Skip to main content

మేనేజ్‌మెంట్ కోర్సుల కోసం ఎక్స్‌ఏటీ-2021.. పరీక్ష విధానం ఇదిగో..

ఎక్స్‌ఏటీ-2021తో మంచి ఇన్‌స్టిట్యూట్‌లో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చదవడంతో పాటు మంచి భవిష్యత్తు కూడా పొందొచ్చు.. అలాంటి ఈ పరీక్ష విధానంపై కథనం..


ఎక్స్‌ఏటీ-2021లో నాలుగు విభాగాలు ఉంటాయి. పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో జరుగుతుంది. వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ 26 ప్రశ్నలు-26 మార్కులు; డెసిషన్ మేకింగ్ 21 ప్రశ్నలు-21 మార్కులు; క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ 28 ప్రశ్నలు-28 మార్కులు; జనరల్ నాలెడ్జ్ 100 ప్రశ్నలు-100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు.

{పిపరేషన్ గెడైన్స్..
అభ్యర్థులు ముందుగా ఎక్స్‌ఏటీ ఎగ్జామ్ ప్యాట్రన్, సిలబస్ గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత ప్రామాణిక పుస్తకాలు, మెటీరియలను సేకరించాలి. ఎప్పటికప్పుడు మాక్‌టెస్టులు రాయాలి. బ విభాగాల వారీగా ప్రిపేరవ్వాలి, డెసిషన్ మేకింగ్ విభాగంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.

వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్..
  • ఈ విభాగంలో మంచి మార్కులు సాధించాలంటే.. లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ తప్పనిసరి. ఈ దిశగా అభ్యర్థులు పత్రికల్లో వచ్చే సైకాలజీ, టెక్నాలజీ, సోషియాలజీలకు సంబంధించిన వ్యాసాలను చదవడం లాభిస్తుంది. అలాగే వేగంగా చదవడం, కాంప్రహెన్షన్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవాలి.
  • రీడింగ్ కాంప్రహెన్షన్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. వీటికి సంబంధించి హ్యూమర్, సర్కాస్టిక్, ఐరానికల్, నోస్టాల్జిక్ శౌలికి చెందిన రీడింగ్ కాంప్రహెన్షన్స్‌ను ప్రాక్టీస్ చేయాలి.
  • గత ప్రశ్నపత్రాలను సాధించడంతోపాటు వర్డ్ ఆఫ్ ది డే, వర్డ్స్ యూసేజ్ వంటి ఆన్‌లైన్ వర్డ్ ఎన్‌హ్యాన్సర్ల సేవలను వినియోగించుకోవాలి. యాంటోనిమ్స్, సినానిమ్స్, ప్రిఫిక్స్, సఫిక్స్‌ల గురించి తెలుసుకోవాలి. వీటితోపాటు సాధ్యమైనన్ని మాక్ టెస్టులకు హాజరవ్వాలి.
క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఎంటర్‌ప్రిటేషన్..
  • ఈ విభాగానికి సంబంధించి జామెట్రి, మెన్సురేషన్, క్యాల్కులేషన్స్‌తోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్‌పై పట్టు సాధించాలి.
  • క్యాల్కులేషన్, అప్రాక్సిమేషన్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలి.
  • లైన్ గ్రాఫ్స్, పై చార్ట్స్, ట్యాబ్యులర్ గ్రాఫ్స్, ఫ్రాక్షన్ వ్యాల్యూస్‌ను ప్రాక్టీస్ చేయాలి.
  • డేటా ఇంటర్‌ప్రిటేషన్ సెట్స్‌ను ప్రాక్టీస్ చేయాలి.
  • మ్యాథమెటికల్ థింకింగ్‌ను పెంపొందించుకోవాలి. పేపర్‌లెస్ క్యాల్కులేషన్స్ చేయాలి.
  • జామెట్రి, ప్రాఫిట్ అండ్ లాస్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్‌పై అధిక దృష్టిపెట్టాలి.
  • పతి వారం రెండు లేదా మూడు మాక్ టెస్టులకు హాజరవ్వాలి.
డెసిషన్ మేకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్..
  • ఇది పరీక్షలోనే అత్యంత క్లిష్టమైన విభాగం. ఇందులో ఎక్కువ మార్కులు సాధించాలంటే.. గరిష్ట ప్రాక్టీస్ అవసరం. ఇందులో ప్రశ్నలను సాధించే సమయంలో వివక్షకు తావులేని, విలువలతో కూడిన నిర్ణయాలు తీసుకునే తరహాలో వ్యవహరించాలి. ప్రాక్టీస్, విశ్లేషణలతోనే ఇది సాధ్యమౌతుంది.
{పశ్నల రకాలు..
  • ఎథికల్ డైలమా బ మేనేజ్‌మెంట్ ఇష్యూ బ క్రిటికల్ రీజనింగ్ బ సిట్యుయేషనల్ బ కేస్ సెట్స్ బ డేటా అరేంజ్‌మెంట్ సెట్స్ బ అనలిటికల్ అండ్ లాజికల్ రీజనింగ్.
  • డెసిషన్ మేకింగ్ ప్రశ్నలను సాధించే సమయంలో.. ప్రశ్నలను సమగ్రంగా చదవాలి బ స్వీయ నమ్మకాన్ని ప్రదర్శించాలి బ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఊహించగలగాలి బ డేటాలోనే సమాధానం ఉంటుంది. కాబట్టి డేటాను సమగ్రంగా చదవాలి.
జనరల్ అవేర్‌నెస్..
చరిత్ర-ముఖ్య సంఘటనలను అధ్యయనం చేయాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై థియరిటికల్, ప్రాక్టికల్ అవగాహనను పెంపొందించుకోవాలి. పాలిటీ, భారత రాజ్యాంగం, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించిన అంశాలపై పట్టుసాధించాలి. ఆ దిశగా హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ స్టాండర్డ్, బిజినెస్ లైన్, లైవ్ మింట్ తదితర దినపత్రికలను చదవడం లాభిస్తుంది.

ముఖ్యసమాచారం.. .
  • దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30
  • అడ్మిట్ కార్డులు జారీ ప్రారంభం: డిసెంబరు 20
  • ఎక్స్‌ఏటీ నిర్వహణ తేదీ: జనవరి 3, 2021
  • పరీక్ష విధానం: ఆన్‌లైన్
  • దరఖాస్తు ఫీజు: రూ.1750.
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, వరంగల్.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://xatonline.in
Published date : 30 Sep 2020 05:44PM

Photo Stories