Oakridge 12th Class Graduation Day: పట్టాలు అందుకున్న హిమాంశు, సహచర విద్యార్థులు!
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి మనుమడు, మంత్రి కెటిఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు గచ్చిబౌలీలోని వోక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి తన 12వ క్లాస్ ను పూర్తి చేసి గ్రాడ్యేయేషన్ పట్టాను అందుకున్నారు. ఈ సందర్భంగా తాను చదువుతున్న స్కూల్ లో ‘12 క్లాస్ గ్రాడ్యుయేషన్ డే’వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి హిమాన్షు తాతగారు నాయనమ్మలైన సీఎం కేసీఆర్ శోభమ్మ దంపతులు, తల్లిదండ్రులు కేటిఆర్ శైలిమ లు, చెల్లెలు అలేఖ్య తదితర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
also read: Quiz of The Day (April 18, 2023): ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా స్పీకర్?
గ్యాడ్యుయేషన్ డే’ సందర్భంగా 12వ తరగతిని విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు ఓక్రిడ్జ్ స్కూలు వారు గ్రాడ్యుయేషన్ పట్టాలను అందజేశారు.
అదే సందర్భంలో...విద్యనభ్యసిస్తూనే క్రీడలు, సాంస్కృతిక రంగం, సామాజిక సేవ తదితర రంగాల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థినీ విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం ప్రతిభా పురస్కారాలను అందజేసింది.
ఇందులో భాగంగా, సీఎం కేసీఆర్ మనుమడు కల్వకుంట్ల హిమాంశు రావు ‘కమ్యూనిటి యాక్టివిటీ సర్వీసెస్’ (సి ఎ ఎస్) విభాగంలో గొప్ప ప్రతిభను ప్రదర్శించినందుకు గాను వారి ప్రతిభను గుర్తించి, హిమాన్షు ను సి ఎ ఎస్ విభాగంలో ఎక్స్ లెన్స్ అవార్డును అందజేశారు.
Also read: March 2023 Top 30 Current Affairs Bits in Telugu | APPSC | TSPSC | Police | UPSC #sakshieducation
గ్యాడ్యుయేషన్ పట్టాను అందుకున్న హిమాన్షు వెంటనే స్టేజీ దిగివచ్చి తమ తాత గారైన సీఎం కేసీఆర్ చేతుల్లో గ్రాడ్యుయేషన్ పట్టాను పెట్టి పాదాలకు నమస్కరించారు. తాతగారి దీవెనలను తీసుకున్నారు. చిన్నతనం నుంచీ తనచేతుల్లో పెరిగి నేడు పట్టబధ్రుడుగా ఎదిగిన మనుమన్ని హృదయపూర్వకంగా అభినందించారు సిఎం కేసీఆర్ గారు.
తాను చదువుకున్న పాఠశాల వారు శిక్షణలో భాగంగా అప్పగించిన సామాజిక సేవ అంశాన్ని సవాలు గా తీసుకుని, ఆ విభాగానికి అధ్యక్షత వహిస్తూ సామాజిక సేవలో గొప్పగా ప్రతిభ కనబరిచి అందులో ఎక్స్ లెన్సీ అవార్డును పొందింనందుకు సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా తన మనుమడు హిమాంశును అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనుమడిని సిఎం ఆశీర్వదించారు.
గ్రాడ్యుయేషన్ పట్టాలనందుకుంటున్న సహచర విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన హిమాంశు తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు తమ కుమారుడు పెరిగి పెద్దవాడై సాధించిన ప్రతిభానైపుణ్యాల చూసి పుత్రోత్సాహంతో ఆనందం వ్యక్తం చేశారు.
Also read: All about the tallest statue of Ambedkar in the country!
ఈ కార్యక్రమంలో హిమాన్షు అమ్మమ్మ, మేనమామలు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. హిమాన్షు రావు తో పాటు గ్రాడ్యుయేషన్ పట్టాను పొందిన క్లాస్ మేట్ ఆద్విత్ బిగాల తండ్రి, బిఆర్ఎస్ ఎన్నారై సెల్ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల, వారి పెదనాన్న ఎమ్మెల్యే గణేష్ బిగాల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గ్రాడ్యుయేషన్ డే సంద్భంగా పట్టాలు అందుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో సమావేశ మందిరం కిక్కిరిసింది. విద్యార్థుల హర్షధ్వానాలతో ప్రాంగణం మారు మోగింది.
Also read: Unique Features of the tallest Ambedkar statue