నీట్-2019 చదవండిలా..!
Sakshi Education
దేశవ్యాప్తంగా ఉన్న వైద్య, దంత కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించే పరీక్ష.. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్).
ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో, డీమ్డ్ యూనివర్సిటీల్లో మెడిసిన్, సంబంధిత కోర్సుల్లో కన్వీనర్ కోటా, మేనేజ్‌మెంట్ కోటా, ఎన్‌ఆర్‌ఐ కోటాలో సీట్లు పొందేందుకు నీట్ ఉత్తీర్ణత తప్పనిసరి. గతంలోనే షెడ్యూల్ ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. ఆ మేరకు ఇటీవల నీట్ 2019కు నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్షకు ఇంకా సరిగ్గా ఐదు నెలల సమయం అందుబాటులో ఉంది. ఈ సమయాన్ని ప్రణాళికబద్ధంగా సద్వినియోగం చేసుకుంటే కోరుకున్న మెడిసిన్ కోర్సుల్లో చేరవచ్చు. ఇంటర్మీడియెట్ పరీక్షలకు షెడ్యూల్ విడుదలవుతున్న నేపథ్యంలో.. విద్యార్థులు ఒకవైపు అకడమిక్‌గా రాణిస్తూనే నీట్‌కూ ప్రిపరేషన్ సాగించడమెలాగో చూద్దాం...
పరీక్ష స్వరూపం :
నీట్ పరీక్ష పెన్ను-పేపర్ విధానంలో జరుగుతుంది. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ+జువాలజీ) నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్షకు కేటాయించిన సమయం మూడు గంటలు. ఫిజిక్స్ నుంచి 45 ప్రశ్నలు, కెమిస్ట్రీ 45 ప్రశ్నలు, బయాలజీ (బోటనీ+జువాలజీ) 90 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు.
పరీక్ష మాధ్యమం: నీట్‌ను ఇంగ్లిష్‌తోపాటు హిందీ, ఇతర పలు ప్రాంతీయ భాషల్లోనూ రాసే వీలుంది. తెలుగులోనూ నీట్ పరీక్ష రాయొచ్చు.
విద్యార్హత: 10+2/ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ బయోటెక్నాలజీ సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ వర్గాల వర్గాల విద్యార్థులు 40 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. పీడబ్ల్యూడీ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధించాలి.
వయసు : ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టేనాటికి లేదా ప్రవేశాలు జరిగే సంవత్సరం డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్ల వయసు నిండి ఉండాలి. గరిష్టంగా 25 ఏళ్లలోపు ఉండాలి. ఓబీసీ, ఎస్టీ, ఎస్సీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
ముఖ్య సమాచారం
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2018, నవంబర్ 30.
పరీక్ష తేదీ: 2019, మే 5.
ఫలితాల వెల్లడి: 2019, జూన్ 5.
వెబ్‌సైట్: www.nta.ac.in,https://ntaneet.nic.in
ఫిజిక్స్:
పరీక్ష స్వరూపం :
నీట్ పరీక్ష పెన్ను-పేపర్ విధానంలో జరుగుతుంది. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ+జువాలజీ) నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్షకు కేటాయించిన సమయం మూడు గంటలు. ఫిజిక్స్ నుంచి 45 ప్రశ్నలు, కెమిస్ట్రీ 45 ప్రశ్నలు, బయాలజీ (బోటనీ+జువాలజీ) 90 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు.
పరీక్ష మాధ్యమం: నీట్‌ను ఇంగ్లిష్‌తోపాటు హిందీ, ఇతర పలు ప్రాంతీయ భాషల్లోనూ రాసే వీలుంది. తెలుగులోనూ నీట్ పరీక్ష రాయొచ్చు.
విద్యార్హత: 10+2/ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ బయోటెక్నాలజీ సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ వర్గాల వర్గాల విద్యార్థులు 40 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. పీడబ్ల్యూడీ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధించాలి.
వయసు : ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టేనాటికి లేదా ప్రవేశాలు జరిగే సంవత్సరం డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్ల వయసు నిండి ఉండాలి. గరిష్టంగా 25 ఏళ్లలోపు ఉండాలి. ఓబీసీ, ఎస్టీ, ఎస్సీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
ముఖ్య సమాచారం
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2018, నవంబర్ 30.
పరీక్ష తేదీ: 2019, మే 5.
ఫలితాల వెల్లడి: 2019, జూన్ 5.
