వైద్య విద్య కోర్సులు...ఎన్నో అవకాశాలు
Sakshi Education
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సులకు ఎంతో డిమాండ్ ఉంది. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే కాక ఇతర ప్రభుత్వ రంగం సంస్థల్లో కూడా ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. కోర్సులు-కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం మీ కోసం..
ఎంబీబీఎస్‌తో అపార అవకాశాలు...
ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఎండీ, ఎంఎస్ స్థాయిలో పదుల సంఖ్యలో స్పెషలైజేషన్లతో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం జనరల్ ఫిజిషియన్, పిడియాట్రిక్స్, గైనకాలజీ స్పెషలైజేషన్లకు మరింత ఆదరణ నెలకొంది. ఆ తర్వాత డీఎన్‌బీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. ఎంబీబీఎస్ విద్యార్థులు కేవలం ఈ కోర్సుతోనే సరిపెట్టుకోకుండా... పీజీ, సూపర్ స్పెషాలిటీ, డీఎన్‌బీ కోర్సుల వరకు చదవాల్సిన అవసరం కనిపిస్తోంది. అప్పుడే ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల పరంగా ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో వైద్యులుగా కొలువు సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా రాష్ట్రాల స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షల్లో విజేతలుగా నిలిచి అసిస్టెంట్ సివిల్ సర్జన్ హోదాతో కెరీర్ ప్రారంభించే అవకాశం ఉంది. ప్రైవేట్ రంగంలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో అవకాశాలతోపాటు సొంతంగా ప్రాక్టీస్ కూడా ప్రారంభించొచ్చు.
బీడీఎస్:
బీడీఎస్ విద్యార్థులు కూడా భవిష్యత్తు కోణంలో ఉన్నత విద్య కోర్సుల్లో చేరే వీలుంది. వీరికి బీడీఎస్ ఉత్తీర్ణతతో ఎండీఎస్, పీజీ డిప్లొమా స్థాయిలో స్పెషలైజేషన్లు పూర్తి చేస్తే మరిన్ని అవకాశాలు లభిస్తాయి. అదే విధంగా కొలువుల పరంగా త్రివిధ దళాల్లో, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో.. రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలోని డెంటల్ హాస్పిటల్స్‌లో అసిస్టెంట్ సివిల్ సర్జన్ స్థాయికి సరితూగే కొలువులు సొంతం చేసుకోవచ్చు. ప్రైవేట్ రంగంలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో అవకాశాలతోపాటు సొంతంగా ప్రాక్టీస్ కూడా ప్రారంభించొచ్చు.
బీహెచ్‌ఎంఎస్:
గత కొన్నేళ్లుగా కార్పొరేట్ రూపు సంతరించుకుంటున్న కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీహెచ్‌ఎంస్). ఈ కోర్సులోనూ ఎంబీబీఎస్ కరిక్యులంలో ఉండే విభాగాలు (ఉదాహరణకు.. అనాటమీ, ఫిజియాలజీ తదితర) ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి కెరీర్ పరంగా అవకాశాలు అనేకం. ఇటీవల కాలంలో హోమియో వెద్య విధానంపై ఆసక్తి పెరుగుతోంది. దీంతో బీహెచ్‌ఎంఎస్ పూర్తి చేస్తే ఆయా సంస్థల్లో నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేతనంతో కొలువు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఉన్నత విద్య పరంగా మెటీరియా మెడికా, హోమియోపతిక్ ఫిలాసఫీ వంటి స్పెషలైజేషన్లకు డిమాండ్ నెలకొంది. వీటిని కూడా పూర్తి చేస్తే భవిష్యత్తులో కెరీర్ పరంగా ఎలాంటి ఢోకా ఉండదనే చెప్పొచ్చు.
బీఏఎంఎస్ :
వైద్య రంగంలో స్థిరపడాలనుకుంటున్న విద్యార్థులకు మరో ప్రధానమైన ప్రత్యామ్నాయం.. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీఏఎంఎస్). అయిదున్నరేళ్ల వ్యవధిలోని ఈ కోర్సులోనూ ఎంబీబీఎస్‌లో మాదిరిగానే అనాటమీ, ఫిజియూలజీ, పిడియూట్రిక్స్, జనరల్ మెడిసిన్ తదితర సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. వీటిలో నైపుణ్యం ద్వారా సహజ సిద్ధ ప్రక్రియలతో రోగులకు వైద్యం చేయగలిగే నైపుణ్యం లభిస్తుంది. ఈ విభాగంలో ఉన్నత విద్యావకాశాలు కూడా ఉన్నాయి. ఎండీ స్థాయిలో ఆయుర్వేద, ఎంఎస్-ఆయుర్వేద కోర్సులు చదవొచ్చు. ఎంబీబీఎస్‌లోని జనరల్ మెడిసిన్‌కు సరితూగే విధంగా ఉండే కాయ చికిత్స, జనరల్ సర్జరీకి సరితూగే శల్యతంత్ర.. ఇలా అలోపతిలోని స్పెషలైజేషన్లకు సరితూగే స్పెషలైజేషన్లు పీజీ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి.
యునానీ(బీయూఎంఎస్) :
ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతున్న మరో వైద్య కోర్సు.. బీయూఎంఎస్ (బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడికల్ సైన్స్). పూర్తిగా ప్రకృతి వైద్యంగా దీన్ని పేర్కొనొచ్చు. బీయూఎంఎస్ పూర్తి చేసిన విద్యార్థులకు పీజీ స్థాయిలో గైనకాలజీ, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, ఫార్మకాలజీలకు సరితూగే విధంగా ఎండీ, ఎంఎస్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
బీఎన్‌వైఎస్ :
ఇటీవల కాలంలో ప్రజల్లో ప్రకృతి వైద్యం పట్ల ఆసక్తి, ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో.. వైద్య విద్య ఔత్సాహికులకు మరో ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతిక్ మెడికల్ సెన్సైస్ (బీఎన్‌వైఎస్). ఈ కోర్సును పూర్తి చేసిన వారికి యోగా, సిద్ధ యోగా వంటి విధానాల ద్వారా రోగులకు చికిత్స చేయగలిగే నైపుణ్యాలు లభిస్తాయి. ఉన్నత విద్య కోణంలో ఎండీ క్లినికల్ నేచురోపతి, ఎండీ యోగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

Published date : 27 Oct 2020 01:57PM