మేనేజ్‌మెంట్ పీజీ ప్రవేశాల్లో అమ్మాయిలదే హవా...
Sakshi Education
ప్రతిష్టాత్మక బీస్కూల్స్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)ల్లో చేరడానికి గతంలో అమ్మాయిలు జంకేవారు. ఎంతోకాలంగా ఐఐఎంల్లో అబ్బాయిలదే హవా. కానీ, ఇప్పుడు కాలం మారింది. కార్పొరేట్ ప్రపంచంలో మేము సైతం సత్తా చాటుతాం అంటూ.. అమ్మాయిలు ఐఐఎంలకు ైజై కొట్టడం తాజా ట్రెండ్! ఇటీవల ముగిసిన ఐఐఎంల ప్రవేశాల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. అన్ని ఐఐఎంల్లోనూ.. రెండేళ్ల పీజీ ప్రోగ్రామ్‌లలో విద్యార్థినుల సంఖ్య గణనీయంగా పెరిగింది! ఐఐటీల్లోనూ పరిస్థితి క్రమేణా మెరుగవుతోంది. ఈ నేపథ్యంలో దేశ టాప్ ఇన్‌స్టిట్యూట్స్‌లో అమ్మాయిల ప్రవేశాలు.. జెండర్ డైవర్సిటీ విధానాలు.. తాజా పరిస్థితిపై ప్రత్యేక కథనం...
పురుషాధిక్య కార్పొరేట్ ప్రపంచంలో మహిళలు రాణించగలరా.. బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులు అమ్మాయిలకు నప్పుతాయా... ప్రముఖ బీస్కూల్స్ ఐఐఎంల్లో ఎంబీఏ కోర్సులో విద్యార్థినులకు ప్రవేశం సాధ్యమయ్యేనా.. పని అనుభవం, ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్నవారికే అవకాశాలు ఎక్కువట!
- ఇవీ ఇంతకాలం ఐఐఎంల్లో అడ్మిషన్స్ విషయంలో మహిళా విద్యార్థుల్లో నెలకొన్న అభిప్రాయాలు !!
కానీ.. తాజాగా 2019-21 ప్రవేశాలకు సంబంధించి ఐఐఎంల్లో మహిళా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడాన్ని చూస్తే... వారి దృక్పథంలో స్పష్టమైన మార్పు వచ్చిందని అర్థమవుతోంది. తాము కూడా పురుషులకు దీటుగా మేనేజ్‌మెంట్ రంగంలో రాణించగలమనే ఆత్మవిశ్వాసంతో మహిళలు ముందడుగు వేస్తున్నారని స్పష్టమవుతోంది. అన్ని ఐఐఎంల్లోనూ ఈ ఏడాది మహిళా విద్యార్థుల సంఖ్య పెరగడం విశేషం.
30 నుంచి 40 శాతం మహిళలే..
సూపర్ న్యూమరరీ సీట్లు సైతం :
ఐఐఎంలలో మహిళా విద్యార్థుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో ఐఐఎం-కోజికోడ్, కాశీపూర్‌లు మరింత వినూత్నంగా అడుగులు వేస్తున్నాయి. అమ్మాయిలకు సూపర్ న్యూమరరీ సీట్లు కేటాయిస్తున్నాయి. కాశీపూర్‌లో మొత్తం విద్యార్థుల సంఖ్యకు అదనంగా 15 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తూ ఆ ఇన్‌స్టిట్యూట్ నిర్ణయం తీసుకుంది. ఐఐఎం-కోజికోడ్ 60 సీట్లతో మహిళలకు ప్రత్యేక బ్యాచ్‌ను ప్రారంభించింది.
