Skip to main content

మే 2017 అవార్డ్స్

కాకి రఘురెడ్డికి కమెండేషన్ అవార్డు
అమెరికాలో అందించిన పలు సేవలకుగాను సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన ప్రముఖ ఎన్‌ఆర్‌ఐ కాకి రఘురెడ్డి ప్రతిష్టాత్మకమైన కమెండేషన్ అవార్డు దక్కింది. కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో ఉన్న సిటీ హాలులో మే 23న జరిగిన కార్యక్రమంలో ఆయన అవార్డు అందుకున్నారు. అమెరికా తెలుగు సంఘానికి (ఆటా) చాలా ఏళ్లుగా రీజనల్ కోఆర్డినేటర్‌గా ఉన్న రఘురెడ్డి ఇటీవలే ఆటా ప్లానింగ్ చెయిర్‌గా ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాకి రఘురెడ్డికి కమెండేషన్ అవార్డు
ఎప్పుడు : మే 24
ఎక్కడ : అమెరికాలో

అశ్విన్‌కు ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డు
Current Affairs భారత అగ్రశ్రేణి ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 2017 ఏడాదికి గాను సియట్ అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ మేరకు మే 24న ముంబయిలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన ‘సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్’ వేడుకలో సునీల్ గవాస్కర్, ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా చేతుల మీదుగా అశ్విన్ ఈ అవార్డును అందుకున్నాడు.
ఈ సీజన్‌లో సొంతగడ్డపై భారత్ ఆడిన 13 టెస్టుల్లో 10 టెస్టులు గెలవడంలో అశ్విన్ కీలకపాత్ర పోషించాడు. గత 12 నెలల కాలంలో అతను ఏకంగా 99 వికెట్లు పడగొట్టాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సియట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్
ఎప్పుడు : మే 24
ఎవరు : రవిచంద్రన్ అశ్విన్

9 మంది ఎంపీలకు ‘సంసద్త్న్ర’ అవార్డులు
తొమ్మిది మంది పార్లమెంట్ సభ్యులు ప్రతిష్టాత్మక సంసద్ రత్న అవార్డులకు ఎంపికయ్యారు. 2017 సంవత్సరానికి లోక్‌సభ నుంచి ఆరుగురు, రాజ్యసభ నుంచి ముగ్గురు ఈ గౌరవాన్ని పొందనున్నారని జస్ట్టిస్ సదాశివమ్, ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసన్ తెలిపారు. ఈ అవార్డులను దివంగత రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం సలహా మేరకు ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది.
పార్లమెంట్‌లో ఎన్ని ప్రశ్నలు అడిగారు? ఎన్ని చర్చలలో పాల్గొన్నారు? ఎన్ని బిల్లులు ప్రవేశపెట్టారు? సభ్యులు తమ నియోజకవర్గాలలో ఎంతమేర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు.
2017 అవార్డుల గ్రహీతలు
శ్రీరంగ్ అప్పా బర్నే (శివసేన), రాజీవ్ శంకర్‌రావు (కాంగ్రెస్), ధనంజయ్ బీమ్‌రావ్ మహాదిక్ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ), భర్తృహరి మహతాబ్ (బిజూ జనతాదళ్), ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్(రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ), హీనా విజయ్‌కుమార్ గవిట్(బీజేపీ).
క్విక్ రివ్యూ:
ఏమిటి : సంసద్ రత్న అవార్డులు - 2017
ఎప్పుడు : మే 26
ఎవరు : ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్
ఎందుకు : పార్లమెంటు సభ్యులకు

‘ద స్క్వేర్’ చిత్రానికి పామ్ డా అవార్డ్
ఫ్రాన్స్ లోని కేన్స్ లో జరిగిన 70వ అంతర్జాతీయ కేన్‌‌స చలన చిత్రోత్సవాల్లో ‘ద స్క్వేర్’ అనే స్వీడిష్ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘పామ్ డా’ అవార్డు గెలుచుకుంది. ఆధునిక సమాజ పోకడను విమర్శిస్తూ తీసిన ఈ చిత్రానికి రూబెన్ ఒస్లండ్ దర్శకత్వం వహించారు. అవార్డును స్పానిష్ చిత్ర నిర్మాత, జ్యూరీ చీఫ్ పెడ్రో అల్మోడోవర్ ప్రకటించి ఒస్లండ్‌కు ప్రదానం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పామ్ డా అవార్డ్ - 2017
ఎప్పుడు : మే 28
ఎవరు : ద స్క్వేర్ చిత్రానికి
ఎక్కడ : అంతర్జాతీయ కేన్స్ చలనచిత్రోత్సవాల్లో

