Skip to main content

దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డీ దిలీప్‌ కుమార్‌ కన్నుమూత

విలక్షణ నటనతో భారతీయ సినీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బాలీవుడ్‌ నట దిగ్గజం దిలీప్‌ కుమార్‌ (98) తుది శ్వాస విడిచారు.

Current Affairs

ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో వృద్ధాప్య సమస్యలతో చికిత్స పొందుతూ జూలై 7న కన్నుమూశారు. 1922 డిసెంబర్‌ 11న నేటి పాకిస్తాన్‌లో ఉన్న పెషావర్‌లో యూసుఫ్‌ ఖాన్‌గా దిలీప్‌కుమార్‌ జన్మించారు. తర్వాత కాలంలో వారి కుటుంబం బొంబాయి (ముంబై)కి తరలివచ్చింది. 1944లో వచ్చిన ‘జ్వార్‌ భాటా’తో ఆయన సినీరంగ ప్రవేశం జరిగింది. 1988లో వచ్చిన ‘ఖిలా’ఆయన చివరి సినిమా.

పాత్రోచిత సహజ నటనకు, తనకే ప్రత్యేకమైన డైలాగ్‌ డిక్షన్‌ తోడై సినీ రంగంలో కొన్ని దశాబ్దాల పాటు దిలిప్‌ కుమార్‌... స్టార్‌గా వెలుగొందారు. మొఘల్‌ ఇ ఆజమ్, దేవదాస్‌ వంటి క్లాసిక్‌ సినిమాలతో ‘ట్రాజెడీ కింగ్‌’గా, అత్యంత సహజంగా పాత్రలో ఒదిగిపోయే నట కౌశలంతో ‘మెథడ్‌ యాక్టర్‌’గా ఖ్యాతిగాంచారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే దిలిప్‌ భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్, పద్మ విభూషణ్, దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాలను అందుకున్నారు. పాకిస్తాన్‌ ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషాన్‌ ఏ ఇంతియాజ్‌’ను బహూకరించింది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : బాలీవుడ్‌ నట దిగ్గజం, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డీ కన్నుమూత
ఎప్పుడు : జూలై 7
ఎవరు : దిలీప్‌ కుమార్‌ (98)
ఎక్కడ : హిందూజా ఆసుపత్రి, ముంబై
ఎందుకు : వృద్ధాప్య సమస్యలతో...
Published date : 17 Jul 2021 11:33AM

Photo Stories