జెండర్ డైవర్సిటీకి వెయిటేజీ :
ఐఐఎంల్లో ఈ ఏడాది మహిళా విద్యార్థుల సంఖ్య భారీగా పెరగడానికి ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు జెండర్ డైవర్సిటీకి ప్రత్యేక వెయిటేజీ విధానం అనుసరించడమే కారణమని చెప్పొచ్చు. అన్ని ఐఐఎంలు క్యాట్ స్కోర్‌తోపాటు మలిదశ ఎంపిక ప్రక్రియలో జెండర్ డైవర్సిటీకి వెయిటేజీ కేటాయిస్తున్నాయి. ఐఐఎం-రాయపూర్, రాంచీ, కాశీపూర్, రోహ్‌తక్, త్రిచి, ఉదయ్‌పూర్, బోధ్‌గయ, సంబల్‌పూర్, సిర్మౌర్‌లు.. జెండర్ డైవర్సిటీ పేరుతో అమ్మాయిలకు అయిదు శాతం వెయిటేజీ ఇస్తున్నాయి. ఐఐఎం-బెంగళూరు, కోల్‌కతాలు రెండు శాతం, లక్నో అయిదు శాతం, విశాఖపట్నం అయిదు శాతం చొప్పున ప్రత్యేక వెయిటేజీ ఇవ్వడం గమనార్హం. ఐఐఎం అహ్మదాబాద్ మాత్రం ఎలాంటి వెయిటేజీ ఇవ్వడం లేదు.
ఐఐఎం-కొత్త బిల్లు :
ఇటీవలే ఆమోదం పొందిన ఐఐఎం-బిల్లు ఆధారంగా భవిష్యత్తులో ఐఐఎంల్లో మహిళా విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ బిల్లులో ఐఐఎంలకు స్వయం ప్రతిపత్తితోపాటు మహిళా విద్యార్థులు ఐఐఎంల్లో చేరేలా చర్యలు తీసుకోవాలనే అంశాలను పేర్కొన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఐఐఎం-కోజికోడ్, కాశీపూర్ మాదిరిగానే ఇతర ఐఐఎంలు సైతం సూపర్ న్యూమరరీ సీట్లు అందుబాటులోకి తెచ్చే వీలుంది. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటైన ఐఐఎంలు మరింత చొరవ తీసుకునే అవకాశముంది. ఐఐటీల్లో విద్యార్థినులకు సూపర్ న్యూమరరీ సీట్లు కేటాయిస్తూ ఎంహెచ్‌ఆర్‌డీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఐఐఎంలలోనూ సూపర్ న్యూమరరీ విధానం అమల్లోకి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మారుతున్న దృక్పథం :
మేనేజ్‌మెంట్ విద్య, అందులోనూ ఐఐఎంల్లో అడుగుపెట్టాలనే విషయంలో మహిళా విద్యార్థుల దృక్పథంలోనూ మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాచిలర్ స్థాయిలో ఇంజనీరింగ్, సోషల్ వర్క్ వంటి కోర్సులు పూర్తిచేసిన విద్యార్థినులు.. ఐఐఎంల దిశగా అడుగులు వేస్తున్నారు. గత రెండు, మూడేళ్లుగా సదరు ఐఐఎంల్లోని విద్యార్థుల అకడమిక్ నేపథ్యాలే ఇందుకు నిదర్శనం. రెండేళ్ల పీజీ ప్రోగ్రామ్‌లే కాకుండా.. వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారికి నిర్వహించే ఎగ్జిక్యూటివ్ పీజీ ప్రోగ్రామ్‌లలో సైతం మహిళా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఈ విషయంలో అప్పటికే సదరు మహిళలు పనిచేస్తున్న సంస్థలు కూడా తోడ్పాటునందిస్తున్నాయి. ఎడ్యుకేషన్ లీవ్, ఫైనాన్షియల్ స్పాన్సర్‌షిప్ వంటి విధానాలను కూడా కొన్ని కంపెనీలు అమలు చేస్తున్నాయి.
కార్పొరేట్ వర్గాల్లో హర్షం :
ఐఐఎంల్లో మహిళా విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటంపై కార్పొరేట్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే సదరు సంస్థలు నియామకాల పరంగా మహిళలకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఐఐఎంల్లో చదివిన మహిళా విద్యార్థులను నియమిం చుకుంటే సంస్థల్లోనూ డైవర్సిటీ బ్యాలెన్స్ ఉంటుందని భావిస్తున్నాయి. అంతేకాకుండా ఐఐఎంలు వంటి టాప్ ఇన్‌స్టిట్యూట్‌లో చదివిన వారికి మంచి నైపుణ్యాలు ఉంటాయని.. వారు సంస్థ ఎదుగుదలకు తోడ్పడతారనే అభిప్రాయంతో కార్పొరేట్ సంస్థలు జెండర్ డైవర్సిటీ విధానాన్ని స్వాగతిస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు ఆపరేషన్స్, ఫైనాన్స్, కమ్యూనికేషన్స్ వంటి విభాగాల్లో ఉన్నతస్థాయిలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.