ముగిసిన కేన్స్ చలన చిత్రోత్సవాలు
70వ అంతర్జాతీయ కేన్స్ చలన చిత్రోత్సవాలు ఫ్రాన్‌‌సలోని కేన్‌‌సలో మే 28న ముగిశాయి. ద స్క్వేర్ అనే స్వీడిష్ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మక పామ్ డా అవార్డును గెలుచుకుంది. ఆధునిక సమాజ పోకడలను విమర్శిస్తూ తీసిన ఈ సినిమాకు రూబెన్ ఒస్లండ్ దర్శకత్వం వహించారు. బిగ్విల్డ్ చిత్రానికి సోఫియా కొప్పోలా ఉత్తమ దర్శకురాలి అవార్డును గెలుచుకుంది. ‘యువర్ నెవర్ రియల్లీ హియర్’ చిత్రంలో నటనకు జాక్విన్ ఫోనిక్స్ ఉత్తమ నటుడి అవార్డును కైవసం చేసుకోగా, ఇన్ ద ఫేడ్ చిత్రంలో నటనకు డైయనె కృజర్ ఉత్తమ నటి అవార్డు అందుకుంది.

మృత్యుంజయ శర్మకు బిస్మిల్లాఖాన్ పురస్కారం
ప్రముఖ కూచిపూడి నాట్యాచారుడు, అఖిలభారత కూచిపూడి నాట్యమండలి వ్యవస్థాపక కార్యదర్శి పసుమర్తి మృత్యుంజయ శర్మ.. కేంద్ర సంగీత నాటక అకాడమీ నుంచి ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారానికి ఎంపికయ్యారు. న్యూఢిల్లీలోని అవార్డుల కమిటీ ఈ సమాచారాన్ని మే 29న ఆయనకు తెలియజేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని నాట్యక్షేత్రం కూచిపూడికి చెందిన మృత్యుంజయశర్మ దేశం నలుమూలలతో పాటు అమెరికా, దక్షిణాఫ్రికాలో ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన ఇంతకముందు నాట్య శిరోమణి, నాట్య కౌముది అవార్డులు అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మృత్యుంజయ శర్మకు బిస్మిల్లాఖాన్ పురస్కారం
ఎప్పుడు : మే 29
ఎవరు : కేంద్ర సంగీత నాటక అకాడమీ

ఇద్దరు భారతీయులకు గ్రీన్ ఆస్కార్ అవార్డులు
దేశంలో జంతువులు, పక్షుల పరిరక్షణకు చేసిన విశేష కృషికి గాను సంజయ్ గుబ్బి, పూర్ణిమ బర్మన్‌కు ప్రతిష్టాత్మక విట్లే అవార్డులు (గ్రీన్ ఆస్కార్స్) దక్కాయి. ఈ అవార్డు కింద విజేతలిద్దరికి రూ.29 లక్షలు దక్కనున్నాయి. ఈ మేరకు విట్లే ఫండ్ ఫర్ నేచర్ సంస్థ మే 17న ప్రకటించింది. సంజయ్ 2012 నుంచి కర్ణాటక ప్రభుత్వంతో కలసి పులుల రక్షణకు పాటుపడుతుండగా, పూర్ణిమ స్థానిక మహిళలతో కలసి అస్సాంలోని చిత్తడి నేలల్లో నివసించే బెగ్గురు కొంగను కాపాడుతున్నారు. ఈ అవార్డును 1994 నుంచి విట్లే ఫండ్ ఫర్ నేచర్ సంస్థ ఇస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి
: గ్రీన్ ఆస్కార్ అవార్డులు - 2017
ఎప్పుడు : మే 17
ఎవరు : సంజయ్ గుబ్బి, పూర్ణిమ బర్మన్

