింది.

క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ జల అవార్డులు-2019 ప్రదానం
ఎప్పుడు : 2020, నవంబర్ 11
ఎవరు : కేంద్ర జల్ శక్తి శాఖ
ఎక్కడ : ఆన్‌లైన్ విధానంలో
ఎందుకు : జల సంరక్షణ-నిర్వహణ రంగంలో ప్రశంసనీయంగా పనిచేస్తున్న వ్యక్తులను, సంస్థలను గుర్తించి, ప్రోత్సహించేందుకు

టిల్ట్ మ్యాన్ ప్రైజ్ ఫర్ హిస్టరీ పురస్కారం గెలుచుకున్న రచయిత?
Current Affairs
భారతీయ మూలాలున్న బ్రిటీష్ జర్నలిస్టు, రచయిత అనితా ఆనంద్ యూకేలోని ప్రతిష్ఠాత్మక పెన్ హెసెల్- టిల్ట్ మ్యాన్ ప్రైజ్‌ఫర్ హిస్టరీ-2020 పురస్కారం గెలుచుకున్నారు. అనితా ఆనంద్చ్రించిన ‘ది పేషెంట్ అసాసిన్’ పుస్తకానికి గాను ఈ అవార్డు దక్కింది. 1919, ఏప్రిల్ 13న పంజాబ్ రాష్ట్రం అమృతసర్‌లోని జలియన్‌వాలా బాగ్‌లో జరిగిన మానవ మారణహోమంతో అనుబంధమున్న ఓ యువకుడి వృత్తాంతమే ఈ పుస్తకం.
ఏపీలో పోస్కో పెట్టుబడులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని కొరియాకు చెందిన ప్రముఖ స్టీల్ ఉత్పత్తి సంస్థ ‘‘పోస్కో’’ వెల్లడించింది. సీఎం క్యాంపు కార్యాలయంలో అక్టోబర్ 29న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో పోస్కో ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో తమ సంస్థలను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
క్విక్ రివ్వూ:
ఏమిటి : పెన్ హెసెల్- టిల్ట్ మ్యాన్ ప్రైజ్ ఫర్ హిస్టరీ-2020 పురస్కారం విజేత
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : బ్రిటీష్ జర్నలిస్టు, రచయిత అనితా ఆనంద్
ఎందుకు :ది పేషెంట్ అసాసిన్ పుస్తకాన్ని రచించినందుకు

Published date : 05 Dec 2020 02:47PM

Photo Stories