నాణ్యమైన విద్య c/o యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అందించే కోర్సులకు దేశ, విదేశాల్లో ఎంతో గుర్తింపు ఉంది. అర్హతలు, ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అందించే కోర్సులు, అర్హతలు, ప్రవేశ ప్రక్రియపై ప్రత్యేక కథనం...
వర్సిటీ ఘన చరిత్ర
- యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్) లో ఏ కోర్సు పూర్తిచేసినా ఉపాధికి, ఉద్యోగానికి డోకా ఉండదనే అభిప్రాయం ఉంది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఆకర్షణీయ ప్యాకేజీలు అందుకుంటున్నారు. ముఖ్యంగా సైన్స్, ఇంజనీరింగ్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కోర్సుల విద్యార్థులకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
- కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ(ఎంహెచ్ఆర్డీ) ఆధ్వర్యంలోని నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)లో 2019 సంవత్సరానికి.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంక్ లభించింది. అంతేకాకుండా నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్(నాక్) నుంచి టాప్ ఫైవ్ పాయింట్లతో ‘అ+++++’ గ్రేడ్ సొంతమైంది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్లో టాప్–600 వర్సిటీల్లో ఒకటిగా నిలిచింది.
అందుబాటులో ఉన్న కోర్సులు…
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 16 ఇంటిగ్రేటెడ్ కోర్సులు, 41 పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు, 15 ఎంఫిల్, 10 ఎంటెక్, 46 పీహెచ్డీ కోర్సులు అందిస్తోంది. ఈ ఏడాది నుంచి కొత్తగా 17 కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఎంఈడీ ఎడ్యుకేషన్, ఎంఏ జెండర్ స్టడీస్, ఎంఏ కమ్యూనికేషన్(మీడియా స్టడీస్), ఎంఏ కమ్యూనికేషన్(మీడియా ప్రాక్టిస్), ఎంటెక్ మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ వీఎల్ఎస్ఐ డిజైన్, ఎంటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎంఫిల్ కంప్యూటర్ లిటరేచర్, ఎంఫిల్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ ఇన్క్లూజన్ పాలసీ, ఎంఫిల్ రీజనల్ స్టడీస్, పీహెచ్డీ మైక్రోబయాలజీ, పీహెచ్డీ థియేటర్ ఆర్ట్స్, కంపారిటివ్ లిటరేచర్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్టడీస్, రీజనల్ స్టడీస్, కాగ్నిటివ్ సైన్స్, ఫోక్ కల్చర్ స్టడీస్, సోషల్ ఎక్స్క్లూజివ్ అండ్ ఇన్క్లూజివ్ పాలసీ వంటి కొత్త కోర్సులు ఉన్నాయి.
ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ (5 ఏళ్లు ) కోర్సులు
- ఎంఎస్సీ: మ్యాథమెటికల్ సైన్స్/ఫిజిక్స్/కెమికల్ సైన్స్/సిస్టమ్స్ బయాలజీ/అప్లయిడ్ జియాలజీ కోర్సులకు ఇంటర్మీడియెట్ సైన్స్ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. మ్యాథమెటికల్ సైన్స్, ఫిజిక్స్లో ప్రవేశానికి ఇంటర్ స్థాయిలో మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి.
- ఎంఎస్సీ హెల్త్ సైకాలజీ: ఆర్ట్స్ లేదా సైన్స్ గ్రూప్లో ఇంటర్మీడియెట్/తత్సమాన కోర్సులో 60 శాతం మార్కులు తప్పనిసరి.
- ఎం.ఆప్టోమెట్రీ(ఆరేళ్లు): ఇంటర్మీడియెట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
- ఎంఏ తెలుగు/లాంగ్వేజ్ సైన్స్/హిందీ: ఇంటర్మీ డియెట్ స్థాయిలో తెలుగు/ఇంగ్లిష్/ హిందీ ఒక సబ్జెక్టుగా కనీసం 60శాతం మార్కులతో ఉత్తీర్ణు లవ్వాలి. లేదా ఇంటర్మీడియెట్కు తత్సమా నమైన ఓరియెంటల్ టైటిల్ ఎగ్జామ్స్ పాసవ్వాలి.
- ఎంఏ ఎకనామిక్స్/హిస్టరీ/పొలిటికల్సైన్స్/ సోషియాలజీ/ఆంత్రోపాలజీ: 60 శాతం మార్కు లతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత తప్పనిసరి.