ఇస్రోకు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రోకు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం దక్కింది. 2014 సంవత్సరానికిగాను ప్రకటించిన ఈ అవార్డును ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్.. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ చేతుల మీదుగా మే 17న అందుకున్నారు. అవార్డు కింద కోటి రూపాయల నగదు, ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
2015 అవార్డును ఐక్యరాజ్యసమితి శరణార్థి విభాగమైన ‘యునెటైడ్ నేషన్‌‌స హైకమిషనర్ ఫర్ రెప్యూజీస్-యూఎన్‌హెచ్‌సీఆర్’కు ప్రకటించారు. దుర్బర పరిస్థితుల మధ్య స్వదేశాన్ని వదిలి విదేశాలకు తరలివెళ్తున్న శరణార్థులకు సహాయ సహకారాలు అందించడంలో యూఎన్‌హెచ్‌సీఆర్ అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఇందిరా గాంధీ శాంతి పురస్కారం
ఎప్పుడు : మే 18
ఎవరు : 2014- ఇస్రో, 2015- యూఎన్‌హెచ్‌సీఆర్

బ్రిజేశ్ థాపా, రవి కుమార్‌లకు ఐరాస శాంతి పుర స్కారం
ఇద్దరు భారతీయ సైనికులకు ఐక్యరాజ్యసమితి అత్యున్నత శాంతి పురస్కారాలు లభించాయి. ఈ మేరకు శాంతిస్థాపనలో కీలక పాత్ర పోషించిన బ్రిజేశ్ థాపా, రవి కుమార్‌లకు యూఎన్ మెడల్స్ ప్రదానం చేయనున్నట్లు ఐక్యరాజ్యసమితి మే 20న ప్రకటించింది. వీరిద్దరికీ మరణానంతరం ఈ పురస్కారం దక్కింది.
ప్రపంచ దేశాల మధ్య శాంతి స్థాపన కోసం ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన the UN Organisation Stabilisation Mission in the Democratic Republic of the Congo (MONUSCO)లో బ్రిజేశ్ థాపా విధులు నిర్వర్తిస్తూ అమరుడు కాగా... లెబనాన్‌లోని యూఎన్ ఇంటెర్మ్ ఫోర్స్‌లో విధులు నిర్వర్తస్తూ రవికుమార్ ప్రాణాలు విడిచారు. వీరి త్యాగాలకు గుర్తింపుగా యూఎన్ శాంతి బహుమతిని అందజేయనున్నారు. దాగ్ హమ్మర్స్కోల్డ్ మెడల్‌గా పిలిచే ఈ శాంతి పురస్కారాన్ని మే 24న ఐక్యరాజ్యసమితి శాంతిస్థాపకుల దినోత్సవం సందర్భంగా ప్రదానం చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఐరాస శాంతి పురస్కారం
ఎప్పుడు : మే 20
ఎవరు : బ్రిజేశ్ థాపా, రవి కుమార్‌లకు

రోహన్ చక్రవర్తికి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అవార్డు
భారత కార్టూనిస్ట్ రోహన్ చక్రవర్తికి ప్రతిష్టాత్మక డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇంటర్నేషనల్‌ ప్రెసిడెంట్స్‌ అవార్డు దక్కింది. ఈ మేరకు ఇండోనేషియాలోని మనడోలో మే 22న జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో చక్రవర్తి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ‘గ్రీన్ హ్యూమర్‌’ పేరుతో కామిక్‌ కార్టూన్ స్ట్రిప్‌ను గీసినందుకుగాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది. కాగా యువ పర్యావరణవేత్తలకు ఇచ్చే ఈ పురస్కారానికి ఓ కార్టూనిస్టును ఎంపికచేయడం ఇదే తొలిసారి.

క్విక్‌ రివ్యూ:

ఏమిటి : డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇంటర్నేషనల్‌ ప్రెసిడెంట్స్‌ అవార్డు

ఎప్పుడు : మే 22

ఎవరు : కార్టూనిస్ట్‌ రోహన్‌ చక్రవర్తి

ఎందుకు : ‘గ్రీన్ హ్యూమర్‌’ పేరుతో కామిక్‌ కార్టూన్ స్ట్రిప్‌ను గీసినందుకుగాను

భారత శాస్త్రవేత్తకు ఇజ్రాయెల్‌ డేన్‌ డేవిడ్‌ అవార్డు

భారత శాస్త్రవేత్త శ్రీనివాస్‌ కులకర్ణి ప్రఖ్యాత ఇజ్రాయెల్‌ డేన్‌ డేవిడ్‌ పురస్కారాన్ని మే 21న టెల్‌ అవివ్‌(ఇజ్రాయెల్‌)లో అందుకున్నారు. అంతరిక్ష విభాగంలో చేసిన విశేష కృషికి ఆయనకు ఈ పురస్కారం దక్కింది. శ్రీనివాస్‌ కులకర్ణి ప్రస్తుతం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో ఖగోళ భౌతిక శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.



జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులు - 2017
తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు నర్సులకు 2017 ఏడాదికిగానూ జాతీయ ఫ్లోరెన్స్‌ నైటింగేల్ అవార్డులు దక్కాయి. ఈ మేరకు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన వైద్య ఆరోగ్య విభాగంలో పనిచేస్తున్న వారికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మే 12న అవార్డులు ప్రదానం చేశారు.
అవార్డు గ్రహీతలు
1. మాదెల్ల ఎంహెచ్. ప్రమీలాదేవి - ప్రాంతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శిక్షణ కేంద్రం, కర్నూలు
2. గోవిందమ్మ - ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కనగల్లు, గుంటూరు జిల్లా.
3. దున్న జయ - చింతపల్లి, తెలంగాణ
క్విక్ రివ్యూ:
ఏమిటి :
జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులు - 2017
ఎప్పుడు : మే 12
ఎవరు : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
ఎక్కడ : న్యూఢిల్లీలో

చందా కొచ్చర్‌కు ఉడ్రో విల్సన్ పురస్కారం
ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ చందా కొచ్చర్ మే 10న ప్రతిష్టాత్మక ఉడ్రో విల్సన్ పురస్కారాన్ని అమెరికాలో అందుకున్నారు. గ్లోబల్ కార్పొరేట్ సిటిజన్‌షిప్ విభాగంలో ఆమెకు ఈ పురస్కారం లభించింది. ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయ మహిళగా కొచ్చర్ రికార్డుకెక్కారు. గతంలో భారత్ నుంచి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఎన్‌ఆర్ నారాయణమూర్తిలు ఈ అవార్డును అందుకున్నారు.

స్వచ్ఛ సర్వేక్షణ్ - 2017 అవార్డులు
Current Affairs
దేశంలో అత్యంత స్వచ్ఛమైన నగరాల జాబితాలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో భోపాల్ (మధ్యప్రదేశ్), ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, గుజరాత్‌లోని సూరత్ నగరాలు నిలిచాయి. ఈ మేరకు స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్-2017 పేరిట దేశవ్యాప్తంగా 434 నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పరిస్థితులపై నిర్వహించిన ప్రజాభిప్రాయం మేరకు రూపొందించిన జాబితాను మే 4న కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు విడుదల చేశారు.
ఈ సర్వేలో టాప్ - 50లో ఆంధ్రప్రదేశ్ నుంచి 8, తెలంగాణ నుంచి 4 పట్టణాలకు చోటు దక్కింది. మున్సిపల్ డాక్యుమెంటేషన్, ప్రత్యక్ష పరిశీలన, పౌరుల స్పందన తదితర అంశాల ప్రాతిపదికన ఈ సర్వే నిర్వహించారు.
అత్యంత స్వచ్ఛ నగరాలు
  1. ఇండోర్ (మధ్యప్రదేశ్)
  2. భోపాల్ (మధ్యప్రదేశ్)
  3. విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)
  4. సూరత్ (గుజరాత్)
  5. మైసూర్ (కర్ణాటక) ( 2016లో తొలిస్థానం )
  6. తిరుచురాపల్లి (తమిళనాడు)
  7. న్యూఢిల్లీ
  8. నవీ ముంబై (మహారాష్ట్ర)
  9. తిరుపతి (ఆంధ్రప్రదేశ్)
  10. వడోదర (గుజరాత్)
అత్యంత చెత్త నగరాలు
  1. గోండా(ఉత్తరప్రదేశ్)
  2. భుసావల్(మహారాష్ట్ర)
  3. బగహ (బిహార్)
  4. కతిహర్(బిహార్)
  5. హర్దోయ్ (ఉత్తరాఖండ్)
  6. బహ్రైచ్ (ఉత్తరప్రదేశ్)
  7. షాజహాన్‌పూర్ (ఉత్తరప్రదేశ్)
  8. ఖుర్జా (ఉత్తరప్రదేశ్)
  9. ముక్త్‌సర్ (పంజాబ్)
  10. అబోహర్ (పంజాబ్)
జోనల్‌వారీగా అవార్డులు
  • జోనల్‌వారీగా ప్రకటించిన అవార్డుల్లో సౌత్‌జోన్‌లో వేగంగా పురోగతి సాధించిన నగరాలు/పట్టణాల కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, ఒంగోలు, తాడిపత్రి పురస్కారాలు గెలుచుకున్నాయి. ఈ విభాగంలో 10 లక్షల జనాభా ఉన్న నగరాల కేటగిరీలో విజయవాడ, రెండు నుంచి పదిలక్షల జనాభా గల నగరాల కేటగిరీలో ఒంగోలు, రెండు లక్షలలోపు జనాభా కలిగిన పట్టణాల కేటగిరీలో తాడిపత్రి అవార్డు దక్కించుకున్నాయి.
  • పరిశుభ్ర నగరం విభాగంలో 2 నుంచి 10 లక్షల జనాభా కలిగిన నగరాల కేటగిరీలో ఏపీ నుంచి కాకినాడ అవార్డు సాధించింది.
  • పరిశుభ్ర నగరం విభాగంలో తెలంగాణ నుంచి 2 లక్షలలోపు కేటగిరీలో సూర్యాపేట అవార్డు పొందింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వచ్ఛ సర్వేక్షణ్ - 2017 అవార్డులు
ఎప్పుడు : మే 4
ఎవరు : కేంద్ర పట్టణాభివృద్ధి
ఎక్కడ : న్యూఢిల్లీలో
ఎందుకు : స్వచ్ఛ భారత్‌లో భాగంగా