మరి ఐఐటీల్లో!
అమ్మాయిల ప్రవేశాల పరంగా ఐఐటీల్లో పరిస్థితి ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. ఐఐటీల్లో సూపర్ న్యూమరరీ కోటా విధానాన్ని ప్రవేశ పెట్టినప్పటికీ.. మహిళా విద్యార్థుల సంఖ్య నేటికీ తక్కువగానే నమోదవుతోంది. ఇందుకు మారని సామాజిక, కుటుంబ పరిస్థితులే కారణమనే వాదన ఉంది. చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లలను వందల కిలోమీటర్ల దూరంలోని ఐఐటీల్లో చేర్పించడంపై కొంత సంశయంతో ఉంటున్నారు. అందుకే ప్రవేశ పరీక్ష నుంచే అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంటోంది. ఇటీవల విడుదలైన జేఈఈ-అడ్వాన్స్‌డ్ ఫలితాలను పరిశీలిస్తే.. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం కొంత నయం అని చెప్పొచ్చు. గతేడాది మొత్తం 2076 మంది అమ్మాయిలు ఉత్తీర్ణులు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 5356కు చేరింది. ఉత్తీర్ణత సాధించిన వారిలోనూ కోర్సులో చేరే విద్యార్థినుల సంఖ్య తక్కువగా ఉంటోంది. గత సంవత్సరం 1780 మంది అమ్మాయిలు ఐఐటీల్లో ప్రవేశించారు.
ముఖ్యాంశాలు..

- ఈ ఏడాది టాప్ ఐఐఎంల్లో రెండేళ్ల పీజీ ప్రోగ్రామ్(ఎంబీఏ)లో ప్రవేశం పొందిన విద్యార్థుల్లో 30 నుంచి 40 శాతం మేరకు మహిళలే.
- ఐఐఎం-బెంగళూరులో మొత్తం 441 మంది విద్యార్థుల్లో 37శాతం(165) మంది అమ్మాయిలే.
- ఐఐఎం-లక్నోలో మొత్తం 405 మంది విద్యార్థుల్లో 148 మంది మహిళా విద్యార్థులే.
- ఐఐఎం-కోల్‌కతాలో మొత్తం 480 మంది విద్యార్థుల్లో 152 మంది మహిళలే.
- ఐఐఎం-కోజికోడ్‌లో మొత్తం 497 మంది విద్యార్థుల్లో 148 మంది విద్యార్థినులే.
- ఐఐఎం-సంబల్‌పూర్‌లో ఏకంగా 51 శాతం మంది మహిళా విద్యార్థులు ప్రవేశాలు ఖరారు చేసుకోవడం గమనార్హం.
- ఐఐఎం-ఇండోర్‌లో సైతం 42 శాతం మంది అమ్మాయిలే.
- తెలుగు రాష్ట్రాల్లోని ఏకైక ఐఐఎం.. ఐఐఎం-విశాఖపట్నంలో గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం మహిళా విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయింది. మొత్తం 123 మంది విద్యార్థుల్లో 36 శాతం మంది మహిళా విద్యార్థులే. గతేడాది ఈ సంఖ్య 17 శాతం మాత్రమే.
- ఐఐఎంలు అనగానే గుర్తొచ్చే ఐఐఎం-అహ్మదాబాద్‌లో మాత్రం గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం మహిళా విద్యార్థుల సంఖ్య కొంత తగ్గింది. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో మొత్తం 388 మంది విద్యార్థుల్లో 93 మంది(24 శాతం) మహిళా విద్యార్థులు అడుగు పెట్టారు. గత సంవత్సరం ఈ సంఖ్య 26 శాతంగా నమోదైంది.
- మొత్తంగా చూస్తే టాప్-సిక్స్ ఐఐఎంలుగా పేర్కొనే ఇన్‌స్టిట్యూట్‌లలో గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం మహిళా విద్యార్థుల సంఖ్య ఏడున్నర శాతం పెరిగింది. గత సంవత్సరం ఈ ఐఐఎంల్లో 26 శాతం మంది అమ్మాయిలు చేరితే.. ఈ ఏడాది 33.5 శాతం మంది మహిళా విద్యార్థులు ప్రవేశాలు ఖరారు చేసుకున్నారు.
