క్యాట్‌తో ఐఐఎంలో సీటు రాకుంటే.. ఏం చేయాలో తెలుసా?
Sakshi Education
ఐఐఎంల్లో అవకాశం లభిస్తే ఆనందమే. ఒకవేళ అవకాశం దక్కకుంటే.. ఏం చేయాలో కూడా ముందే ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించి పెట్టుకోవాలి.
ఐఐఎంల తర్వాత ప్రముఖంగా నిలుస్తున్న బీస్కూల్స్ ఎంపిక ప్రక్రియపై అవగాహన పెంచుకోవాలి. దేశంలోని ప్రధాన బీ స్కూల్స్ జాబితా సిద్ధం చేసుకొని.. అక్కడి స్పెషలైజేషన్స్, బోధన, ప్లేస్‌మెంట్స్, ప్రమాణాల గురించి వివిధ మార్గాల ద్వారా తెలుసుకొనే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా గతేడాది ఆయా కాలేజీల్లో ఎంత స్కోరు వరకు అడ్మిషన్లు ఇచ్చారో తెలుసుకోవాలి. దీనివల్ల ఫలితాలు వెలువడగానే సదరు స్కోరు ఆధారంగా నచ్చిన బీ-స్కూల్స్‌కు దరఖాస్తు చేసుకునే వీలుంటుంది.
2019 అభ్యర్థుల ప్రాధాన్యం ఇదీ..
గత సంవత్సరం క్యాట్ స్కోరు సాధించిన అభ్యర్థులు తమ ప్రాధాన్యతను తొలుత ఐఐఎంలకు ఇచ్చారు. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో ఎంబీఏ (ఎఫ్‌ఎంఎస్) చేసేందుకు ఆసక్తి చూపారు. అభ్యర్థులు అడ్మిషన్లకు ఆసక్తి చూపిన పలు ఇన్‌స్టిట్యూట్స్ వివరాలు..
- ఐఐఎంలు
- ఢిల్లీ యూనివర్సిటీ
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఆనంద్(ఐఆర్ ఎంఏ
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్(ఎన్‌ఐటీఐఈ), ముంబై
- జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లేబర్ రిలేషన్స్(ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ), బిట్స్ పిలానీ
- ఐబీఎస్ హైదరాబాద్, ఐఐటీలు
- ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్, ఢిల్లీ
- జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ముంబై తదితరాలు.
ఇంకా చదవండి: part 1: జనవరి రెండో వారంలో క్యాట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం.. కటాఫ్ ఇలా..
Published date : 17 Dec 2020 02:43PM