Phd Admissions: పీహెచ్‌డీలో ప్రవేశాలకు ఇంటర్వ్యూ తేదీలు ఖరారు
కేయూ క్యాంపస్: కేయూలో ఆర్ట్స్, సైన్స్, సోషల్ సైన్స్, కామర్స్ ఫార్మసీ విద్యా విభాగాల్లో పీహెచ్‌డీలో ప్రవేశాలకు ఇంటర్వూల తేదీలను వర్సిటీ అధికారులు ఖరారు చేశారు. గత నెల మూడోవారంలో నిర్వహించాల్సిన ఇంటర్వూలు వర్షాల కారణంగా వాయిదా వేశారు. ఇటీవల అన్ని విభాగాల డీన్‌లతో వీసీ రమేశ్, రిజిస్ట్రార్ టి.శ్రీనివాస్‌రావు సమావేశమై తేదీలను ఖరారు చేశారు. సోషల్ సైన్స్‌స్‌లోని వివిధ విభాగాల్లో ప్రవేశాలకు ఈనెల 17 నుంచి 20 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
కామర్స్‌అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగంలో ఈనెల 17, 18 తేదీల్లో, సైన్స్ విబాగాల్లో పీహెచ్‌డీలో ప్రవేశాలకు ఈనెల 21 నుంచి 26 వరకు, ఆర్ట్స్ తెలుగు విభాగంలో ఈనెల 22, 23 తేదీల్లో, ఇంగ్లిష్ విబాగంలో 25, 26 తేదీల్లో ఇంటర్వూలు నిర్వహించనున్నారు. విద్యా విభాగంలో భాగంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు ఈనెల 24న, ఫార్మసీ విభాగంలో 27, 28 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈమేరకు ఆయా డీన్‌లు బన్న అయిలయ్య, టి.మనోహర్, పి.మల్లారెడ్డి, పి.అమరవేణి, వై.నర్సింహారెడ్డి, ఎన్.రాంనాథ్‌కిషన్‌లు తమ విభాగాల్లో ప్రవేశాలకు సంబంధిత అభ్యర్థులకు ఇంటర్వ్యూల కాల్ లెటర్లు పంపిస్తున్నారు.
అభ్యర్థులకు వాట్సాప్ ద్వారా ఇంటర్వ్యూల తేదీలను సమాచారం అందించనున్నట్లు సమాచారం. మెరిట్‌కమ్ రిజర్వేషన్ పద్ధతిలో నిబంధనల ప్రకారమే పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించాలని వీసీ ఇదివరకే తాటికొండ రమేశ్ డీన్‌లను ఆదేశించారు. నోటిఫికేషన్ సందర్భంగా ఎన్ని సీట్లు వెకెన్సీలుగా విభాగాల వారీగా చూపారో.. ఆయా సీట్లలోనే భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు తమ రీసెర్చ్ ప్రపోజల్స్‌తో పాటు హాజరు కావాల్సి ఉంటుంది.
Tags
- Education News
- Latest News in Telugu
- admissions
- PhD admissions
- Admissions News
- trending admissions
- Latest admissions
- Telugu News
- Today News
- news today
- news telugu
- news app
- Breaking news
- telugu breaking news
- news bulletin
- news daily
- news for today
- Telangana News
- andhra pradesh news
- Google News
- Mahabubabad District News