సూపర్ న్యూమరరీ సీట్లు సైతం :
ఐఐఎంలలో మహిళా విద్యార్థుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో ఐఐఎం-కోజికోడ్, కాశీపూర్‌లు మరింత వినూత్నంగా అడుగులు వేస్తున్నాయి. అమ్మాయిలకు సూపర్ న్యూమరరీ సీట్లు కేటాయిస్తున్నాయి. కాశీపూర్‌లో మొత్తం విద్యార్థుల సంఖ్యకు అదనంగా 15 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తూ ఆ ఇన్‌స్టిట్యూట్ నిర్ణయం తీసుకుంది. ఐఐఎం-కోజికోడ్ 60 సీట్లతో మహిళలకు ప్రత్యేక బ్యాచ్‌ను ప్రారంభించింది.
జెండర్ డైవర్సిటీకి వెయిటేజీ :
ఐఐఎంల్లో ఈ ఏడాది మహిళా విద్యార్థుల సంఖ్య భారీగా పెరగడానికి ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు జెండర్ డైవర్సిటీకి ప్రత్యేక వెయిటేజీ విధానం అనుసరించడమే కారణమని చెప్పొచ్చు. అన్ని ఐఐఎంలు క్యాట్ స్కోర్‌తోపాటు మలిదశ ఎంపిక ప్రక్రియలో జెండర్ డైవర్సిటీకి వెయిటేజీ కేటాయిస్తున్నాయి. ఐఐఎం-రాయపూర్, రాంచీ, కాశీపూర్, రోహ్‌తక్, త్రిచి, ఉదయ్‌పూర్, బోధ్‌గయ, సంబల్‌పూర్, సిర్మౌర్‌లు.. జెండర్ డైవర్సిటీ పేరుతో అమ్మాయిలకు అయిదు శాతం వెయిటేజీ ఇస్తున్నాయి. ఐఐఎం-బెంగళూరు, కోల్‌కతాలు రెండు శాతం, లక్నో అయిదు శాతం, విశాఖపట్నం అయిదు శాతం చొప్పున ప్రత్యేక వెయిటేజీ ఇవ్వడం గమనార్హం. ఐఐఎం అహ్మదాబాద్ మాత్రం ఎలాంటి వెయిటేజీ ఇవ్వడం లేదు.
ఐఐఎం-కొత్త బిల్లు :
ఇటీవలే ఆమోదం పొందిన ఐఐఎం-బిల్లు ఆధారంగా భవిష్యత్తులో ఐఐఎంల్లో మహిళా విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ బిల్లులో ఐఐఎంలకు స్వయం ప్రతిపత్తితోపాటు మహిళా విద్యార్థులు ఐఐఎంల్లో చేరేలా చర్యలు తీసుకోవాలనే అంశాలను పేర్కొన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఐఐఎం-కోజికోడ్, కాశీపూర్ మాదిరిగానే ఇతర ఐఐఎంలు సైతం సూపర్ న్యూమరరీ సీట్లు అందుబాటులోకి తెచ్చే వీలుంది. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటైన ఐఐఎంలు మరింత చొరవ తీసుకునే అవకాశముంది. ఐఐటీల్లో విద్యార్థినులకు సూపర్ న్యూమరరీ సీట్లు కేటాయిస్తూ ఎంహెచ్‌ఆర్‌డీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఐఐఎంలలోనూ సూపర్ న్యూమరరీ విధానం అమల్లోకి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మారుతున్న దృక్పథం :
మేనేజ్‌మెంట్ విద్య, అందులోనూ ఐఐఎంల్లో అడుగుపెట్టాలనే విషయంలో మహిళా విద్యార్థుల దృక్పథంలోనూ మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాచిలర్ స్థాయిలో ఇంజనీరింగ్, సోషల్ వర్క్ వంటి కోర్సులు పూర్తిచేసిన విద్యార్థినులు.. ఐఐఎంల దిశగా అడుగులు వేస్తున్నారు. గత రెండు, మూడేళ్లుగా సదరు ఐఐఎంల్లోని విద్యార్థుల అకడమిక్ నేపథ్యాలే ఇందుకు నిదర్శనం. రెండేళ్ల పీజీ ప్రోగ్రామ్‌లే కాకుండా.. వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారికి నిర్వహించే ఎగ్జిక్యూటివ్ పీజీ ప్రోగ్రామ్‌లలో సైతం మహిళా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఈ విషయంలో అప్పటికే సదరు మహిళలు పనిచేస్తున్న సంస్థలు కూడా తోడ్పాటునందిస్తున్నాయి. ఎడ్యుకేషన్ లీవ్, ఫైనాన్షియల్ స్పాన్సర్‌షిప్ వంటి విధానాలను కూడా కొన్ని కంపెనీలు అమలు చేస్తున్నాయి.