సచిన్‌కు ఆసియా ఫెలోషిప్ అవార్డు
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ఆసియా ఫెలోషిప్ అవార్డు దక్కింది. ఈ మేరకు మే 6న లండన్‌లో జరిగిన 7వ ఆసియా అవార్డుల కార్యక్రమంలో సచిన్ ఈ పురస్కారం అందుకున్నారు. గతంలో దివంగత సంగీత విధ్వాంసుడు రవిశంకర్, సర్ బెన్ కింగ్స్‌లే, జాకీ చాన్‌లు ఈ అవార్డు పొందినవారిలో ఉన్నారు.
ఆసియాలో ఆయా రంగాల్లో అత్యుత్తమంగా రాణించినవారికి 2010 నుంచి ఈ అవార్డు అంద జేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సచిన్‌కు ఆసియా ఫెలోషిప్ అవార్డు
ఎప్పుడు : మే 6
ఎవరు : ఆసియా అవార్డుల కమిటీ
ఎక్కడ : లండన్

ఎమ్మా వాట్సన్‌కు జెండర్‌లెస్ బెస్ట్ యాక్టర్ అవార్డు
నటీ, నటుడు అన్న తేడాలేకుండా కేవలం నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ తొలిసారిగా అందజేసిన జెండర్‌లెస్ బెస్ట్ యాక్టర్ అవార్డు హాలీవుడ్ నటి ఎమ్మా వాట్స్‌న్‌కు దక్కింది. ఈ మేరకు మే 7న అమెరికాలోని లాజ్ ఏంజిలెస్‌లో జరిగిన ఎంటీవీ మూవీ అండ్ టీవీ అవార్డుల కార్యక్రమంలో ఎమ్మా ఈ అవార్డు అందుకున్నారు.
లింగవివక్షకు తావులేకుండా కేవలం నటన పరంగా గుర్తించేందుకే ఎంటీవీ ఈ అవార్డను ప్రవేశపెట్టింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎమ్మా వాట్సన్‌కు జెండర్‌లెస్ బెస్ట్ యాక్టర్ అవార్డు
ఎప్పుడు : మే 7
ఎవరు : ఎంటీవీ
ఎక్కడ : అమెరికా

ఎల్‌ఐసీకి గోల్డెన్ పీకాక్ అవార్డు
నేషనల్ ట్రైనింగ్ ఎక్స్‌లెన్స్-2017 అవార్డుల్లో గోల్డెన్ పీకాక్ పురస్కారాన్ని లైఫ్ ఇన్సూరెన్‌‌స కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) గెలుపొందింది. ఈ మేరకు దుబాయ్‌లో జరిగిన అవార్డు ప్రదాన కార్యక్రమంలో ఎల్‌ఐసీ చైర్మన్ వీకే శర్మ ట్రోఫీ, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోల్డెన్ పీకాక్ అవార్డు - 2017
ఎప్పుడు : మే 9
ఎవరు : ఎల్‌ఐసీ
ఎక్కడ : దుబాయ్‌లో
Published date : 13 May 2017 03:17PM

Photo Stories