కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి.. ఇవి సైతం వర్చువల్‌గా..
కాలేజ్ ల్యాబ్‌లో మౌలిక సదుపాయాలు సరిగాలేని విద్యార్థులు.. వర్చువల్ ల్యాబ్స్ ద్వారా ప్రయోజనం పొందొచ్చు. థియరీకి సంబంధించి మరింత లేటెస్ట్ నైపుణ్యాలు పొందాలనుకునే విద్యార్థులకు వర్చువల్ ల్యాబ్స్ ఎంతో ఉపయుక్తమని చెప్పొచ్చు.
ఇటీవల కాలంలో ప్రధానంగా 3–డి డిజైన్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాల్లో వర్చువల్ ల్యాబ్స్ ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ స్కిల్స్‌కు జాబ్ మార్కెట్లో నెలకొన్న డిమాండ్ ఇందుకు కారణమని చెప్పొచ్చు. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి తమ ఇన్‌స్టిట్యూట్స్‌లో సదుపాయాలు లేని విద్యార్థులు.. వర్చువల్ ల్యాబ్‌ను అనుసరించడం మేలు. విద్యార్థులు తమ ప్రొఫెసర్లను, సీనియర్లను, తమ డొమైన్‌కు సంబంధించిన నిపుణుల సలహాలను తీసుకొని.. తమ కోర్సుకు, సబ్జెక్ట్‌కు తగిన వర్చువల్ ల్యాబ్స్‌ను ఎంచుకోవాలి. వాటిద్వారా ప్రాక్టికల్ నైపుణ్యం సొంతం చేసుకునేందుకు కృషి చేయాలి.
ఇంకా చదవండి: part 4: మంచి మార్కులు సాధించిన.. ఈ నైపుణ్యాలు లేకుంటే..