కార్పొరేట్ వర్గాల్లో హర్షం :
ఐఐఎంల్లో మహిళా విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటంపై కార్పొరేట్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే సదరు సంస్థలు నియామకాల పరంగా మహిళలకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఐఐఎంల్లో చదివిన మహిళా విద్యార్థులను నియమిం చుకుంటే సంస్థల్లోనూ డైవర్సిటీ బ్యాలెన్స్ ఉంటుందని భావిస్తున్నాయి. అంతేకాకుండా ఐఐఎంలు వంటి టాప్ ఇన్‌స్టిట్యూట్‌లో చదివిన వారికి మంచి నైపుణ్యాలు ఉంటాయని.. వారు సంస్థ ఎదుగుదలకు తోడ్పడతారనే అభిప్రాయంతో కార్పొరేట్ సంస్థలు జెండర్ డైవర్సిటీ విధానాన్ని స్వాగతిస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు ఆపరేషన్స్, ఫైనాన్స్, కమ్యూనికేషన్స్ వంటి విభాగాల్లో ఉన్నతస్థాయిలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.
మరి ఐఐటీల్లో!
అమ్మాయిల ప్రవేశాల పరంగా ఐఐటీల్లో పరిస్థితి ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. ఐఐటీల్లో సూపర్ న్యూమరరీ కోటా విధానాన్ని ప్రవేశ పెట్టినప్పటికీ.. మహిళా విద్యార్థుల సంఖ్య నేటికీ తక్కువగానే నమోదవుతోంది. ఇందుకు మారని సామాజిక, కుటుంబ పరిస్థితులే కారణమనే వాదన ఉంది. చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లలను వందల కిలోమీటర్ల దూరంలోని ఐఐటీల్లో చేర్పించడంపై కొంత సంశయంతో ఉంటున్నారు. అందుకే ప్రవేశ పరీక్ష నుంచే అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంటోంది. ఇటీవల విడుదలైన జేఈఈ-అడ్వాన్స్‌డ్ ఫలితాలను పరిశీలిస్తే.. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం కొంత నయం అని చెప్పొచ్చు. గతేడాది మొత్తం 2076 మంది అమ్మాయిలు ఉత్తీర్ణులు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 5356కు చేరింది. ఉత్తీర్ణత సాధించిన వారిలోనూ కోర్సులో చేరే విద్యార్థినుల సంఖ్య తక్కువగా ఉంటోంది. గత సంవత్సరం 1780 మంది అమ్మాయిలు ఐఐటీల్లో ప్రవేశించారు.
ముఖ్యాంశాలు..
- ఐఐఎంల్లో జెండర్ డైవర్సిటీ విధానాలు అమలు.
- గతేడాదితో పోల్చితే గణనీయంగా పెరిగిన అమ్మాయిల సంఖ్య.
- టాప్-6 ఐఐఎంలలో 33.5 శాతం మహిళా విద్యార్థులే.
- ఐఐఎం-కోజికోడ్, కాశీపూర్‌లలో సూపర్ న్యూమరరీ సీట్లు.
- ఐఐఎం-బిల్లుతో మరింత పెరగనున్న మహిళా విద్యార్థులు.
మేనేజ్‌మెంట్ లీడర్స్‌గా.. మేనేజ్‌మెంట్ విద్య చదవాలనే విషయంలో గతంతో పోల్చితే ప్రస్తుతం అమ్మాయిల ఆలోచన సానుకూలంగా మారుతోంది. అందుకే క్యాట్‌కు హాజరయ్యే వారి సంఖ్య, ప్రవేశాలు ఖరారు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఐఐఎంల్లో చేరుతున్న విద్యార్థినులు తాము ఫ్యూచర్ మేనేజ్‌మెంట్ లీడర్స్‌గా ఎదగాలనే ధృడ సంకల్పంతో వస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. - ప్రొఫెసర్ అభయ్ కుమార్, డీన్, అకడమిక్ ప్రోగ్రామ్స్, ఐఐఎం-బెంగళూరు. |
Published date : 03 Aug 2019 02:30PM