Tobacco: జార్ఖండ్‌కు వరల్డ్ నో టొబాకో డే అవార్డు–2022
Sakshi Education
పొగాకు వినియోగాన్ని నియంత్రించడంలో జార్ఖండ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. రాష్ట్రంలో పొగాకు వినియోగాన్ని తగ్గించడంలో చేసిన కృషికి గానూ ’వరల్డ్ నో టొబాకో డే అవార్డు–2022’కు జార్ఖండ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపిక చేసింది. మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును అందజేశారు. గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే (జీఏటీఎస్)–1 నివేదిక ప్రకారం–2012లో జార్ఖండ్‌లో పొగాకు నియంత్రణ కార్యక్రమం ప్రారంభమైంది.
Published date : 07 Jun 2022 06:08PM