Best teacher award: ఒంగోలులో ఉత్తమ ఉపాధ్యాయుడు ఈయనే..
ఒంగోలు టౌన్: ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ డి.వెంకటేశ్వరరెడ్డి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఈనెల 5వ తేదీ విశాఖపట్నంలో ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. వెంకటేశ్వరరెడ్డి 14 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయ స్థాయిలో ఉత్తమ సేవలందిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ఆయన రాసిన 30కి పైగా వ్యాసాలను ప్రచురితమయ్యాయి. యూజీసీ సహకారంతో ఒక మేజర్ రీసెర్చ్ ప్రాజెక్టును పూర్తి చేశారు. ప్రభుత్వం ప్రచురించిన డిగ్రీ, పీజీ టెక్ట్స్ పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ఒంగోలులో ఏడు జాతీయ సెమినార్లను నిర్వహించారు. ఆరు గ్రంథాలను రచించారు. వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయి అకడమిక్ సంస్థల్లో సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై న వెంకటేశ్వరరెడ్డిని ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ యం.అంజిరెడ్డి, రిజిస్ట్రార్ బి.హరిబాబు, అధ్యాపకులు రాజమోహన్, సోమ శేఖర్, గంగాధర్, జ్ఞానేశ్వరరెడ్డి, నిర్మలా మణి, పద్మజ, భారతి, శివాజి, ఐ.దేవి వరప్రసాద్ తదితరులు అభినందించారు.