2022 Nobel Prize: నోబెల్ బహుమతుల ప్రదానం
అవార్డు గ్రహీతలు..
☛ స్వీడన్ శాస్త్రవేత్తకు వైద్యశాస్త్రంలో 'నోబెల్': వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసిన స్వీడన్ కు చెందిన శాస్త్రవేత్త స్వాంటె పాబో(67)ను నోబెల్ పురస్కారం వరించింది. మానవ పరిణామ క్రమంపై ఆయన చేసిన ఆవిష్కరణలకు ఈ అవార్డును అందిస్తున్నట్లు నోబెల్ అవార్డు ప్యానెల్ కరోలినా మెడికల్ ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది.
☛ భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి: భౌతిక శాస్త్రంలో విశేష కృషి చేసిన అలెన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాసర్, ఆంటోన్ జైలింగర్ లకు ఈ ఏడాది ఫిజిక్స్‌లో నోబెల్ లభించింది. ఫోటాన్లపై ప్రయోగాలు, బెల్ సిద్ధాంతంలో చిక్కుముడులు, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్‌లో వీరి పరిశోధనలకు గానూ రాయల్ స్వీడిష్ అకాడమీ వీరిని గ్రహీతలుగా ఎంపిక చేసింది.
Ukraine war: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో భారీ ప్రాణనష్టం
☛ రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి: రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించింది. క్లిక్ కెమిస్ట్రీతోపాటు బయోఆర్థోగోనల్ కెమిస్ట్రీలను అభివృద్ధి చేసినందుకు గానూ శాస్త్రవేత్తలు కరోలిన్ ఆర్ బెర్టోజీ, మార్టెన్ మెల్డల్, కే బ్యారీ షార్ప్‌లెస్‌లను ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది.
☛ సాహిత్య రంగం: ఫ్రెంచ్ రచయిత అనీ అర్నాక్స్‌కు సాహిత్యంలో నోబెల్ వరించింది. జెండర్, లాంగ్వేజ్,క్లాస్‌కు సంబంధించిన అంశాల్లో ఉన్న విభేదాలపై చాలా స్పష్టమైన రీతిలో ఎర్నాక్స్ అనేక రచనల్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు గానూ నోబెల్‌బహుమతి వరించింది.
☛ ఆర్థికశాస్త్రం: ఆర్థిక వ్యవస్థలో బ్యాంకుల పాత్రను వివరించడంలో చేసిన కృషికి గాను ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ పురస్కారం లభించింది. అమెరికాకు చెందిన బెన్ బెర్నాంకే, డగ్లస్ డైమండ్ , ఫిలిప్ డైబ్‌విగ్‌లకు అక్టోబర్ 10వ తేదీన (సోమవారం) నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై ఈ ముగ్గురి పరిశోధనలకుగాను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ అవార్డును ప్రకటించింది.
☛ నోబెల్ శాంతి బహుమతి: బెలారస్ ఉద్యమకారుడు అలెస్ బియాల్‌యాస్కీతోపాటు రష్యా, ఉక్రెయిన్ సంస్థలకు సంయుక్తంగా అత్యున్నత గౌరవం. మానవ హక్కుల పరిరక్షణ కోసం కొనసాగుతున్న ఉద్యమాలకు నోబెల్ కమిటీ అత్యున్నత గౌరవాన్ని కల్పించింది. బెలారస్ మానవ హక్కుల ఉద్యమకారుడు అలెస్ బియాల్‌యాస్కీ(60), రష్యా మానవ హక్కుల సంస్థ ‘మెమోరియల్’, ఉక్రెయిన్ సంస్థ ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’కు సంయుక్తంగా 2022 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతిని అక్టోబర్ 7న ప్రకటించింది.