ఉపాధ్యాయులు కావాలకునే వారికోసం ఎడ్‌సెట్
Sakshi Education
ఎంతో మందికి ఆదర్శంగా ఉంటూ.. ఎంతో మందికి దారి చూపేవారు గురువు. అలాంటి గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు.
అంటే..విద్యార్థులకు దారిచూపే వృత్తి.. టీచర్! పాఠశాల విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే అధ్యాపక వృత్తిలో చేరేందుకు మార్గం.. బీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సు. తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష.. టీఎస్ ఎడ్‌సెట్ (తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్). 2020 విద్యా సంవత్సరానికి తెలంగాణలోని బీఎడ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉస్మానియా యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. టీఎస్ ఎడ్‌సెట్‌కు అర్హతలు, దరఖాస్తు, పరీక్ష విధానం, సిలబస్‌పై ప్రత్యేక సమాచారం..
ఎడ్‌సెట్
ఎడ్‌సెట్‌లో ర్యాంకు ద్వారా రెండేళ్ల కాలవ్యవధి కలిగిన బీఈడీ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. బీఈడీ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో టీచర్ పోస్టుల్లో చేరేందుకు అర్హత లభిస్తుంది.
అర్హతలు ఇవీ..
ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనాడిగ్రీ(బీఏ/బీఎస్సీ/(హోంసైన్స్) /బీకాం/బీసీఏ/బీబీఎం/బీబీఏ లేదా మాస్టర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
పరీక్ష విధానం
ఎడ్‌సెట్ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో మూడు భాగాలుగా (పార్ట్-ఏ, పార్ట్-బీ, పార్ట్-సీ) మొత్తం 150 మార్కులకు ఉంటుంది. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటలు.
l పార్ట్- ఏ
ఈ విభాగం నుంచి జనరల్ ఇంగ్లీష్‌పై ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 25 ప్రశ్నలకు గాను 25 మార్కులు ఉంటాయి.
పార్ట్ -బి
ఈ విభాగంలో రెండు ఉప విభాగాలు ఉంటాయి.
జనరల్ నాలెడ్జ్: ఈ విభాగం నుంచి 15 ప్రశ్నలు-15 మార్కులకు అడుగుతారు.
టీచింగ్ ఆప్టిట్యూడ్: ఈ విభాగం నుంచి 10 ప్రశ్నలు- 10 మార్కులకు ఉంటాయి.
పార్ట్-సీ
ఈ విభాగంలో 100 ప్రశ్నలకు 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఇందులో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టుల నుంచి ప్రశ్నలను అడుగుతారు.
మ్యాథమెటిక్స్
ఈ సబ్జెక్టును ఎంపిక చేసుకునే అభ్యర్థులు బీఏ లేదా బీఎస్సీలో మ్యాథ్స్ సబ్జెక్టును కలిగి ఉండాలి. బీఈ/బీటెక్ అర్హత కలిగిన వారు ఆ స్థాయిలో మ్యాథ్స్ సబ్జెక్టుగా అలాగే బీసీఏ వారు ఇంటర్మీడియట్ స్థాయిలో మ్యాథ్స్ సబ్జెక్టు చదివిన వారై ఉండాలి. దీంట్లో నుంచి 100 ప్రశ్నలకు 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
ఫిజికల్ సెన్సైస్
సబ్జెక్టును ఎంపిక చేసుకునే వారు బీఎస్సీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిగి ఉండాలి. బీఈ/బీటెక్ వారు ఆయా డిగ్రీ స్థాయిలో, బీసీఏ అభ్యర్థులు ఇంటర్మీడియట్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదివి ఉండాలి. ఈ సబ్జెక్టు నుంచి 100 మార్కులకు ఫిజిక్స్ నుంచి 50 ప్రశ్నలు-50మార్కులు; కెమిస్ట్రీ నుంచి 50 ప్రశ్నలు-50 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
బయలాజికల్ సైన్స్
ఈ సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకునే బీఎస్సీ లేదా బీఎస్సీ (హోంసైన్స్) అభ్యర్థులు బోటనీ, జూవాలజీ కలిగి ఉండాలి. బీసీఏ అభ్యర్థులు ఇంటర్మీడియెట్ స్థాయిలో బయలాజికల్ సైన్స్‌ను ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ఈ సబ్జెక్టు సంబంధించి బోటనీ నుంచి 50 ప్రశ్నలు- 50 మార్కులకు, జువాలజీ నుంచి 50 ప్రశ్నలు- 50 మార్కులకు మొత్తం 100 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