వెబ్‌సైట్: www.nta.ac.in,https://ntaneet.nic.in
ఫిజిక్స్:
- ఇందులో ప్రాబ్లమేటిక్ ప్రశ్నలు ఎక్కువగా కనిపించే అవకాశముంది. కాబట్టి ఎక్కువ సమయం ప్రాబ్లమ్స్‌ను సాధన చేసేందుకు కేటాయించడం మేలు.
- ప్రతి చాప్టర్‌లోని ముఖ్యాంశాలు, ఫార్ములాలను ప్రత్యేకంగా రాసుకోవాలి. వీటిని తరచు పునశ్చరణ చేసుకోవాలి. దీంతో అవి సులువుగా గుర్తుండే అవకాశం ఉంటుంది.
- అకాడమీ పుస్తకాల చివర్లో ఇచ్చిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం మేలు చేస్తుంది. ఫిజిక్స్‌కు సంబంధించి ఇంటర్ రెండేళ్ల సిలబస్‌కు సమ ప్రాధాన్యం ఉంటుంది.
- అటామిక్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, సెమీ కండక్టర్స్, కమ్యూనికేషన్ విభాగాల నుంచి థియరీ ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. గ్రావిటేషన్, ఎలక్ట్రోస్టాటిక్స్, మ్యాగ్నటిజమ్‌లలో భావనలు, అనువర్తనాలు ఒకేలా ఉంటాయి. వీటిని బేరీజు వేసుకుంటూ చదవాలి. ఎలక్ట్రోమాగ్నటిజం, ఏసీ సర్క్యూట్స్, రే ఆప్టిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ అంశాలు ముఖ్యమైనవి.
- వై.వి.ఎస్.ఎన్.మూర్తి, సబ్జెక్టు నిపుణులు.
కెమిస్ట్రీ..
కెమిస్ట్రీ..
- కెమిస్ట్రీని మూలక రసాయన శాస్త్రం (ఇనార్గానిక్ కెమిస్ట్రీ), కర్బన రసాయన శాస్త్రం (ఆర్గానిక్ కెమిస్ట్రీ), భౌతిక రసాయన శాస్త్రం (ఫిజికల్ కెమిస్ట్రీ).. ఇలా మూడు విభాగాలుగా విభజించొచ్చు.
- నీట్‌లో మంచి మార్కులకు జనరల్ కెమిస్ట్రీపై పట్టు సాధించడం అవసరం. జనరల్ కెమిస్ట్రీలో పరమాణు నిర్మాణం, రసాయన బంధం, ఆవర్తన పట్టిక, పర్యావరణ రసాయన శాస్త్రం అంశాలు ప్రధానమైనవి.
- ఇనార్గానిక్ కెమిస్ట్రీలో.. స్కోరింగ్‌కు ఆవర్తన పట్టికను అవపోసన పట్టడం ముఖ్యం.
- ఆర్గానిక్ కెమిస్ట్రీలో.. మెరుగైన స్కోర్ సాధించేందుకు రసాయన బంధం పాఠ్యాంశం ఉపయోగపడుతుంది.
- రసాయన బంధంలో పరమాణు ఆర్బిటాళ్ల సిద్ధాంతం (ఎం.ఓ.టీ-మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ), హైబ్రిడైజేషన్(సంకరీకరణం) వంటి అంశాలకు అధికంగా ప్రాముఖ్యం ఉంటుంది.
- పరమాణు నిర్మాణం చాలా ముఖ్యమైన పాఠ్యాంశం. దీన్నుంచి గణిత ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు.
- భౌతిక రసాయన శాస్త్రంలో స్టాయికియోమెట్రి, వాయుస్థితి, సమతాస్థితి, ఉష్టగతిక నియమాలు చాప్టర్ల నుంచి గణిత ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. విద్యార్థులు ప్రశ్నల ఆధారంగా ఫార్ములాను మార్చుకునే విధంగా ప్రాక్టీస్ చేయాలి.
- ద్రావణాలు, ఘనస్థితి, విద్యుత్ రసాయన శాస్త్రం, రసాయన గతిక శాస్త్రం, ఉపరితల రసాయన శాస్త్రం లాంటి చాప్టర్లల్లోనూ గణిత ఆధారిత ప్రశ్నలు కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో సిద్ధాంత ఆధారిత ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. కాబట్టి ఈ చాప్టర్లు కూడా కీలకమే.
- ఉపరితల రసాయన శాస్త్రంలో గ్రాఫ్ ఆధారిత ప్రశ్నలను ఎక్కువగా అడిగే అవకాశముంది.