- ఎంఎస్సీ ప్రోగ్రామ్స్: మ్యాథమెటిక్స్/అప్లయిడ్ మ్యాథమెటిక్స్ /స్టాటిస్టిక్స్– ఆపరేషన్స్ రీసెర్చ్/ ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ బయోకెమిస్ట్రీ/ ప్లాంట్ బయా లజీ అండ్ బయో టెక్నాలజీ/ మాలిక్యులర్ బయాలజీ/యానిమల్ బయాలజీ అండ్ బయో టెక్నాలజీ.. ఈ కోర్సుల్లో చేరేందుకు ఆయా సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు.
- ఎంఎస్సీ ఓషన్∙అండ్ అట్మాస్పిరిక్ సైన్స్: 55 శాతం మార్కులతో ఏదైనా బీఎస్సీ డిగ్రీ (మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరి) లేదా బీటెక్ సివిల్/ మెకానికల్/ఎలక్ట్రికల్ పూర్తి చేసినవారు అర్హులు.
- ఎంఎస్సీ హెల్త్ సైకాలజీ: సైకాలజీ సబ్జెక్టుతో 60 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేయాలి.
- ఎంఎస్సీ న్యూరల్ అండ్ కాగ్నిటివ్ సైన్స్: 55 శాతం మార్కులతో డిగ్రీ చేసినవారు అర్హులు. నేచురల్ సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో డిగ్రీ/ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్, ఎంబీబీఎస్ చేసినవారు సైతం అర్హులే.
- ఎంపీహెచ్(పబ్లిక్ హెల్త్): మెడిసిన్/డెంటిస్ట్రీ/ ఆయుష్/ఫిజియోథెరపీ/వెటర్నరీ సైన్స్/ అగ్రికల్చరల్ సైన్స్/సోషల్ సైన్స్/ఏదైనా సైన్స్ డిగ్రీ పూర్తి చేసినవారు లేదా ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్లో డిగ్రీ పూర్తిచేసి.. పబ్లిక్ హెల్త్పై ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఇంగ్లిష్/ఫిలాసఫీ/హిందీ/తెలుగు/ఉర్దూ/అప్ల యిడ్ లింగ్విస్టిక్స్/కంపారిటివ్ లిటరేచర్/ హిస్టరీ/ పొలిటికల్సైన్స్/సోషియాలజీ/ఆంత్రోపాలజీ/ఎకనామిక్స్ /ఫైనాన్షియల్ ఎకనా మిక్స్/జెండర్ స్టడీస్/ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్టడీస్ కోర్సులు. వీటికి దరఖాస్తు చేసుకునేందుకు ఆయా సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులతో డిగ్రీ పాసవ్వాలి.
- ఎంఏ అప్లయిడ్ లింగ్విస్టిక్స్కు డిగ్రీ 10+2+3 విధానంలో పూర్తి చేయాలి.
- ఎంఏ ఆంత్రోపాలజీ, ఫిలాసఫీ వంటి కోర్సుల్లో చేరేందుకు ఏదైనా డిగ్రీ 50 శాతం మార్కులతో పూర్తి చేయాలి.
- ఎంఈడీ(ఎడ్యుకేషన్): ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం డిగ్రీతోపాటు బీఈడీ/ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు 50 శాతం మార్కులతో పూర్తి చేసినవారు అర్హులు.
- ఎంఏ కమ్యూనికేషన్(మీడియా స్టడీస్/మీడియా ప్రాక్టీస్): 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పాసైనవారు అర్హులు.
- అన్ని ఆర్ట్స్, సైన్స్ కోర్సుల్లోను ఎంఫిల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆయా సబ్జెక్టుల్లో పీజీ 55 శాతం మార్కులతో పాసైనవారు అర్హులు.
- ఎంఎఫ్ఏ ఆర్ట్ హిస్టరీ అండ్ విజువల్ స్టడీస్: డిగ్రీ ఫైన్ ఆర్ట్స్.. బీఎఫ్ఏ/బీవీఏ/బీఏ ఫైన్ఆర్ట్స్ పూర్తిచేసినవారు అర్హులు. లేదా హిస్టరీ, సోషియాలజీ, లిటరేచర్, ఆంత్రోపాలజీలో డిగ్రీ పూర్తి చేసివారికి కూడా ఎంఎఫ్ఏలో ప్రవేశం కల్పిస్తారు. వీరు ఫైన్ ఆర్ట్స్లో ఉన్న అనుభవాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
- ఎంఎఫ్ఏ ప్రింటింగ్/ప్రింట్ మేకింగ్/స్కల్పచర్: ఫైన్ ఆర్ట్స్లో బీఎఫ్ఏ/బీవీఏ/ బీఏ ఫైన్స్ ఆర్ట్స్ చేసినవారు అర్హులు.