సోషల్ స్టడీస్
ఈ సబ్జెక్టును ఎంపిక చేసుకునే బీఏ/బీకాం/బీబీఎం/బీబీఏ అభ్యర్థులు ఇంటర్మీడియెట్ లెవల్‌లో సోషల్ సైన్స్ సబ్జెక్టు చదివి ఉండాలి. ఈ సబ్జెక్టు సంబంధించి జాగ్రఫీ-35 ప్రశ్నలు-35 మార్కులు; హిస్టరీ-30 ప్రశ్నలు-30 మార్కులు; సివిక్స్-15 ప్రశ్నలు-15 మార్కులు; ఎకనామిక్స్-20 ప్రశ్నలు-20 మార్కులకు చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
ఇంగ్లీష్
ఈ సబ్జెక్టును ఎంపిక చేసుకునే అభ్యర్థులు బీఏలో స్పెషల్ ఇంగ్లీష్ / ఆప్షనల్ ఇంగ్లీష్ / ఇంగ్లీష్ లిటరేచర్ లేదా ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసి ఉండాలి. ఇందులో 100 ప్రశ్నలకు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
కటాఫ్ మార్కులు
ఎడ్‌సెట్‌లో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 38 మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు లేవు.
దరఖాస్తు ఫీజు
జనరల్ అభ్యర్థులకు రూ.650, ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు రూ.450ను పరీక్ష ఫీజుగా చెల్లించాలి. ఆలస్య రుసుము లేకుండా 20.04.2020 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. రూ.500 ఆలస్య రుసుముతో 25.04.2020 వరకు; రూ.1000 ఆలస్య రుసుముతో 30.04.2020 వరకు; రూ.2000తో 04.05.2020 దాకా ఫీజు చెల్లించే అవకాశం ఉంది.
ముఖ్యమైన సమాచారం
ప్రిపరేషన్ ఇలా..
జనరల్ ఇంగీ్లష్‌కు సంబంధించి రీడింగ్ కాంప్రహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్, ఆర్టికల్స్, ప్రిపొజిషన్, టెన్సెస్, స్పెల్లింగ్, వొకాబ్యులరీ, సినానిమ్స్, ఆంటోనిమ్స్, ట్రాన్సఫర్‌మెషన్ ఆఫ్ సెంటెన్స్, సింపుల్ కాంపౌండ్స్ అండ్ కాంప్లెక్స్, డెరైక్ట్, ఇన్ డెరైక్ట్ స్పీచ్ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. ఇందులో ఎక్కువగా పదోతరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి పదో త రగతి ఇంగ్లీష్‌పై ఎక్కువగా దృష్టి సారించడం మేలు.
జనరల్‌నాలెడ్జ్‌కు సంబంధించి అభ్యర్థుల పరిశీలనాత్మక గుణం తెలుసుకునే విధంగా ప్రస్తుత రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, వివిధ దేశాల కరెన్సీలు, రాజధానులు, భౌగోళిక, సంస్కృతి తదితర అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వీటితో పాటు ప్రపంచ ప్రముఖ కట్టడాలు, ప్రతిష్టాత్మక అవార్డులు.. అవి పొందిన వ్యక్తుల పేర్లు.. ఇలా వివిధ అంశాలను కూడా అడిగే వీలుంది. కాబట్టి అభ్యర్థులు ఎప్పటికప్పుడు తన చుట్టూ ప్రపంచంలో సంభవిస్తున్న పరిణామాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అవగాహన పెంచుకోవాలి. టీచింగ్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్ సామర్థ్యం, ఉపాధ్యాయుడికి ఉండాల్సిన లక్షణాలు, పాటించాల్సిన పద్ధతులు, పిల్లలతో ఏవిధంగా ఉండాలి అనే అంశాలపైన ప్రశ్నలను అడిగే అవకాశం ఉంటుంది.
ఎంపిక చేసుకున్న సబ్జెక్టులను అనుసరించి 8వ తరగతి నుంచి డిగ్రీ స్థాయి సిలబస్ వరకు ప్రిపేర్ కావాలి. ప్రిపరేషన్‌కు ముందు గత పరీక్షల్లో ప్రశ్నలు అడిగిన విధానంపై అభ్యర్థులు దృష్టి పెట్టాలి. వీలైనన్నీ ఎక్కువగా పాత ప్రశ్న పత్రాలు సాధన చేయడం.. పటిష్ట ప్రణాళిక రూపొందించుకొని ప్రిపరేషన్ సాగించడం మంచి ర్యాంకు సాధనకు దోహదం చేస్తుంది.

- బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ (మ్యాథ్స్, సైన్స్ స్పెషలైజేషన్) 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులే. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 40 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎంబీబీఎస్/బీఎస్సీఅగ్రికల్చర్/బీవీఎస్సీ/బీహెచ్‌ఎంటీ/బీఫార్మసీ/ఎల్‌ఎల్‌బీ వంటి కోర్సుల విద్యార్థులు ఎడ్‌సెట్‌కు అనర్హులు. అలాగే డిగ్రీ లేకుండా పీజీ చదివిన విద్యార్థులు కూడా దరఖాస్తుకు అనర్హులే.
- వయసు: జులై 1 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి.
పరీక్ష విధానం
ఎడ్‌సెట్ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో మూడు భాగాలుగా (పార్ట్-ఏ, పార్ట్-బీ, పార్ట్-సీ) మొత్తం 150 మార్కులకు ఉంటుంది. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటలు.
l పార్ట్- ఏ
ఈ విభాగం నుంచి జనరల్ ఇంగ్లీష్‌పై ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 25 ప్రశ్నలకు గాను 25 మార్కులు ఉంటాయి.
పార్ట్ -బి
ఈ విభాగంలో రెండు ఉప విభాగాలు ఉంటాయి.
జనరల్ నాలెడ్జ్: ఈ విభాగం నుంచి 15 ప్రశ్నలు-15 మార్కులకు అడుగుతారు.
టీచింగ్ ఆప్టిట్యూడ్: ఈ విభాగం నుంచి 10 ప్రశ్నలు- 10 మార్కులకు ఉంటాయి.
పార్ట్-సీ
ఈ విభాగంలో 100 ప్రశ్నలకు 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఇందులో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టుల నుంచి ప్రశ్నలను అడుగుతారు.
మ్యాథమెటిక్స్
ఈ సబ్జెక్టును ఎంపిక చేసుకునే అభ్యర్థులు బీఏ లేదా బీఎస్సీలో మ్యాథ్స్ సబ్జెక్టును కలిగి ఉండాలి. బీఈ/బీటెక్ అర్హత కలిగిన వారు ఆ స్థాయిలో మ్యాథ్స్ సబ్జెక్టుగా అలాగే బీసీఏ వారు ఇంటర్మీడియట్ స్థాయిలో మ్యాథ్స్ సబ్జెక్టు చదివిన వారై ఉండాలి. దీంట్లో నుంచి 100 ప్రశ్నలకు 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
ఫిజికల్ సెన్సైస్
సబ్జెక్టును ఎంపిక చేసుకునే వారు బీఎస్సీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిగి ఉండాలి. బీఈ/బీటెక్ వారు ఆయా డిగ్రీ స్థాయిలో, బీసీఏ అభ్యర్థులు ఇంటర్మీడియట్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదివి ఉండాలి. ఈ సబ్జెక్టు నుంచి 100 మార్కులకు ఫిజిక్స్ నుంచి 50 ప్రశ్నలు-50మార్కులు; కెమిస్ట్రీ నుంచి 50 ప్రశ్నలు-50 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
బయలాజికల్ సైన్స్
ఈ సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకునే బీఎస్సీ లేదా బీఎస్సీ (హోంసైన్స్) అభ్యర్థులు బోటనీ, జూవాలజీ కలిగి ఉండాలి. బీసీఏ అభ్యర్థులు ఇంటర్మీడియెట్ స్థాయిలో బయలాజికల్ సైన్స్‌ను ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ఈ సబ్జెక్టు సంబంధించి బోటనీ నుంచి 50 ప్రశ్నలు- 50 మార్కులకు, జువాలజీ నుంచి 50 ప్రశ్నలు- 50 మార్కులకు మొత్తం 100 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
సోషల్ స్టడీస్
ఈ సబ్జెక్టును ఎంపిక చేసుకునే బీఏ/బీకాం/బీబీఎం/బీబీఏ అభ్యర్థులు ఇంటర్మీడియెట్ లెవల్‌లో సోషల్ సైన్స్ సబ్జెక్టు చదివి ఉండాలి. ఈ సబ్జెక్టు సంబంధించి జాగ్రఫీ-35 ప్రశ్నలు-35 మార్కులు; హిస్టరీ-30 ప్రశ్నలు-30 మార్కులు; సివిక్స్-15 ప్రశ్నలు-15 మార్కులు; ఎకనామిక్స్-20 ప్రశ్నలు-20 మార్కులకు చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
ఇంగ్లీష్
ఈ సబ్జెక్టును ఎంపిక చేసుకునే అభ్యర్థులు బీఏలో స్పెషల్ ఇంగ్లీష్ / ఆప్షనల్ ఇంగ్లీష్ / ఇంగ్లీష్ లిటరేచర్ లేదా ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసి ఉండాలి. ఇందులో 100 ప్రశ్నలకు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
కటాఫ్ మార్కులు
ఎడ్‌సెట్‌లో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 38 మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు లేవు.
