Skip to main content

ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లో...పీజీ, పీహెచ్‌డీకిమార్గాలు..

జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (జెస్ట్)-2021 నోటిఫికేషన్ విడుదలైంది. జెస్ట్‌లో ప్రతిభ చూపితే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు, దేశంలోని 40కుపైగా ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, పరిశోధన అవకాశాన్ని దక్కించుకోవచ్చు.

ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా జెస్ట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్న కోర్సులు, భాగస్వామ్య ఇన్‌స్టిట్యూట్‌లు, ప్రిపరేషన్ గెడైన్స్..

 

జెస్ట్‌లో అర్హత సాధించడం ద్వారా...

 జెస్ట్‌లో అర్హత సాధించడం ద్వారా ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఫిజిక్స్, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్, న్యూరోసైన్స్, కంప్యూటేషనల్ సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్(ఎస్‌ఈఆర్‌బీ).. జెస్ట్‌ను నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌గా గుర్తించింది. 

 

ఇన్‌స్టిట్యూట్స్ వారీగా అర్హతలు..    

 ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు ఎమ్మెస్సీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని సంస్థలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ/పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు బీటెక్/బీఈ/ఎంఈ/ఎంటెక్/నాలుగేళ్ల బీఎస్సీ అర్హతలుగా ఉన్నాయి.

 

పీహెచ్‌డీ ఇన్ ఫిజిక్స్ :

 అన్ని ఇన్‌స్టిట్యూట్‌లు ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ను ప్రాథమిక అర్హతగా పరిగణిస్తున్నాయి. దీంతోపాటు కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు అప్లయిడ్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లో బీఈ/బీటెక్/ఎమ్మెస్సీ/ఎంఈ/ఎంటెక్ హోల్డర్లకు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. 

 ఆ వివరాలు ఇలా..

  1.  ఐఐఏ: ఎమ్మెస్సీ ఇన్ మ్యాథ్స్/అప్లయిడ్ ఫిజిక్స్/అప్లయిడ్ మ్యాథమెటిక్స్/ఆప్టిక్స్ అండ్ ఫోటోనిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రానిక్స్.
  2.  ఐఐఎస్‌సీ, ఐఎంఎసీ, ఐసీటీఎస్-టీఐఎఫ్‌ఆర్, ఐయూసీఏఏ, జేఎన్‌సీఏఎస్‌ఆర్, ఎన్‌సీఆర్‌ఏ-టీఐఎఫ్‌ఆర్, టీఐఎఫ్‌ఆర్-టీసీఐఎస్, ఆర్‌ఆర్‌ఐ, ఐఐఎస్‌ఈఆర్ మొహలీ, ఐఐఎస్‌ఈఆర్ పుణె, ఐఐఎస్‌ఈఆర్ తిరువనంతపురం: బీఈ/బీటెక్ అర్హతగా ఉంది. 
  3.  ఐయూసీఏఏ: ఎమ్మెస్సీ ఇన్ ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/ఆస్ట్రోనమీ/అప్లయిడ్ మ్యాథమెటిక్స్.
  4.  ఐపీఆర్: ఎమ్మెస్సీ ఫిజిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్ లేదా అప్లయిడ్ ఫిజిక్స్.
  5.  ఎస్‌ఎన్‌బీఎన్‌సీబీఎస్: ఎమ్మెస్సీ ఫిజిక్స్/కెమిస్ట్రీ/అప్లయిడ్ మ్యాథమెటిక్స్ /బయోఫిజిక్స్/బయోకెమిస్ట్రీ.
  6.  టీఐఎఫ్‌ఆర్: బీటెక్ ఇంజనీరింగ్ ఫిజిక్స్
  7.  ఎన్‌ఐఎస్‌ఈఆర్: ఎంఈ/ఎంటెక్ ఇన్ అప్లయిడ్ ఫిజిక్స్
  8.  థియరిటికల్ కంప్యూటర్ సైన్స్(ఐఎంఎస్‌సీ): ఎమ్మెస్సీ/ఎంఈ/ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, అనుబంధ విభాగాలు.
  9.  పీహెచ్‌డీ ఇన్ న్యూరోసైన్స్(ఎన్‌బీఆర్‌సీ): ఎమ్మెస్సీ ఫిజిక్స్/మ్యాథమెటిక్స్, బీఈ/బీటెక్/ఎంసీఏ ఇన్ కంప్యూటర్ సైన్స్.
  10.  పీహెచ్‌డీ ఇన్ కంప్యుటేషనల్ బయాలజీ(ఐఎంఎస్‌సీ): ఏదైనా ఇంజనీరింగ్ లేదా సైన్స్ స్పెషలైజేషన్‌తో ఎమ్మెస్సీ/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ. మ్యాథ్స్ స్కిల్స్‌తోపాటు బయలాజికల్ ప్రాబ్లమ్స్‌పై ఆసక్తి ఉండాలి.
  11.   ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ఎంటెక్-పీహెచ్‌డీ ప్రోగ్రామ్(ఫిజిక్స్): 
  12.   ఎస్‌ఎన్‌బీఎన్‌సీబీఎస్: బీఎస్సీ(ఫిజిక్స్/మ్యాథ్స్)
  13.  ఐఎంఎస్‌సీ: బీఎస్సీ(ఫిజిక్స్)
  14.  ఐఐఏ: బీఎస్సీ(ఫిజిక్స్/మ్యాథ్స్)/బీఈ/బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇంజనీరింగ్ ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/ఆప్టిక్స్ అండ్ ఫోటోనిక్స్
  15.  ఎన్‌ఐఎస్‌ఈఆర్: బీఎస్సీ(ఫిజిక్స్)/ఫస్ట్ క్లాస్‌తో బీఈ లేదా బీటెక్ ఇన్ ఇంజనీరింగ్ ఫిజిక్స్; ఐఐఎస్‌ఈఆర్-పుణె, ఐసీటీఎస్-టీఐఎఫ్‌ఆర్,ఎన్‌సీఆర్‌ఏ-టీఐఎఫ్‌ఆర్, టీఐఎఫ్‌ఆర్- టీసీఐఎస్: బీఎస్సీ ఫిజిక్స్ 
  16.  బోస్ ఇన్‌స్టిట్యూట్-ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ-పీహెచ్‌డీ: బీఎస్సీ(ఫిజిక్స్/ మ్యాథ్స్)/బీఈ/బీటెక్.

 ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ఇన్ థియరిటికల్ కంప్యూటర్ సైన్స్(ఐఎంఎస్‌సీ): బీఎస్సీ/బీఈ/బీటెక్/ఎంసీఏ ఇన్ కంప్యూటర్ సైన్స్, అనుబంధ స్పెషలైజేషన్లు. అభ్యర్థికి మ్యాథమెటికల్ యాస్పెక్ట్స్, కంప్యూటర్ సైన్స్ పట్ల ఆసక్తి ఉండాలి.

 ఇంటిగ్రేటెడ్ ఎంటెక్-పీహెచ్‌డీ(ఐఐఏ): ఎమ్మెస్సీ(ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్)/పోస్ట్- బీఎస్సీ(హానర్స్) ఇన్ ఆప్టిక్స్ అండ్ ఆప్టోఎలక్ట్రానిక్స్/రోడియో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్.

 ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, ఐఐఎస్‌ఈఆర్, తిరువనంతపురం: బీఎస్సీ(ఫిజిక్స్) లేదా ఏదైనా స్పెషలైజేషన్‌తో బీఈ/బీటెక్.

 ఎమ్మెస్సీ(హెచ్‌ఆర్‌ఐ): బీఎస్సీ(ఫిజిక్స్) లేదా ఏదైనా స్పెషలైజేషన్‌తో బీఈ/బీటెక్. హెచ్‌ఆర్‌ఐ 2017 నుంచి ఫిజిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ స్థానంలో ఎమ్మెస్సీ(ఫిజిక్స్) ప్రోగ్రామ్‌ను ఆఫర్‌చేస్తోంది.

 

ఎంపిక విధానం :

 ఇన్‌స్టిట్యూట్‌లు అందుబాటులో ఉన్న సీట్లు ఆధారంగా జెస్ట్‌లో ప్రతిభ చూపిన వారికి ప్రవేశాలకు ఆహ్వానిస్తారుు. ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ/పీెహ చ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు పరిశోధనా సంస్థలు సొంత ఎంపిక విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఉదాహరణకు ఇండోర్‌లోని రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీనే తీసుకుంటే.. సదరు సంస్థ ఫిజిక్స్ విభాగానికి సంబంధించి జెస్ట్ స్కోర్ ఆధారంగా జాబితాను రూపొందిస్తుంది. ఆ జాబితాలోని వారికి ఇంటర్వ్యూ నిర్వహించి.. పీహెచ్‌డీలో ప్రవేశాలను ఖరారు చేస్తుంది. మొత్తంగా చూస్తే జెస్ట్, మౌఖిక పరీక్షల్లో ప్రతిభ చూపిన వారికి సంస్థలు ప్రవేశాలు కల్పిస్తున్నారుు.

