YSR Awards 2021: వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ఎంతమందికి అందజేశారు?
వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్ సాఫల్య పురస్కారాల ప్రదాన కార్యక్రమం నవంబర్ 1న విజయవాడలోని ఏ–కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పురస్కారాలను అందజేశారు. 2021 సంవత్సరానికి 29 వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, 30 వైఎస్సార్ సాఫల్య పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన, ప్రజలకు విశిష్ట సేవలు అందించిన వారిని–సంస్థలను గుర్తించి ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ అవార్డుల కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పురస్కారం కింద రూ.10 లక్షల నగదు బహుమతితోపాటు జ్ఞాపికను ఇచ్చి సత్కరిస్తారు.
2021 ఏడాది పురస్కారాల విజేతలు...
ట్రస్టులు
1. ఎంఎస్‌ఎన్ చారిటీస్ ట్రస్ట్ – కాకినాడ(తూర్పుగోదావరి)
2. సీపీ బ్రౌన్ లైబ్రరీ – వైఎస్సార్ జిల్లా
3. సారస్వత నికేతన్ లైబ్రరీ – వేటపాలెం(ప్రకాశం)
4. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ – పుట్టపర్తి(అనంతపురం)
5. ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్ – వైఎస్సార్ జిల్లా
6. రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్(ఆర్‌డీటీ) – అనంతపురం
7. గౌతమి రీజనల్ లైబ్రరీ – తూర్పుగోదావరి
8. మహారాజా గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ – విజయనగరం
రైతులు
9. స్వర్గీయ పల్లా వెంకన్న – కడియం(తూర్పుగోదావరి)
10. మాతోట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ – శ్రీకాకుళం
11. ఎంసీ రామకృష్ణారెడ్డి – అనంతపురం
12. కొట్యాడ శ్రీనివాసరావు – విజయనగరం
13. విఘ్నేశ్వర ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ – కృష్ణా జిల్లా
14. ఎం.బలరామి రెడ్డి – వైఎస్సార్ జిల్లా
15. ఎస్.రాఘవేంద్ర – చిత్తూరు
16. సెగ్గె కొండలరావు – విశాఖపట్నం
17. ఆంధ్ర కశ్మీర్ ట్రైబల్ ఫ్మారింగ్ ప్రొడ్యూసర్ కంపెనీ – విశాఖపట్నం
18. వల్లూరు రవికుమార్ – కృష్ణా జిల్లా
19. శివ అభిరామిరెడ్డి – నెల్లూరు జిల్లా
కళలు–సంస్కృతి
20. పొందూరు ఖద్దర్(ఆంధ్రాపైన్ ఖాదీ కార్మికాభ్యుదయ సంఘం) – శ్రీకాకుళం
21. స్వర్గీయ వంగపండు ప్రసాదరావు(జానపద గేయం) – విజయనగరం
22. అచ్యుత నారాయణ(బొబ్బిలి వీణ కేంద్రం) – విజయనగరం
23. పొన్నాల రామసుబ్బారెడ్డి(రంగస్థలం) – నెల్లూరు
24. వినాయక నాట్యమండలి(సురభి నాటకం) – వైఎస్సార్ జిల్లా
25. సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం(కూచిపూడి నాట్యం) – కృష్ణా
26. దాలవాయి చలపతిరావు(తోలు బొమ్మలాట) – అనంతపురం
27. కిల్లు జానకమ్మ(థింసా నృత్య బృందం) – విశాఖ
28. సవర రాజు(సవర పెయింటింగ్స్) – శ్రీకాకుళం
29. మజ్జి శ్రీనివాసరావు(వీధి నాటకం) – విశాఖపట్నం
30. ధర్మాడి సత్యం(డిజాస్టర్ మేనేజ్‌మెంట్) – తూర్పుగోదావరి
31. సర్వారాయ హరికథ పాఠశాల (మహిళలు) – తూర్పుగోదావరి
32. మిరియాల అప్పారావు(బుర్రకథ) – పశ్చిమగోదావరి
33. కూరెళ్ల వెంకటాచారి(కొండపల్లి బొమ్మలు) – కృష్ణా
34. గోచిపాత గాలేబు(డప్పు కళాకారుడు) – కృష్ణా
35. జి.రమణయ్య(వెంకటగిరి జాంధానీ చీరలు) – నెల్లూరు
36. శివప్రసాద రెడ్డి(కళంకారీ పెయింటింగ్స్) – కర్నూలు
37. బాలాజీ ఉడ్ కార్వింగ్ ఆర్టిజన్స్ సొసైటీ – చిత్తూరు
38. డా.వి.సత్యనారాయణ(నాదస్వరం) – చిత్తూరు
39. పూసపాటి పరమేశ్వర్‌రాజు(కాలిగ్రఫీ) – విజయనగరం
సాహిత్యం
40. స్వర్గీయ కాళీపట్నం రామారావు(కారా మాస్టర్) – శ్రీకాకుళం
41. కత్తి పద్మారావు – గుంటూరు
42. రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి – వైఎస్సార్ జిల్లా
43. బండి నారాయణ స్వామి – అనంతపురం
44. కేతు విశ్వనాథరెడ్డి – వైఎస్సార్ జిల్లా
45. కొలకలూరి ఇనాక్ – గుంటూరు
46. లలితా కుమారి(ఓల్గా) – గుంటూరు
జర్నలిజం
47. ఏబీకే ప్రసాద్ – కృష్ణా
48. స్వర్గీయ పొత్తూరి వెంకటేశ్వరరావు – గుంటూరు
49. స్వర్గీయ ఖాజా హుస్సేన్ (దేవీప్రియ) – గుంటూరు
50. స్వర్గీయ కె.అమరనాథ్ – పశ్చిమగోదావరి
51. సురేంద్ర (కార్టునిస్ట్) – వైఎస్సార్ జిల్లా
52. ఇమామ్ – అనంతపురం
వైద్య–ఆరోగ్య విభాగం
53. డాక్టర్ నీతి చంద్ర(ఊపిరితిత్తుల వ్యాధుల ప్రొఫెసర్) – నెల్లూరు
54. డాక్టర్ కె.కృష్ణ కిషోర్(ఈఎన్‌టీ ప్రొఫెసర్) – తూర్పుగోదావరి
55. లక్ష్మి(స్టాఫ్ నర్స్) – విజయవాడ
56. కె.జోతిర్మయి(స్టాఫ్ నర్స్) – అననంతపురం
57. తురబిల్లి తేజస్వి(స్టాఫ్ నర్స్) – విశాఖపట్నం
58. ఎం.యోబు(మేల్ నర్స్) – వైఎస్సార్ జిల్లా
59. ఆర్తి హోమ్స్ – వైఎస్సార్ జిల్లా
చదవండి: రాష్ట్రంలో శిశు మరణాల రేటు ఎంత?
క్విక్ రివ్యూ :
ఏమిటి : వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్ సాఫల్య పురస్కారాల ప్రదానం
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఏ–కన్వెన్షన్ సెంటర్, విజయవాడ, కృష్ణా జిల్లా
ఎందుకు : వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన, ప్రజలకు విశిష్ట సేవలు అందించిన వారిని–సంస్థలను గుర్తించి ప్రోత్సహించడం లక్ష్యంగా...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్