- ఎంపీఏ థియేటర్ ఆర్ట్స్: ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు. థియేటర్ ఆర్ట్స్ లేదా పెర్ఫార్మింగ్ ఆర్ట్స్లో ప్రవేశం ఉన్న వారికి ప్రాధాన్యత లభిస్తుంది.
- ఎంపీఏ డ్యాన్స్(కూచిపూడి/భరతనాట్యం): డ్యాన్స్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా డిగ్రీతో పాటు డ్యాన్స్లో ప్రొఫెషనల్ డిప్లొమా లేదా డిగ్రీతో పాటు డ్యాన్స్లో సర్టిఫికెట్ పొందినవారు అర్హులు.
- ఎంబీఏ హెల్త్కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్: కనీసం 60శాతం మార్కులతో ఆయుర్వేదిక్/ హోమియో/యునాని/డెంటల్/ఫిజియోథెరపీ/నర్సింగ్/ఫార్మసీ/ ఫార్మ్–డి/మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ/బయోమెడికల్ అండ్ బయోటెక్నా లజీ/ ఎంబీబీఎస్లో 55 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. మెడికల్/ హెల్త్కేర్ రంగాలలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
- ఎంబీఏ బిజినెస్ అనలిస్టిక్స్: 60 శాతం మార్కులతో డిగ్రీ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసినవారు అర్హులు.
- ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ: వారాంతాల్లో కొనసాగే ఈ కోర్సులో చేరేందుకు అభ్యర్థులు 55 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మూడేళ్ల అనుభవం తప్పనిసరి.
- ఎంటెక్ మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ వీఎల్ఎస్ఐ డిజైన్(రెగ్యులర్): బీఈ/బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్టుమ్రెం టేషన్/ ఎలక్టాన్రిక్స్ 60 శాతం మార్కులతో పాసైనవారు అర్హులు.
- బయోకెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ/ యానిమల్ బయాలజీ అండ్ బయో టెక్నాలజీ/ యానిమల్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ కోర్సుల్లో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ–పీహెచ్డీ చేసేం దుకు అవకాశం కల్పిస్తోంది. సంబందిత సబ్జెక్టుల్లో బీఎస్సీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు అర్హులు.
- రెగ్యులర్గా అందించే అన్ని ఆర్ట్స్, సైన్స్, కల్చరల్ కోర్సుల్లోను పీహెచ్డీ చేసేందుకు అవకాశం ఉంది. అందుకోసం మాస్టర్స్ డిగ్రీలో 55 శాతం మార్కులు సాధించినవారు అర్హులు.
- పబ్లిక్ హెల్త్లో పీహెచ్డీకి సంబందిత సబ్జెక్టులో జేఆర్ఎఫ్/యూజీసీ–నెట్ ఉన్నవారు ఎంట్రన్స్ రాయనవసరం లేదు.
- బయో మెడికల్ సైన్స్లో పీహెచ్డీకి బయో కెమిస్ట్రీ/యానిమల్ సైన్స్/ బయోటెక్నాలజీ/ బయోసైన్స్/ టాక్సికాలజీ/ఫార్మకాలజీ/ మైక్రో బయాలజీలో పీజీ 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై.. జేఆర్ఎఫ్ పొందిన వారు మాత్రమే అర్హులు. వీరికి ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్ ఉండదు.
- దాదాపు చాలా కోర్సుల్లో సీట్లను వర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా భర్తీ చేస్తారు. ఎంసీఏ సీట్లను నిట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (నిమ్సెట్) స్కోరు ఆధారంగా, ఎంబీఏలో చేరేందుకు క్యాట్ స్కోరు, ఎంటెక్ సీట్లను కొన్ని కోర్సులకు గేట్ స్కోరు, మరికొన్నింటిని సీసీఎంటీలో ప్రతిభ ఆధారంగా కేటాయిస్తారు.
- అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్(కంప్యూటర్ సైన్స్)లో ప్రవేశాలు సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు(సీఎస్ఏబీ), జేఈఈ స్కోరు ఆధారంగా జరుగుతాయి. ఎంఎస్సీ బయోటెక్నాలజీలో జేఎన్యూ–న్యూఢిల్లీ నిర్వహించే సీఈఈబీలో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు లభిస్తుంది.
- దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.600, ఈడబ్ల్యూఎస్ రూ.550, ఓబీసీ–రూ.400, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు–రూ.275.
- దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేది: 03.05.2020
- పూర్తి వివరాలకు వెబ్ సైట్: http://acad.uohyd.ac.in