 

రాత పరీక్ష విధానం :

  1.  అభ్యర్థులు ఫిజిక్స్ లేదా థియరిటికల్ కంప్యూటర్ సైన్‌‌స సబ్జెక్టులకు సంబంధించి జెస్ట్‌కు హాజరవ్వొచ్చు. ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధించి ఉమ్మడి పరీక్ష ఉంటుంది.
  2.  జెస్ట్ ఫిజిక్స్ ప్రశ్నపత్రం 100 మార్కులకు ఉంటుంది. 50 మల్టిపుల్ ఛారుుస్ ప్రశ్నలుంటారుు. పార్ట్-ఎలోని 25 ప్రశ్నల్లో ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు ఉంటారుు. పార్ట్-బిలోని 25 ప్రశ్నల్లో ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
  3.  థియరిటికల్ కంప్యూటర్ సైన్‌‌స ప్రశ్నపత్రంలో స్వల్ప సమాధాన ప్రశ్నలు, కొన్ని ప్రశ్నలకు వివరణాత్మక సమస్య సాధన రాయాల్సి ఉంటుంది.

 

{పిపరేషన్ టిప్స్..:

  1.  ఫిజిక్స్ సిలబస్‌లో.. మ్యాథమెటికల్ మెథడ్స్, క్లాసికల్ మెకానిక్స్, ఎలక్ట్రోమ్యాగ్నటిక్ థియరీ, క్వాంటమ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ ఫిజిక్స్, న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్ తదితర చాప్టర్లు ఉంటాయి.
  2. మ్యాథమెటికల్ మెథడ్స్, క్లాసికల్ మెకానిక్స్, క్వాంటమ్ మెకానిక్స్, ఎలక్ట్రోమ్యాగ్నటిక్ థియరీ చాప్టర్లు కీలకంగా నిలుస్తాయి.
  3. అభ్యర్థులు ప్రాథమిక భావనలపై పట్టుసాధించాలి. అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ సాగించాలి. కొన్ని ప్రశ్నలు అభ్యర్థుల ఊహాశక్తిని పరీక్షించేలా ఉంటాయి. కాబట్టి ప్రిపరేషన్ పరంగా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
  4. థియరిటికల్ కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించి అనలిటికల్ రీజనింగ్ అండ్ డిడక్షన్, డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, గ్రాఫ్ థియరీ, ప్రిన్సిపుల్స్ ఆఫ్ పోగ్రామింగ్ తదితర అంశాలపై దృష్టిపెట్టాలి. 

 

కెరీర్ మార్గాలు..

 {పముఖ సంస్థల్లో పీహెచ్‌డీలో అవకాశం లభిస్తే నెలకు రూ.28వేలు వరకు ఫెలోషిప్‌గా అందుతుంది. పీహెచ్‌డీ పూర్తి చేస్తే కెరీర్ పరంగా వెనక్కి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇస్రో, డీఆర్‌డీవో, బార్క్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగాల్లో శాస్త్రవేత్తలుగా అవకాశాలను అందుకోవచ్చు. పరిశోధనతోపాటు బోధనా రంగంలోనూ అవకాశాలు లభిస్తాయి. టీచింగ్‌పై ఆసక్తి ఉన్న వారు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో అధ్యాపకులుగా కెరీర్‌ను ప్రారంభించొచ్చు.

 

ముఖ్య తేదీలు :

  1.  దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: 11.01.2021
  2.  ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు రుసం చెల్లించేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 14, 2021.
  3.  జెస్ట్ పరీక్ష తేది: ఏప్రిల్ 11, 2021.
  4.  దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.150. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుం లేదు.
  5.  వెబ్‌సైట్: https://www.jest.org.in/joint-entrance-screening-test
Published date : 21 Dec 2020 04:55PM

Photo Stories