- కర్బన రసాయన శాస్త్రం నుంచి దాదాపు 40 శాతం ప్రశ్నలొస్తాయి. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అధికంగా ప్రశ్నలు అడుగుతారు. కర్బన రసాయన శాస్త్రంలో నేమ్డ్ రీయాక్షన్స్ చాలా ముఖ్యమైనవి. వీటిలో చర్య విధానాన్ని ప్రాక్టీస్ చేయాలి.
- కార్బొనైల్ సమ్మేళనాలు, ఫినాల్, నైట్రోజన్ సమ్మేళనాలు, హాలోజన్ సమ్మేళనాలు ముఖ్యమైనవి. కార్బోహైడ్రేట్స్, పాలిమర్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ పాఠ్యాంశాలను నిర్లక్ష్యం చేయకూడదు.
- ఆల్కేనులు, ఆల్కీనులు, ఆల్కైనులకు సంబంధించిన ఫార్ములాలు అర్థం చేసుకోవాలి. సమన్వయ సమ్మేళనాలు, పర్యావరణ రసాయన శాస్త్రం పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు తప్పనిసరిగా అడుగుతున్నారు. అకడమిక్ పాఠ్య పుస్తకాల ప్రిపరేషన్‌కు అధిక ప్రాధాన్యమివ్వాలి.
- విజయ్ కిశోర్, సబ్జెక్ట్ నిపుణులు, కెమిస్ట్రీ.
బయాలజీ :
బయాలజీ :
- ఎన్‌సీఈఆర్‌టీ, స్టేట్ అకాడమీ బయాలజీ (బోటనీ, జువాలజీ) పుస్తకాల సిలబస్ దాదాపు ఒకే విధంగా ఉంటుంది. అకాడమీ పుస్తకాల్లోని సిలబస్ పూర్తిచేసుకుంటే.. నీట్‌లో 80 శాతానికి పైగా ప్రశ్నలకు సమాధానాలు గుర్తించొచ్చు.
- గత ప్రశ్నపత్రాల ఆధారంగా ప్రశ్నల సరళి, కాఠిన్యత స్థాయిపై అవగాహన పెంచుకోవాలి.
- బయలాజికల్ క్లాసిఫికేషన్, ప్లాంట్ కింగ్‌డమ్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తుంటాయి. కాబట్టి ప్లాంటు గ్రూపులకు సంబంధించి ఉదాహరణలు, లక్షణాలు తెలుసుకోవాలి. పరిణామాత్మక అంశాలు కూడా ముఖ్యమే. మార్ఫాలజీ చాప్టర్‌ను ప్రాక్టికల్ ఓరియెంటెడ్ టాపిక్‌గా చదవాలి.
- ఎకాలజీ, జెనిటిక్స్, బయోటెక్నాలజీ, ఫుడ్ ప్రొడక్షన్, ఉత్పాదకతను పెంచే వ్యూహాలను జాగ్రత్తగా అర్థం చేసుకొని చదవాలి. వీటి నుంచి విశ్లేషణాత్మక ప్రశ్నలు వస్తున్నాయి. వీటికి సంబంధించిన తాజా సమాచారాన్ని కూడా సేకరించుకొని చదవాలి. రిప్రొడక్టివ్ ప్యాట్రన్స్ ఇన్ ప్లాంట్స్, వాటి లైఫ్ సైకిల్స్‌ను అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఫ్లవరింగ్ ప్లాంట్స్‌లో రిప్రొడక్షన్‌ను అర్థం చేసుకోవడం ద్వారా ఈ చాప్టర్ నుంచి వచ్చే ప్రశ్నలకు సులువుగా సమాధానాలు గుర్తించొచ్చు.
- అనాటమీ నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు తేలిగ్గానే సమాధానాలు గుర్తించే వీలుంది. కాంప్లెక్స్ టిష్యూస్, సెకండరీ గ్రోత్, వాటి లక్షణాలను స్పష్టంగా తెలుసుకోవాలి.
- మొత్తం ప్లాంట్ ఫిజియాలజీ నుంచి అయిదారు ప్రశ్నలు రావొచ్చు. కాబట్టి వీటిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. సెల్ డివిజన్, ఇన్‌హెరిటెన్స్ లాస్‌కు సంబంధించి ప్రాథమిక భావనలపై పట్టు అవస రం. పటాల ఆధారంగా కూడా ప్రశ్నలుంటాయి.
- బి.రాజేంద్ర, సబ్జెక్టు నిపుణులు.
Published date : 14 Mar 2022 01:03PM