దరఖాస్తు ఫీజు
జనరల్ అభ్యర్థులకు రూ.650, ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు రూ.450ను పరీక్ష ఫీజుగా చెల్లించాలి. ఆలస్య రుసుము లేకుండా 20.04.2020 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. రూ.500 ఆలస్య రుసుముతో 25.04.2020 వరకు; రూ.1000 ఆలస్య రుసుముతో 30.04.2020 వరకు; రూ.2000తో 04.05.2020 దాకా ఫీజు చెల్లించే అవకాశం ఉంది.
ముఖ్యమైన సమాచారం
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరి తేదీ: 20.04.2020
- హాల్ టికెట్: 15.05.2020
- పరీక్ష తేదీ: 23.05.2020
- ఫలితాలు: 11.06. 2020
- పూర్తి సమాచారం కోసం వెబ్‌సైట్: https://edcet.tsche.ac.in
ప్రిపరేషన్ ఇలా..
జనరల్ ఇంగీ్లష్‌కు సంబంధించి రీడింగ్ కాంప్రహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్, ఆర్టికల్స్, ప్రిపొజిషన్, టెన్సెస్, స్పెల్లింగ్, వొకాబ్యులరీ, సినానిమ్స్, ఆంటోనిమ్స్, ట్రాన్సఫర్‌మెషన్ ఆఫ్ సెంటెన్స్, సింపుల్ కాంపౌండ్స్ అండ్ కాంప్లెక్స్, డెరైక్ట్, ఇన్ డెరైక్ట్ స్పీచ్ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. ఇందులో ఎక్కువగా పదోతరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి పదో త రగతి ఇంగ్లీష్‌పై ఎక్కువగా దృష్టి సారించడం మేలు.
జనరల్‌నాలెడ్జ్‌కు సంబంధించి అభ్యర్థుల పరిశీలనాత్మక గుణం తెలుసుకునే విధంగా ప్రస్తుత రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, వివిధ దేశాల కరెన్సీలు, రాజధానులు, భౌగోళిక, సంస్కృతి తదితర అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వీటితో పాటు ప్రపంచ ప్రముఖ కట్టడాలు, ప్రతిష్టాత్మక అవార్డులు.. అవి పొందిన వ్యక్తుల పేర్లు.. ఇలా వివిధ అంశాలను కూడా అడిగే వీలుంది. కాబట్టి అభ్యర్థులు ఎప్పటికప్పుడు తన చుట్టూ ప్రపంచంలో సంభవిస్తున్న పరిణామాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అవగాహన పెంచుకోవాలి. టీచింగ్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్ సామర్థ్యం, ఉపాధ్యాయుడికి ఉండాల్సిన లక్షణాలు, పాటించాల్సిన పద్ధతులు, పిల్లలతో ఏవిధంగా ఉండాలి అనే అంశాలపైన ప్రశ్నలను అడిగే అవకాశం ఉంటుంది.
ఎంపిక చేసుకున్న సబ్జెక్టులను అనుసరించి 8వ తరగతి నుంచి డిగ్రీ స్థాయి సిలబస్ వరకు ప్రిపేర్ కావాలి. ప్రిపరేషన్‌కు ముందు గత పరీక్షల్లో ప్రశ్నలు అడిగిన విధానంపై అభ్యర్థులు దృష్టి పెట్టాలి. వీలైనన్నీ ఎక్కువగా పాత ప్రశ్న పత్రాలు సాధన చేయడం.. పటిష్ట ప్రణాళిక రూపొందించుకొని ప్రిపరేషన్ సాగించడం మంచి ర్యాంకు సాధనకు దోహదం చేస్తుంది.
Published date : 25 Mar 2020 05:41PM